Lust Stories 2 Review యజమాని ఇంట్లో పనిమనిషి రాసలీలలు.. లస్ట్ స్టోరీస్ 2 రివ్యూ.. కొంకణ డైరెక్షన్ ఎలా ఉందంటే?

నటీనటులు: తిలోత్తమ షోమే, అమృత సుభాష్ తదితరులు
దర్శకత్వం: కొంకణాసేన్
నిర్మాతలు: ఆషీ దువా, రోని స్క్రీవాలా
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్: 2023-06-29

ఇషిత (తిలోత్తమ షోమే) తన ఇంటిలో సీమ (అమృతా సుభాష్)‌ను పనిమనిషిగా పెట్టుకొంటుంది. పనిమనిషిని పూర్తిగా నమ్మి ఇంటి తాళాలు చేతిలో పెడుతుంది. ఇషిత ఉద్యోగం కోసం బయటకు వెళితే.. సీమ ఓ వ్యక్తితో రెగ్యులర్‌గా ఇంటిలో రాసలీలలు నడుపుతుంటుంది. అనుకోకుండా ఓ రోజు ఇషిత ఇంటికి త్వరగా రావడంతో తన పడక గదిలో సీమ శృంగారం బయటపడుతుంది.

ఇషిత ఇంటిలో సీమ ఎవరితో శృంగారం జరుపుతూ ఉంటుంది? సీమ రాసలీలలను చూసిన తర్వాత ఇషిత రియాక్షన్ ఏమిటి? సీమ అలాంటి పనులు చేసినా ఇంటి నుంచి పంపించకుండా కొన్ని రోజులు ఆగింది. చివరకు సీమ విషయంలో ఇషిత ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది. ఇషిత నిర్ణయంతో సీమ రియాక్షన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే హీరోయిన్ కొంకణా సేన్ దర్వకత్వం వహించిన తిలోత్తమ షోమే, అమృత సుభాష్‌ ఎపిసోడ్ కథ.

Lust Stories 2

ఎన్నో బోల్డ్ సినిమాల్లో, అర్ధవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకొన్న కొంకణాసేన్ లవ్, ఎమోషన్స్ కలిసి ఉన్న పాయింట్‌తో కథను తెరకెక్కించింది. ఇద్దరు మహిళల భావోద్వేగం, మానసిక సంఘర్షణను ఓ మహిళా దర్శకురాలిగా చక్కగా చూపించింది. అవసరాలు, కోరికలు, స్వార్ధం అనే విషయాలను లైట్‌గా టచ్ చేస్తూ కొంకణా సేన్ కథను రసవత్తరంగా నడిపించింది.

Lust Stories 2

కొంకణా సేన్ సృష్టించిన రెండు ఎమోషనల్ పాత్రల్లో తిలోత్తమ షోమే, అమృతా సుభాష్ అద్బుతంగా ఒదిగిపోయారు. పూర్తిగా బోల్డ్ పాత్రలకు న్యాయం చేశారు. కేవలం అడల్డ్ కంటెంట్‌కు పరిమితం కాకుండా ఉన్న పాత్రల్లో అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్ చేశారు. మురికి వాడల జీవితాన్ని, సంపన్నుల జీవితాల్లో ఉంటే ఎమోషన్స్‌ను టచ్ చేసేందుకు ప్రయత్నించారు. తమ పాత్రలను చాలా నేచురల్‌గా పోషించారు.

Lust Stories 2

లస్ట్ స్టోరీస్ 2 సిరీస్‌లో కొంకణాసేన్ దర్శకత్వం వహించిన ఎపిసోడ్‌లో టెక్నికల్ అంశాలు కూడా బాగున్నాయి. ఎమోషన్స్‌ను ఇంపాక్ట్‌గా చూపించడానికి ఉపయోగించిన లైటింగ్, కలర్ ప్యాటర్న్ బాగుంది. రీరికార్డింగ్ కూడా సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా రిచ్‌గా ఉన్నాయి.

Lust Stories 2

శృంగారమే జీవితంగా భావించే ఓ మహిళ.. శృంగారాన్ని ఆస్వాదించే మరో మహిళకు మధ్య జరిగే మానసిక సంఘర్షణను లస్ట్ స్టోరిస్‌లో కొంకణాసేన్ ఎపిసోడ్ చూపిస్తుంది. అడల్ట్ సీన్లు కొంత ఎక్కువగానే ఉన్నాయి. ఇంట్లో చూసేటప్పుడు పిల్లల్ని దూరంగా ఉంచండి. అడల్ట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ ఎపిసోడ్ నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X