Lust Stories 2 Review పెళ్లికి ముందే శృంగారం.. రెచ్చిపోయిన మృణాల్.. లస్ట్ స్టోరీస్ 2 రివ్యూ

నటీనటులు: మృణాల్ థాకూర్, అంగద్ బేడీ, నీనా గుప్తా తదితరులు
నిర్మాతలు: ఆషీ దువా, రోని స్క్రీవాలా
దర్శకులు: ఆర్ బాల్కీ, సుజోష్ ఘోష్, అమిత్ రవీంద్రనాధ్ శర్మ, కొంకణాసేన్
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్: 2023-06-29

మృణాల్ థాకూర్‌కు ఆధునిక భావాలు ఆలోచనలు ఉన్న నానమ్మ (నీనా గుప్తా) ఉంటుంది. వేద (మృణాల్‌ థాకూర్)కు అంగద్ బేడీ (అర్జున్) పెళ్లి చూపులు జరుగుతాయి. అయితే మ్యారేజ్‌కు ముందే సెక్స్ అనుభవం ఉందా? అని పెళ్లిచూపుల్లో మోడరన్ బామ్మ బాంబు పేల్చుతుంది. తన మనవరాలిని పెళ్లికి ముందే సెక్స్ అనుభవం పొందాలని కోరుతుంది. పెళ్లికి ముందే శృంగార సామర్థ్యం ఉందా అని పరిశీలించుకోవాలని సలహా ఇస్తుంది. సెక్స్‌లో సామర్థ్యం ఉంటే దాంపత్య జీవితంలో ఎలాంటి బ్రేకప్స్ ఉండవని మనవరాలితో పోరు పెడుతుంది.

Lust Stories 2 Review and Rating: Mrunal Thakur episode Review

మోడరన్ నానమ్మ మాటలను మృణాల్ పాటించిందా? పెళ్లికి ముందే కాబోయే భర్తతో సెక్స్‌లో పాల్గొన్నదా? తన తల్లి మాటలను మృణాల్ తండ్రి ఎలా తీసుకొన్నాడు? పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనకుంటే.. వివాహం జరిపించే ప్రసక్తి లేదని మోడరన్ నానమ్మ శపథం నెరవేరిందా? అంగద్, మృణాల్ థాకూర్ పెళ్లికి నానమ్మ అడ్డుపడిందా? చివరకు మృణాల్ పెళ్లి అంగద్ బేడితో జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే లస్ట్ స్టోరీస్ 2లో మృణాల్ థాకూర్ ఎపిసోడ్ కథ.

ప్రస్తుత జనరేషన్‌లో పెళ్లి జరగడం ఎంత కష్టమో.. పెళ్లి తర్వాత విడాకులు తీసుకోవడం అంత సులభంగా మారింది. ఆలుమగల మధ్య శృంగారపరమైన సంబంధాలు వైవాహిక జీవితం విఫలం కావడానికి కారణాలు అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు చాలా బోల్డ్ కంటెంట్, డైలాగ్స్‌తో కథను డిజైన్ చేశారనిపిస్తుంది.

Lust Stories 2 Review and Rating: Mrunal Thakur episode Review

లస్ట్ స్టోరీస్ 2 ఫస్ట్ ఎపిసోడ్‌లో తమ పాత్రల్లో మృణాల్ సేన్, అంగద్ బేడీ లీనమై నటించారు. నీనా గుప్తా అద్బుతమైన హావభావాలు, ఎమోషన్స్ పలికించారు. బోల్డ్ డైలాగ్స్‌తో కేక పెట్టించారు. విజువల్‌గా కంటే డైలాగ్స్‌లో కాస్త బోల్డ్ డోస్ ఎక్కువైందనిపిస్తుంది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కెమెరా, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. ఇండోర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం కారణంగా సినిమాటోగ్రాఫర్‌కు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. సన్నివేశాలకు అనుగుణంగా, సందర్బోచితంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి.. పిల్లలు లేకుండా జాగ్రత్త పడి సినిమా చూడండి. అడల్డ్ కంటెంట్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ ఎపిసోడ్ నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X