Lust Stories 2 Review.. తమన్నా, విజయ్ ఘాటైన రొమాన్స్.. ట్విస్టుతో అదరగొట్టిన సుజోష్ ఘోష్

బిజినెస్ మ్యాన్ విజయ్ ( విజయ్ వర్మ) భార్య అను, పిల్లలతో కలిసి వైవాహిక జీవితాన్ని అనుభవిస్తుంటాడు. అనుకొని పరిస్థితుల్లో ఓ గ్రామంలో తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా భాటియా)ని కలుసుకొంటాడు. బ్రేకప్‌కు ముందు విషయాలను గుర్తు చేసుకొని వారిద్దరూ శారీరకంగా ఒకటైతారు. అయితే శారీరకంగా సుఖాన్ని అనుభవించిన తర్వాత శాంతిపై దారుణంగా దాడి చేస్తాడు.

శాంతికి విజయ్ ఎందుకు దూరం అయ్యాడు? శాంతి, అను మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది. బ్రేకప్ తర్వాత ఏ పరిస్థితుల్లో శాంతిని విజయ్ కలిశాడు? బ్రేకప్ తర్వాత శాంతిని శృంగారానికి ఎలా ఒప్పించాడు? శృంగారం తర్వాత ఎందుకు శాంతిపై దాడి చేశాడు? చివరకు విజయ్ పరిస్థితి ఏమైందనే ప్రశ్నలకు సమాధానమే లస్ట్ స్టోరీస్‌ 2లోని తమన్నా, విజయ్ వర్మకు సంబంధించిన కథ.

Lust Stories 2 Review and Rating: Sujosh Goshs Tamannaah Bhatia, Vijay Varmas feel good story

బిజినెస్‌ పనిపై వెళ్లి తిరిగి వస్తున్న విజయ్‌ ఊహించిన విధంగా యాక్సిడెంట్‌కు గురవుతాడు. ఆ పరిస్థితుల్లో శాంతిని అనుకోని విధంగా కలుస్తాడు. ఆ తర్వాత కథలో రకరకాల ట్విస్టులు, ఎమోషన్స్ చోటు చేసుకొంటాయి. విజయ్ వర్మ, తమన్నా భాటియా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. దర్శకుడు సుజోష్ ఘోష్ సన్నివేశాలను, కథను ఇంట్రెస్టింగ్‌గా డీల్ చేశాడు. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తోపాటు షాకింగ్ ట్విస్టుతో ఎపిసోడ్‌ను ముగించడం ఈ ఎపిసోడ్‌ను ఫీల్‌గుడ్‌గా మార్చింది.

లస్ట్ స్టోరీస్ 2 లో మూడో ఎపిసోడ్‌లో తమన్నా, విజయ్ వర్మ కథ ఉంటుంది. కేవలం రెండు క్యారెక్టర్ల మధ్యనే కథ సాగుతుంది. శాంతిగా తమన్నా, విజయ్‌గా విజయ్ వర్మ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. పాత్రల్లో పూర్తిగా లీనమై రొమాన్స్‌ను పండించారు. రొమాంటిక్ పేరుతో కొన్ని శృంగార సన్నివేశాలు తప్పా.. మిగితాది అంతా ఫీల్‌గుడ్ గానే ఉంటుంది.

Lust Stories 2 Review and Rating: Sujosh Goshs Tamannaah Bhatia, Vijay Varmas feel good story

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి బాగుంది. స్పెషల్ కలర్ ప్యాటర్న్‌తో సన్నివేశాలు చిత్రీకరించడం సీన్లను రిచ్‌గా మార్చిందని చెప్పవచ్చు. మ్యూజిక్, ఇతర అంశాలు ఆకట్టుకొన్నాయి. డైలాగ్స్, కంటెంట్ డిజైన్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

Lust Stories 2 Review and Rating: Sujosh Goshs Tamannaah Bhatia, Vijay Varmas feel good story

లస్ట్ స్టోరీ 2లోని తమన్నా, విజయ్ వర్మ ఎపిసోడ్ విషయానికి వస్తే.. లవ్, ఎమోషన్స్, రొమాంటిక్ అంశాలు కలబోసిన ఉన్నాయి. అయితే ముందుగా ప్రచారం అయినట్టు పెద్దగా అశ్లీలత,అసభ్యత లేదు. కానీ కొన్ని రొమాంటిక్ సీన్లు ఘాటుగానే ఉన్నాయి. కానీ వాటన్నింటి కంటే.. రివేంజ్ డ్రామా ట్విస్టు ఎపిసోడ్‌లో హైలెట్‌గా చెప్పుకోవచ్చు. పిల్లలు లేని సమయంలో కాస్త కేర్‌ఫుల్‌గా ఈ ఎపిసోడ్‌ను చూడండి. తప్పకుండా కొత్త అనుభూతిని తమన్నా, విజయ్ వర్మ ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X