Love Your Father (LYF) Movie Review: లవ్ యువర్ ఫాదర్ (LYF) మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.5/5
నటీనటులు: LYF (లవ్ యువర్ ఫాదర్)
నటీనటులు: ఎస్పీ చరణ్, శ్రీ హర్ష, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా, శకలక శంకర్, కషికా కపూర్ తదితరులు
దర్శకత్వం: పవన్ కేతరాజు
నిర్మాతలు: కిషోర్ రాఠి, సామ్రాజ్యం, చేతన్ సాయిరెడ్డి, మహేష్ రాఠీ
సీఈవో: ఏ రామస్వామిరెడ్డి
మ్యూజిక్: మణిశర్మ
ఎడిటర్: దేవరంపాటి రామకృష్ణ
సినిమాటోగ్రఫి: శ్యామ్ కే నాయుడు
బ్యానర్: మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్
రిలీజ్ డేట్: 2025-04-04
కిషోర్ (ఎస్పీ చరణ్), సిద్దూ (శ్రీ హర్ష) ప్రేమానురాగాలతో జీవించే తండ్రి కోడుకులు, తండ్రికి చేదోడుగా కొడుకు, కొడుకుకు అండగా తండ్రి ఉంటారు. కిషోర్ సూపర్ మార్కెట్ నిర్వహిస్తూ సామాజిక సేవలో ఉంటాడు. తాను చేసే సామాజిక కార్యక్రమాలకు డబ్బు సమకూర్చడానికి గుర్రపు పందాలు ఆడుతాడు. ఎప్పుడు గెలిచే కబీర్ (నవాబ్ షా)కు కిషోర్ షాకిస్తాడు. అయితే తనను ఓడించిన కిషోర్, అతడి కుమారుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించేందుకు ప్రయత్నిస్తాడు.

కిషోర్, సిద్దూల మధ్య అనుబంధం ఎలాంటింది? స్వీటీ (కషికా కపూర్)తో సిద్దూ ప్రేమాయణం ఎలా సాగింది? తన ఫ్రెండ్ మేఘన లవ్ ప్రపోజల్‌ను సిద్దూ అంగీకరించాడా? కిషోర్ చేసే సామాజిక కార్యక్రమాలు ఏమిటి? కబీర్, కిషోర్‌కు ఉన్న గొడవలేమిటి? కిషోర్, సిద్దూపై కబీర్ కేసులు ఎందుకు పెట్టారు? కబీర్‌కు కిషోర్ ఎలాంటి గుణపాఠం నేర్పారు? ఈ కథలో కాశీ బ్యాక్ డ్రాప్ ట్విస్ట్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే లవ్ యువర్ ఫాదర్ సినిమా కథ.
దర్శకుడు పవన్ కేతరాజు రాసుకొన్న కథలో ట్విస్టులు, హ్యుమన్ ఎమోషన్స్ బాగానే ఉన్నాయి. కిషోర్ క్యారెక్టర్‌తో సోషల్ సర్వీస్ ఎలిమెంట్స్, సెకండాఫ్‌లో కాశీ ట్విస్టులు సినిమాపై ఆసక్తిని రేపుతాయి. మంచి కథను బలమైన సన్నివేశాలు రాసుకోవడానికి ఇంకాస్త వర్క్ చేయాల్సి ఉండాల్సిందనే అభిప్రాయం కలుగుతుంది. ఫస్టాఫ్‌లో సీన్లను సాగదీసినట్టు అనిపిస్తుంది. హార్స్ రేసింగ్ అంశం తెలుగు ఆడియెన్స్ థ్రిల్ ఇచ్చే అంశంగా మారింది. అలాగే కాశీలో బ్యాక్ డ్రాప్‌లో దైవత్యం సినిమాను చకచకా లాగించాడు.
కిషోర్ పాత్రలో ఫాదర్ క్యారెక్టర్‌లో ఎస్పీ చరణ్ అద్బుతంగా నటించాడు. తండ్రి కొడుకుల మధ్య మంచి ఎమోషన్స్ డెలివరీ చేశారు. తెలుగు తెరకు మంచి ఫాదర్ దొరికాడనే ఫీలింగ్ కల్పించాడు. ఇక కొడుకుగ శ్రీ హర్ష కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కషికా కపూర్ గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నది. కబీర్‌గా నవాబ్ షా విలనిజం ఈ సినిమాలో ఫ్రెష్‌గా కనిపించింది. ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించాడు.
దేశభక్తితోపాటు హార్స్ రేసింగ్‌లో మోసాలు లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ వచ్చిన సినిమాకు మణిశర్మ అందించిన మ్యూజిక్ బలంగా నిలిచింది. శివుడిపై పాట, శివ భక్తులపై రాసిన సీన్లు రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయి. దేవరంపాటి రామకృష్ణ ఎడిటింగ్, శ్యామ్ కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. కాశీ ఎపిసోడ్స్ అద్బుతంగా చిత్రీకరించారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ రాఠి, సామ్రాజ్యం, చేతన్ సాయిరెడ్డి, మహేష్ రాఠీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తండ్రి, కొడుకుల మధ్య సెంటిమెంట్, కాశీ శివుడు దైవత్యం లాంటి అంశాలతో గుర్రపు పందాల కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం లవ్ యువర్ ఫాదర్. ఎస్పీ చరణ్ యాక్టింగ్ సినిమా భారాన్నంత మోషాడు. కొన్ని సీన్లు ల్యాగ్, పేలవంగా ఉన్నాయి. కానీ కమర్షియల్ హంగులతో సాగే డివోషనల్ మూవీ చూడాలనుకొనే వారికి లవ్ యువర్ ఫాదర్ సినిమా కొత్త అనుభూతి అందిస్తుంది. అంచనాలు లేకుండా వెళ్తే డిఫరెంట్ సినిమా చూసే అవకాశం దక్కుతుంది.


Click it and Unblock the Notifications











