Maa Behen Movie: మా బహెన్ హిందీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రీ, రవి కిషన్, పరేశ్ రావెల్ ధర్న దుర్గ, గీతాంజలీ కులకర్ణి, అరుణోదయ్ సింగ్, జతిన్ శర్మ, తదితరులు
దర్శకత్వం: సురేష్ త్రివేణి
కథ, రచన: సురేష్ త్రివేణి, పూజా తోలాని
నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా, సురేష్ త్రివేణి
సినిమాటోగ్రఫి: అనుజ్ రాకేశ్ ధావన్
ఎఢిటింగ్: దీపిక కల్రా
మ్యూజిక్: అక్షదీప్ సేన్ గుప్తా, సుభాజిత్ ముఖర్జీ
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: 2026-06-04
వయసు పైబడిన అందంతో నిగనిగలాడుతూ తాను నివసించే కాలనీవాసులను ఆకట్టుకొనే రేఖ (మాధురీ దీక్షిత్)కు ఇద్దరు భర్తలు (జతిన్ శర్మ, పరేశ్ రావెల్). వారి ద్వారా పుట్టిన జయ (త్రిప్తి డిమ్రీ), సుష్మ (ధర్నా దుర్గా) ఇద్దరు కూతుళ్లు ఉంటారు. కూతురు జయ తనకు ఇష్టం లేకపోయినా మానస్ (శార్దుల్ భరద్వాజ్) అనే వ్యక్తిని పెళ్లి చేసుకొంటుంది. సుష్మా మాత్రం ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణించాలని ప్రయత్నిస్తుంటుంది. కాలనీలో ఉండే గుప్తా జీ అలియాస్ చరిత్ర గుప్తా (రవి కిషన్)కు రేఖపై ఎప్పటి నుంచి మనసుపడి కోరిక తీర్చుకోనే ప్రయత్నంలో అదను కోసం ఎదురు చూస్తుంటాడు. అయితే ఓ రోజు రేఖ ఇంటికి వచ్చిన గుప్తా జీ గాయాలపాలై విగతజీవిగా పడి ఉంటాడు. గుప్తాజీ బాడీని చూసిన రేఖ తన కూతుళ్లు జయ, సుష్మాను ఉన్నపళంగా రమ్మని పిలుస్తుంది. ఆ తర్వాత ఆ గుప్తా దేహాన్ని మాయం చేసేందుకు ప్లాన్ వేస్తారు.

అందంతో నిగనిగలాడే రేఖపై కాలనీవాసులు ఎలా మనసు పారేసుకొన్నారు? రేఖ మొదటి భర్త (జతిన్ శర్మ) ఎలా చనిపోయాడు? రెండో భర్త (పరేశ్ రావెల్) ఎలాంటి సంబంధం ఉంది? రేఖను రెండో భర్త ఎందుకు వదిలేసి వెళ్లాడు? జయ ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకొన్నది? గుప్తాతో రేఖకు ఉన్న సంబంధం ఏమిటి? రేఖ ఇంట్లో గుప్తా ఎలా విగతజీవిగా పడి ఉన్నాడు? గుప్తా బాడీని మాయం చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేశారు? గుప్తా మరణించాడా? లేదా? గుప్తా ఫ్యామిలీ రియాక్షన్ ఏమిటి? రేఖ, జయ, సుష్మా పరిస్థితి చివరకు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మా బహెన్.
రేఖగా మాధురీ దీక్షిత్ ఫ్లాష్ బ్యాక్‌తో కథను హ్యుమరస్‌గా చెప్పే ప్రయత్నాన్ని దర్శకుడు సురేష్ త్రివేణి మొదలుపెట్టాడు. మాధురీ దీక్షిత్ గ్లామర్‌ను వాడుకోవడానికి రాసుకొన్న సీన్లు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో సినిమా ఏదో అలా సాగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. పాత్రల పరిచయం, కథను బేస్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో ఈ స్టోరీలో ఏమౌనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రేఖ ఇంట్లో గుప్తా గుప్తా చనిపోయాడనే వార్తను జయకు సుష్మాకు తెలియజేసిన తర్వాత కథలో కాస్త చలనం కలిగినట్టు అనిపిస్తుంది. రేఖ, జయ, సుష్మ కలిసిన తర్వాత విపరీతమైన సాగదీతతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. సినిమాలో అర్ధభాగం ఇదే నసతో సాగుతుంది.
ఇక రెండో భాగంలోనైనా కథ ఆసక్తిగా మారుతుందా? అని ఎదురు చూసిన వాళ్లకు అదే నిరాశ కలుగుతుంది. పేదరికం చుట్టు తిరగడం వల్ల త్రిప్తి డిమ్రీ (జయ)ను గ్లామర్ తారగా చూడలేని పరిస్థితి చికాకుగా ఉంటుంది. సరే ఆమె పాత్రలో ఎమోషన్స్, యాక్టింగ్, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉందా? అంటే అదీ కొవ్వొత్తి పెట్టి వెతికినా కనిపించదు. గుప్తా క్యారెక్టర్ ఏమైనా విభిన్నంగా కథను ముందుకు తీసుకెళ్తుందా? అంటే అదీ కనిపించదు. రేఖ రెండో భర్త తిరిగి వచ్చిన తర్వాత కాన్‌ఫ్లిక్ట్ ఏమైనా కథకు ఉపయోగపడుతుందా? అంటే అదీ ఉండదు. జయతో భర్తకు విభేదాలు కథను మలుపుతిప్పుతాయా? అంటే ఆ పాయింట్‌ను కూడా దర్శకుడు వాడుకోలేదు. చివరకు నాసిరకమైన క్లైమాక్స్‌తో సినిమాను హాడావిడిగా ముగించి చేతులు దులిపేసుకున్నాడనేది ప్రేక్షకుడికి అర్ధం అవుతుంది. టోటల్‌గా మంచి కాస్టింగ్‌ను వాడుకోవడంలో డైరెక్టర్ దారుణంగా విఫలమయ్యాడని బోధపడుతుంది.
మాధురీ దీక్షిత్ రీ ఎంట్రీ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంటే.. అంచనాలు భారీగా ఉంటాయి. కానీ రేఖగా ఆమె పాత్రలో ఎలాంటి బలం కనిపించదు. అంతా బలహీనమైన క్షణాలే. ఇక యానిమల్ తర్వాత త్రిప్తి డిమ్రీ అంటే హాట్ హీరోయిన్ ఇమేజ్ ఉంది. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి డీ గ్లామరైజ్డ్, మధ్య తరగతి గృహిణి పాత్రను కట్టబెట్టాడు. ఆ పాత్రలో ఆమె నలిగిపోవడం తప్ప.. బెటర్‌గా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. ఒకట్రెండ్ సీన్లలో తనలో మంచి నటి ఉందని నిరూపించుకొనే ప్రయత్నం బాగుంది. రవికిషన్ పాత్రలో అసలు విషయం లేకపోవడం ఏమీ చేయలేకపోయారు. పరేశ్ రావెల్, ఇతర పాత్రలు గురించి చెప్పుకోవడానికి ఏమీ లేవు
కథలో దమ్ము లేకపోవడం వల్ల సాంకేతిక విభాగాల పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల గొప్పగా రాణించడానికి అవకాశమే లేకపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాసిరకంగా ఉండటం, సినిమాను అలా చుట్టేశారనే ఫీలింగ్ కలుగుతుంది.
కథలో బలం లేకుండా కథనంతో నెట్టుకు రావాలని చేసిన ప్రయత్నమే మా బహెన్ సినిమా. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలనుకొంటే.. బలమైన సన్నివేశాలు రాసుకోవాల్సింది. కానీ ఆ విషయంలో టీమ్ ఫెయిల్ అయింది. ఈ సినిమాలో ఎట్రాక్షన్ ఏమిటంటే.. మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రీ.. ఈ ఇద్దరి కోసం ఈ మూవీని చూడొచ్చు. ఓటీటీలో ఉంది కాబట్టి.. ఏమీ తోచకపోతే ఆ ఇద్దరు గ్లామరస్ హీరోయిన్ల కోసం ఓ లుక్కేయండి..


Click it and Unblock the Notifications