Maa Inti Bangaaram Censor Review: మా ఇంటి బంగారం సెన్సార్ రివ్యూ
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్, మ్యూజిక్: సంతోష్ నారాయణన్, ఫైట్స్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదర్ తదితరలు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాకు లభించిన సెన్సార్ సర్టిఫికెట్ ఎంత? ఈ చిత్రంపై సెన్సార్ అధికారులు వెల్లడించిన అభిప్రాయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ చిత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రం కావడం, ఈ చిత్రంలో వివాదాస్పద అంశంతో కథా నేపథ్యం లేకపోవడంతో సెన్సార్ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండానే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వినోద ప్రధానంగా సాగుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా రూపొందించిన ఈ చిత్ర నిర్మాత, దర్శకులను, నటీనటులను సెన్సార్ సభ్యులు అభినందించారు అని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది.
యూత్, ఫ్యామిలీ వర్గాలను ఆకట్టుకొనే అంశాలతో రూపొందిన ఈ సినిమాకు యూఏ (UA) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ చిత్రాన్ని 13 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు చూసేలా అనుమతి ఇచ్చారు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ నిబంధనల్లో పేర్కొన్నారు. దాంతో ఈ సినిమా క్లీన్ మూవీ అనే అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే సెన్సార్ తర్వాత మా ఇంటి బంగారం సినిమాలో సమంత పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆమె జీవించారు. శ్రీముఖి పాత్ర మరో హైలెట్, గౌతమి, గుల్షన్ దేవయ్య, శ్రీనివాస్ గవిరెడ్డి పాత్రలు ఈ సినిమాకు అడిషినల్ సపోర్ట్‌గా ఉంటాయనే టాక్ బయటకు వచ్చింది. ఇక సమంత తన కెరీర్‌లో మరో బెస్ట్ సినిమాను అందించబోతున్నారనే సంకేతాలను ఇప్పటికే టీజర్, ప్రోమోల ద్వారా స్పష్టం చేశారు. ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై రోజు రోజుకు బజ్ క్రియట్ చేస్తున్నది. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, ఇతర కథనాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications