Maa Inti Bangaaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: సమంత, శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, దిగంధ్, వెన్నెల కిషోర్, చైతన్య, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు
బ్యానర్: ట్రలాలా మూవింగ్ పిక్చర్స్
దర్శకత్వం: నందినీ రెడ్డి
నిర్మాతలు: రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు
కథ, స్క్రీన్ ప్లే: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్
సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్,
మ్యూజిక్: సంతోష్ నారాయణన్,
ఫైట్స్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్,
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల,
ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదర్
రిలీజ్: 2026-06-19

Maa Inti Bangaaram Movie Review and Rating  Samantha One Women Show with Action Entertainer

పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొన్న స్వర్ణ అలియాస్ ఝాన్సీ (సమంత), అనిరుధ్ (దిగంధ్) దంపతులు చాలా కాలం ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అనిరుధ్ చెల్లెలు పెళ్లి కోసం బల్లవరం అనే సొంతూరుకు వెళ్లి ఫ్యామిలీని కలుస్తారు. కానీ స్వర్ణ, అనిరుధ్‌ల తండ్రి రామరాజు (ఆనంద్) అసంతృప్తిగా ఉంటే..తల్లి (గౌతమి), మరదలు (అనసూయ) ప్రేమగా పలకరిస్తారు. రామరాజు కుటుంబానికి మధుసూధన్ (వడ్లమాని శ్రీనివాస్) రాజకీయ క్షక్ష్యలు కొనసాగుతుంటాయి. అయితే మధుసూధన్ మనుషులు దాడి చేస్తే ఫ్యామిలీని స్వర్ణ కాపాడుకొంటుంది. ఈ క్రమంలో కరుణ (గుల్షన్ దేవయ్య) మనుషులు స్వర్ణను వెంటాడుతుంటారు. చివరకు ఏకంగా స్వర్ణను వెతుక్కొంటూ కరుణ రంగంలోకి దిగి బల్లవరంకు వస్తాడు?

చెల్లెల్లి పెళ్లి కోసం వచ్చిన అనిరుధ్, స్వర్ణలకు ఇంట్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? రామరాజు కుటుంబాన్ని మధుసూధన్ ఫ్యామిలీ ఎందుకు టార్గెట్ చేసింది? కరుణ మనుషులు స్వర్ణను ఎందుకు టార్గెట్ చేశారు? కరుణ గ్యాంగ్‌కు స్వర్ణ ఎలా గుణపాఠం చెప్పింది? అసలు ఝాన్సీ ఎందుకు స్వర్ణగా మారింది. ఝాన్సీ గతం ఏమిటి? ఝాన్సీని కరుణ ఎందుకు వెంటాడాడు. కరుణ వల్ల తన కుటుంబానికి ముప్పు ఏర్పడితే స్వర్ణ ఎలా బుద్ది చెప్పింది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ.

స్వర్ణ, అనిరుధ్ ఇంట్లో పెళ్లి కోసం సొంతూరు ప్రయాణంతో దర్శకురాలు నందినీ రెడ్డి కథను ఆసక్తికరంగా మొదలుపెట్టారు. అలా ప్రారంభమైన కథను ప్రతీ ఎపిసోడ్‌కు ఫీల్ గుడ్ అంశాలు, ఫన్, యాక్షన్ జోడిస్తూ గ్రిప్పింగ్‌గా స్టోరీని ప్రజెంట్ చేశారు. అయితే ఝాన్సీగా మారిన స్వర్ణ గతాన్ని స్పూన్ ఫీడింగ్‌లా కాకుండా చాలా సింపుల్ త్వరగా తేల్చి స్టోరిని రక్తి కట్టించారు. డిఫరెంట్ షేడ్స్‌ ఉన్నసమంత పాత్రను ఒక్కో సన్నివేశానికి ఎలివేట్ చేసిన తీరు బాగుంది. రాజ్ నిడిమోరు పర్‌ఫెక్ట్ రైటింగ్‌ సపోర్ట్‌తో నందిని రెడ్డిలో కొత్త కోణం కనిపించింది. ఈ సినిమా ద్వారా ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్‌ను పక్కన పెట్టి నందినీ రెడ్డి తనకు తాను డిఫెరెంట్‌ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకొన్నారు. ఈ సినిమాకు నటీనటుల ఎంపిక ఫ్రెష్‌గా ఉంది. ప్రతీ క్యారెక్టర్‌పై ఎలాంటి ఇమేజ్ పడకుండా కొత్త వారిని తీసుకోవడం వల్ల స్క్రీన్ మీద ప్రెష్‌నెస్ కనిపించింది. అదే ఈ సినిమాకు పాజిటివ్‌గా మారింది. ఫస్టాఫ్‌ను చాలా వేగంగా నడిపించినప్పటికీ.. సెకండాఫ్‌లో ఒకటి రెండు మూమెంట్స్ ‌లో కొంత నెమ్మదించిదని అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ ఎపిసోడ్‌తో మళ్లీ ట్రాక్ మీదకు వచ్చి కేక పెట్టించేలా సినిమాను ముగించారు.

సమంత తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. యశోద సినిమాతో లేడి సూపర్ స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకొన్నారు. ఇక ఈ సినిమాతో డిఫరెంట్ షేడ్స్ ఉన్న స్వర్ణ క్యారెక్టర్‌లో ఉండే ఛాలెంజ్‌ను చాలా సులభంగా ఫేస్ చేశారు. యాక్షన్, ఫన్, ఎమోషన్స్, సెంటిమెంట్ అంశాలు ఉన్న పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. సమంత లైబ్రరీలో పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యే చిత్రమని చెప్పవచ్చు. మరోసారి తనకు తానే సాటి అని నిరూపించుకొన్నారు. సమంత తర్వాత ఎక్కువ మార్కులు కొట్టేసిదంటే కిరణ్మయి (మంజూష) పాత్రనే. సమంతతోపాటు ట్రావెల్ అయ్యే రోల్‌లో చిన్న మ్యాజిక్ మూమెంట్స్ ఇచ్చారు. సమంత, శ్రీముఖి మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా ఉంటాయి. గౌతమి, ఆనంద్, దిగంధ్, గుల్షన్ దేవయ్య పాత్రలు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు రైటింగ్ అతి పెద్ద అసెట్. ఆ తర్వాత ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ పనితీరు చాలా బాగుంది. రూరల్ ఎన్విరాన్‌మెంట్‌ను సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాశ్ బాగా క్యాప్చర్ చేశారు. పెళ్లి ఇంటిని డిజైన్ చేసిన విధానం ఆర్ట్ విభాగం టాలెంట్‌ను చూపించింది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సన్నివేశాలను బాగా హైలెట్ చేసింది. ఇక రాజ్ నిడిమోరు, హిమంక్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు రిచ్‌నెస్‌ను, క్వాలిటీని తెచ్చిపెట్టాయి. ఈ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. అన్ని వర్గాల ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటింది. సమంత ఫ్యాన్స్‌కు, రాజ్ నిడిమోరు, నందిని రెడ్డి వర్క్‌ను అభిమానించే వారికి ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాలో తప్పకుండా చేర్చుకోవాల్సిన సినిమా. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నచిత్రం.. థియేటర్‌లోనే ఈ సినిమాను ఆస్వాదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X