Maa Inti Bangaaram Public talk: మా ఇంటి బంగారం పబ్లిక్ టాక్.. సమంత సినిమా ఎలా ఉందంటే?

Maa Inti Bangaaram Public talk: సౌత్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ 'మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram). సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సమంతతో పాటు ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు,హిమాంక్ దువ్వూరు ఈ నిర్మించారు. శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు.

సాంకేతికంగా కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాశ్ విజువల్స్‌ను అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా, లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్ యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్, ఉల్లాస్ హైదర్ ప్రొడక్షన్ డిజైన్ చేయడం అదనపు బలంగా నిలిచాయి. భారీ అంచనాల మధ్య జూన్ 19న (నేడు) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల పబ్లిక్ టాక్ ఏంటి? అనేది ఓసారి చూడండి.

Maa Inti Bangaaram Public Talk  Samantha Shines in Action-Packed Family Entertainer

మా ఇంటి బంగారం సినిమా పబ్లిక్ టాక్ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా సమంత యాక్షన్ అవతార్, ఫ్యామిలీ ఎమోషన్స్, క్లైమాక్స్ ట్విస్టులపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు మాట్లాడుతూ.. 'సమంత గారు మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా యాక్షన్ పాత్రల్లోనూ అదరగొట్టగలనని మరోసారి నిరూపించారు. గతంలో సిటాడెల్ సిరీస్‌లో ఎలా ఆకట్టుకున్నారో, ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో యాక్షన్ సీన్స్‌లో దుమ్మురేపారు. ఫైట్స్, డాన్స్, ఫ్యామిలీ డ్రామా అన్నీ బాగా కుదిరాయి. సమంత తన పాత్రకు ప్రాణం పోశారు. సినిమా మొత్తం ఓ అడ్రినలిన్ రష్‌లా అనిపించింది. ఇది సమంత కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ అవుతుంది'అని అభిప్రాయపడ్డారు.

మరో ప్రేక్షకుడు తన స్పందనలో.. "సినిమా సాధారణ ఫ్యామిలీ డ్రామా అనుకుని వెళ్లాను. కానీ స్క్రీన్‌పై కనిపించింది మాత్రం పూర్తి స్థాయి కమర్షియల్ ప్యాకేజ్. పెరుగన్నం తింటామనుకుంటే నాటుకోడి బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చింది. సమంత నటన అద్భుతంగా ఉంది. ఒకప్పుడు సావిత్రి గారు ఎలా నటనతో ప్రేక్షకులను మెప్పించారో, ఈ తరం హీరోయిన్లలో సమంత కూడా అదే స్థాయిలో తన పాత్రలో జీవించిందనిపించింది" అని ప్రశంసించారు. ఇంకో అభిమాని మాట్లాడుతూ.. "సమంత యాక్టింగ్ నిజంగా మార్వెలస్. ఆమె స్క్రీన్‌పై కనిపించిన ప్రతి సీన్ ఆకట్టుకుంది. సినిమా ముగిసే సరికి నిజంగానే 'మా ఇంటి బంగారం' అనే టైటిల్ సమంతకే సూట్ అవుతుందని అనిపించింది" అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు.

మరో వర్గం ప్రేక్షకులు సినిమాను బ్లాక్‌బస్టర్‌గా అభివర్ణిస్తున్నారు. "ట్రైలర్ చూసి సినిమాను తక్కువ అంచనా వేసిన వాళ్లు ముందుగా సినిమా చూడాలి. సమంత నటన, యాక్షన్ సీన్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెడతాయి. ఎక్కడా బోరింగ్ అనిపించదు. ప్రతి సీన్ కథను ముందుకు తీసుకెళ్తుంది" అని కామెంట్లు చేస్తున్నారు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్‌పై కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ప్రేక్షకులు "సమంత ఫైట్స్‌కు స్టార్ హీరోలకు వచ్చే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు చాలా పవర్‌ఫుల్‌గా తెరకెక్కాయి" అని అభిప్రాయపడ్డారు. మరికొందరు "ఫైట్ మాస్టర్స్ రూపొందించిన యాక్షన్ బ్లాక్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ" అని చెబుతున్నారు.

మరో ప్రేక్షకుల తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ఫస్ట్ హాఫ్‌లో సమంత అమాయకమైన ఇల్లాలిగా కనిపిస్తుందని, కొత్త కుటుంబంలో కలిసిపోవడానికి ప్రయత్నించే యువతి పాత్రలో సహజంగా నటించిందని చెబుతున్నారు. అత్తింటి ఆచారాలు, సంప్రదాయాలు, తోటి కోడళ్లతో జరిగే సరదా సంఘటనలు, చిన్న చిన్న కుటుంబ గొడవలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. అదే సమయంలో ఆమె పాత్రలో దాగి ఉన్న మరో కోణాన్ని దర్శకురాలు నెమ్మదిగా పరిచయం చేస్తుందని చెబుతున్నారు.

సెకండాఫ్‌లో మాత్రం సినిమా పూర్తిగా మరో స్థాయికి వెళ్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సమంత పాత్రకు సంబంధించిన బ్యాక్‌స్టోరీ, యాక్షన్ ట్రాక్, క్రైమ్ థ్రిల్లర్ తరహా ట్విస్టులు కథను మరింత ఆసక్తికరంగా మార్చాయని అంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌ను సమతూకంగా మిళితం చేసిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్రధాన బలంగా మారిందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ, యాక్షన్ బ్లాక్స్‌లోనూ బీజీఎం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసిస్తున్నారు.

అయితే కొందరు ప్రేక్షకులు మాత్రం "సినిమాపై మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే కొంత నిరాశ కలగొచ్చు. ఇది మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్. కానీ మాస్టర్‌పీస్ ఆశించి వెళ్లకూడదు" అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. మా ఇంటి బంగారం కథ కొత్తగా అనిపించదని, ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన ఫ్యామిలీ డ్రామా కథనే మరోసారి తెరపై చూపించినట్లుగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా సినిమా నెరేషన్ చాలా నెమ్మదిగా సాగిందని, ఫస్ట్ హాఫ్‌లో ఆసక్తికరమైన ఘట్టాలు లేకపోవడంతో కథలో లీనమవడం కష్టమైందని అభిప్రాయపడ్డారు.

సెకండాఫ్ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, బ్యాక్‌స్టోరీ అంతగా ప్రభావం చూపలేదని, విలన్ ట్రాక్ కూడా బలహీనంగా అనిపించిందన్నారు. ఇక భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను పూర్తిగా కనెక్ట్ చేయలేకపోయాయని, కథలో ఊపును పెంచే ఎలివేషన్ మూమెంట్స్ తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. సినిమా మొత్తం ఒకే టెంపోలో సాగడంతో ఆశించిన స్థాయిలో థ్రిల్ కలగలేదని అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే మా ఇంటి బంగారం సినిమాకు తొలి రోజు మిక్స్డ్ టాక్ కామెంట్స్ వినిపిస్తోంది. ఇలా మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X