Maa Inti Bangaaram First Review: మా ఇంటి బంగారం ఫస్ట్ రివ్యూ

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్, మ్యూజిక్: సంతోష్ నారాయణన్, ఫైట్స్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదర్ తదితరలు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిపికెట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? ఈ సినిమాపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Maa Inti Bangaaram First Review

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లై ఇంటికి వచ్చిన యువతి (సమంత)కు అత్తారింటిలో సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు.. వంట చేయడం వచ్చా? పాడటం వచ్చా? పూజలు పుణస్కారాలు చేయడం వచ్చా? లాంటి ఎదురవుతాయి. అప్పటికే ఇంటిలో తోడి కోడలుగా ఉన్న అనసూయ (శ్రీముఖి)తో పోటీ ఎదురువుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కోడలు గతాన్ని కొందరు తవ్వే ప్రయత్నం చేస్తారు. తనను టార్గెట్ చేసుకొని ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో తన గతాన్ని అత్తారింటికి వారికి తెలియకుండా ఆమె ఏం చేసింది? ఇంతకు ఆమె పేరు ఏమిటి? ఆమె ఎవరు? ఆమె గతం ఏమిటి? వంట ఇంటిలో గరిటె పట్టాల్సిన నూతన వధువు తుపాకి ఎందుకు పట్టాల్సి వచ్చింది? తన ఫ్యామిలీని, తన గతాన్ని ప్రాణాలకు తెగించి ఎలా కాపాడుకొన్నది? అనే ప్రశ్నలకు సమాధానమే మా ఇంటి బంగారం సినిమా కథ.

Also Read
Cocktail 2 Movie First Review: కాక్‌టెయిల్ 2 మూవీ ఫస్ట్ రివ్యూ
Cocktail 2 Movie First Review: కాక్‌టెయిల్ 2 మూవీ ఫస్ట్ రివ్యూ

ఫ్యామిలీ, ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ లాంటి అంశాలను మేలవించి రూపొందించిన ఈ సినిమాను సెన్సార్ బోర్డు ప్రతినిధులు, అధికారులు వీక్షించారు. అయితే ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్ స్వల్ప మార్పులతో ఆమోదించారు. సినిమా యూనిట్ కూడా పెద్దగా తమ కంటెంట్ మార్పులకు అభ్యంతరాలు తెలియచేయకపోవడంతో సెన్సార్ కార్యక్రమాలు సులభంగానే పూర్తయ్యాయి. దాంతో ఈ సినిమా విడుదలకు సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది.

Recommended For You
Maa Inti Bangaaram Business: మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ బిజినెస్.. సమంత మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
Maa Inti Bangaaram Business: మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ బిజినెస్.. సమంత మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ (UA 13+) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సర్టిఫికెట్ ప్రకారం 13 ఏళ్లకు పైబడిన వారందరూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమాను చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ సినిమాను తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది. ఈ సినిమాలో కథ, కథనాలు సన్నివేశాలు డిమాండ్ చేయడంతో సాధారణంగా కంటే కొంచెం నిడివి ఎక్కువగానే ఉందనిపిస్తుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు. అంటే 154 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు అని సెన్సార్ సర్టిఫికెట్ స్పష్టం చేసింది.

You May Also Like
14 జూన్.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తరహాలోనే..నటి సంచిత ఉగాలే మరణం.. ఫ్యామిలీ సంచలన ఆరోపణలు
14 జూన్.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తరహాలోనే..నటి సంచిత ఉగాలే మరణం.. ఫ్యామిలీ సంచలన ఆరోపణలు

సెన్సార్ తర్వాత ఈ సినిమా గురించి బయటకు వచ్చిన విషయాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే.. సమంత యాక్టింగ్ స్టామినాను తెలియజేసే సినిమా అవుతుంది. ఆమెకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలు ఉన్నాయి. శ్రీముఖి, సమంత మధ్య సన్నివేశాలు హిలేరియస్‌గా, ఫీల్ గుడ్‌గా ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో యాక్షన్ సీన్లలో సమంత అదరగొట్టింది. ఫ్యామిలీ కోసం పోరాడే కోడలి పాత్ర చుట్టు అల్లుకొన్న ఎమోషన్స్ ఆకట్టుకొంటాయనే విషయాలపై చర్చ జరుగుతున్నది. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, బాక్సాఫీస్ నంబర్ల గురించి కథనాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X