Maa Inti Bangaaram Twitter Review: మా ఇంటి బంగారం మూవీ ట్విట్టర్ రివ్యూ
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబు అవుతున్నది. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్, మ్యూజిక్: సంతోష్ నారాయణన్, ఫైట్స్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదర్ తదితరలు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రిటిక్స్, సాధారణ ప్రేక్షకుల అభిప్రాయాల్లోకి వెళితే..
మా ఇంటి బంగారం సినిమా ఫుల్ ప్యాకేజ్డ్ మూవీ. సాంగ్స్ ఉన్నాయి. ఫైట్స్ ఉన్నాయి. తోటి కోడలు గోడవలు ఉంటాయి. అత్తగారి మెప్పు కోసం చేసే పనులు ఉంటాయి. పూర్తిగగా ఫ్యామిల ఎంటర్ టైనర్ అని నెటిజన్ కామెంట్ చేశాడు.

మా ఇంటి బంగారం సినిమా చూశాను. సమంత నెవర్ బిఫోర్ యాక్షన్ అవతార్. సినిమాలో పీక్ ఏమోషన్స్ ఉన్నాయి. సెకండాఫ్ చాలా బాగుంది. క్లైమాక్ష్ సాలిడ్‌గా ఉంది అని ఓ క్రిటిక్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మా ఇంటి బంగారం హిట్ మూవీ. సమంత రుత్ ప్రభు పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్‌గా ఉంది. ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ కూడా బలంగా ఉంది. ఈ సినిమాకు యాక్షన్ బ్లాక్స్, బీజీఎం హైలెట్ అని ఓ నెటిజన్ తన రివ్యూను అందించారు. 3 పైగా రేటింగ్‌ను ఇచ్చాడు.
మా ఇంటి బంగారం సినిమా మీ కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా చూసే సినిమా. ఎంగేజింగ్‌గా ఉండే యాక్షన్ సినిమా. గూస్ బంప్స్‌తో కూడిన యాక్షన్ బ్లాక్స్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిల్లియంట్‌గా ఉంది. సమంత రుత్ ప్రభు నిజంగా లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌కు అర్హురాలు. ఈ బంగారం సినిమాతో వాస్తవంగా బిగ్ బ్యాంగ్ ఇచ్చింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మా ఇంటి బంగారం హైదరాబాద్‌లోని ఏఎంబీలో స్పెషల్ ప్రీమియర్ షో ముగిసింది. ఈ షో చూసిన వారు బ్లాక్ బస్టర్ అనే మాటను చెబుతున్నారు. యాక్షన్ అవతార్‌లో సమంత అదరగొట్టింది. ఆమె ఫెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది అని క్రిటిక్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications