twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కామెడీ..బాగుంది

    By Staff
    |

    Maa Alludu
    -జలపతి గూడెల్లి
    చిత్రం: మా అల్లుడు వెరీ గుడ్‌
    నటీనటులు: నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, మోనిక, రమ్యకృష్ణ, తదితరులు
    సంగీతం: కీరవాణి
    నిర్మాత: రోజా మూవీస్‌
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఇవివి సత్యనారయణ

    ఇప్పుడు కొంచెం వెనుకబడ్డ దర్శకుడు ఇవివి సత్యనారయణ తన కుమారుడు నరేష్‌ హీరోగా రూపొందించిన 'మా అల్లుడు వెరీగుడ్‌'లో కొన్ని చమక్కులు మెరిపించాడు. బూత్‌ లేకుండా వీలైనంత వరకు ఆరోగ్యకరమైన కామెడీని అందించడం విశేషం. ఇప్పుడు వస్తోన్న చిత్రాల తాకిడిలో..కాసేపు హాయిగా (పూర్తి స్థాయిలో కాదు) నవ్వించే చిత్రం ఇది. పూర్తిగా డైలాగ్స్‌ ఓరియేంటడ్‌ కామెడీ. రాజేంద్రప్రసాద్‌ పాత్ర నిజానికి ఇందులో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ తరహా అనే చెప్పాలి. పూర్తిగా నరేష్‌పైనే సినిమా సాగుతుంది.

    నరేష్‌ మస్కాకొట్టి జీవనాన్ని సాగిస్తుంటాడు. ఒకసారి రామిరెడ్డిని బురిడీ కొట్టించే ప్రయత్నంలో బిజినెస్‌ మ్యాన్‌ ఏవీరావు (రాజేంద్రప్రసాద్‌) అతన్ని పట్టుకుంటాడు. రాజేంద్రప్రసాద్‌ కూతురు మోనిక తనకు కావాల్సిన భర్త ఎలా ఉండాలో ఒక డైరీలో రాసుకుంటుంది. ఆ అమ్మాయి ప్రేమలో పడ్డ నరేష్‌ ఆ డైరీ సంపాదించి అందులోని 'గుణాల'కనుగుణంగా ప్రవర్తించి ఆమె ప్రేమ పొందుతుంటాడు.

    మరోవైపు, లేట్‌ వయసులో రాజేంద్రప్రసాద్‌ రమ్యకృష్ణ ప్రేమలో పడుతాడు. ఆమె కూడా రెస్పాండ్‌ అవుతుంది. కానీ రాజేంద్రప్రసాద్‌ కు ఒక ఎదిగివచ్చిన కూతురు ఉందని తెలిసిన తర్వాత ఆమె అతన్ని అసహ్యించుకుంటుంది. ఇక హీరో నరేష్‌ తన ప్రేమను గెలుచుకోవడంతో పాటు వీరి ఇద్దరినీ కలిపే ప్రయత్నమే చిత్రం.

    నరేష్‌లో 'కామెడీ' చేసే సత్తా ఉన్నా, అతని ఎక్స్‌ప్రెషన్స్‌ మరీ రోటీన్‌ గా ఉన్నాయి. రమ్యకృష్ణ గ్లామరస్‌గా కన్పించింది. రాజేంద్రుడిలో 'ఆనాటి' ప్రభ పూర్తిగా తగ్గింది. కాసేపు నవ్వుల కోసం ఈ సినిమా చూడవచ్చు. ఇటీవల కాలంలో హిట్‌ సంగీతం అందిస్తోన్న కీరవాణి నుంచి హిట్‌ పాటలను రాబట్టుకోవడంలో ఇవివి విఫలమయ్యాడనే చెప్పాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X