సరదా..సరదా..చిత్రం

చిత్రం: మా పెళ్ళికి రండి
నటీనటులు: చక్రవర్తి, సాక్షి శివానంద్, సుధాకర్,
కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, బ్రహ్మనందం,
తనికెళ్ళ భరణి, ఏవీయస్
మాటలు: సతీష్
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
కెమెరా: జయరాం
నిర్మాతలు: అనూరాధా దేవి, జె.కిరణ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముప్పలనేని శివ
సినిమా టైటిల్‌కు, కథకు సంబంధం లేని రెండున్నర గంటల సరదా చిత్రం ఇది. కథలోనూ, కథనంలోనూ కొత్తదనం లేకున్నా కాలక్షేపం కోసం కావాలనుకునే వారికి నచ్చే చిత్రమిది. ఆద్యంతం సరదా..సరదా సన్నివేశాలే. చక్రవర్తి కన్నా కమెడియన్ల పాత్రే ఎక్కువ ఈ సినిమాలో.
చక్రవర్తి భూస్వామి కోట శ్రీనివాసరావు కొడుకు. స్నేహితుడు, మామ సుధాకర్ తో కలిసి చదువుసంధ్యలు లేకుండా హాయిగా తిరుగుతూ కాలక్షేపం చేయడమే పనిగా పెట్టుకుంటాడు. తండ్రి ఆస్తిని అనుభవిస్తూ ఆటపాటలతో గడిపేస్తుంటాడు. వాళ్ళ ఊరి దగ్గర్లోని ఓ ఎగ్జిబిషన్ కు వచ్చిన సాక్షిశివానంద్ ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. మొత్తానికి ఇద్దరూ ప్రేమలో పడుతారు. పాటలు పాడుకుంటారు (మలేషియాలో).
కోట స్నేహితుడు చంద్రమోహన్. తన కూతురును చక్రవర్తికి ఇవ్వాలని చంద్రమోహన్ అనుకుంటాడు. అందుకోసం ముహూర్తాలు కూడా ఏర్పాటు చేస్తాడు. ఆల్రెడీ సాక్షి ప్రేమలో పడిన మనవాడు ఎంగేజ్ మెంట్ రోజున అల్లరి అల్లరి చేసి సంబంధాన్ని చెడగొడుతాడు. కానీ పెళ్లికూతురు సాక్షి శివానందే అని తెలవడంతో షాక్ తింటాడు. ఇక సాక్షిని సొంతం చేసుకునేందుకు చక్రవర్తి పడ్డ కష్టాలే సెకండ్ హాఫ్. ఊరి వదిలి పట్నం వచ్చి ఓ ఫ్యాక్టరీలో చేరి త్వరగా ప్రమోషన్లూ పొంది ప్రయోజకుడవుతాడు. చక్రి మంచితనం గ్రహించిన చంద్రమోహన్ వారిద్దరి పెళ్ళికి అంగీకరిస్తాడు.
వందల కొద్దీ సినిమాల్లో వచ్చిన కథే. అయితే సరదా సన్నివేశాల వల్ల చిత్రం బోరుకొట్టకుండా సాగుతుంది. బ్రహ్మనందం, సుధాకర్, ఏవీయస్ లు కామెడీ బాగా పండించారు. సినిమాకు ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతం హైలెట్. సతీష్ అందించిన మాటలు ఫర్వాలేదు. నటీనటుల్లో సుధాకర్ నటనే హైలెట్. మిగిలిన వారందరూ పాత్రలకు తగ్గట్లు నటించారు. మలేషియా, కౌలాలంపూర్ అందాల్ని కెమెరామెన్ జయ రాం కొత్తకోణంలో చూపించారు.
maa pelli ki randi jdchakravarthi మా పెళ్ళికి రండి చక్రవర్తి సాక్షి శివానంద్ సుధాకర్ కోట శ్రీనివాసరావు


Click it and Unblock the Notifications