Maareesan Twitter Review: మారీసన్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. కమల్, కార్తీక్ ట్విట్స్ కేక
మలయాళ సూపర్ స్టార్ ఫాహద్ ఫాజిల్, తమిళ స్టార్ కమెడియన్ వడివేలు కలిసి నటించిన చిత్రం మారీసన్. ఈ సినిమాకు వీ కృష్ణమూర్తి కథను అందించగా, సుదీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్బీ చౌదరీ నిర్మించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫాహద్ ఫాజిల్ పలు విషయాలు ప్రస్తావించారు. ఆయన చెప్పిన విషయాలు, ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..
మారీసన్ సినిమాలో కోవై సరళ, వివేక్ ప్రసన్న, సితారా తదితరులు నటించారు. ఈ సినిమాకు కళై సెల్వన్ శివాజీ సినిమాటోగ్రఫి, శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. జూలై 25వ తేదీన రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే...

తమిళ సినిమా రంగానికి మారీసన్ సినిమా రూపంలో విజయం లభించింది. ఇటీవల కాలంలో క్లీన్ ఎమోషనల్ మూవీ. సెకండాఫ్ అదిరిపోయింది. ఎప్పటిలానే ఫాహద్ ఫాజిల్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ఈ సినిమాలో ట్విస్టులు, టర్నులు బాగా వర్కువుట్ అయ్యాయి. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు ఆకట్టుకొన్నాయి. ఫ్రెష్ మైండ్‌తో వెళితే.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ సినిమా సర్‌ప్రైజ్ ఇస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మారీసన్ సినిమా గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ట్వీట్ చేస్తూ.. రోడ్ మూవీకి సంబంధించిన స్క్రిప్టును అద్బుతంగా రాశారు. డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ట్విస్టులు, టర్నులు సూపర్బ్‌గా చూపించారు. వడివేలు, హాహద్ ఫాజిల్ యాక్టింగ్ సూపర్బ్. టీమ్ అందరికి నా కంగ్రాట్స్ అని అభినందించారు.
మారీసన్ సినిమా గురించి కమల్ హాసన్ ట్వీట్ చేసి.. ఈ మూవీని ఇప్పుడే చూశాను. ఈ సినిమా నాకు వినోదాన్ని మాత్రమే పంచకుండా.. ఆలోచింప చేసింది. ఈ సినిమా నిర్మాణంపై ఆరాధన పెరిగింది. ఈ కథలోని డెప్త్ ఆకట్టుకొన్నది. అద్బుతమైన సినిమాను అందించిన యూనిట్ సభ్యులతో మాట్లాడాను. వారితో వండర్‌ఫుల్ సంభాషణ జరిగింది. వినోదాన్ని పక్కన పెడితే.. మానవ భావోద్వేగాల చాటున ఉండే సామాజిక స్పృహ, మన సమాజంలో జరిగే చీకటి కోణాలు గురించి చక్కగా చెప్పింది. ఓ క్రియేటర్‌గా, ప్రేక్షకుడిగా నాకు కొత్త విషయాలను బోధించింది. స్పూర్తిని అందించింది అని కమల్ హాసన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆల్జీమర్స్ వ్యాధికి గురైన వేలాయుధం తనకు పరిచయం లేని దయా అనే ఓ వ్యక్తితో ప్రయాణం మొదలుపెడుతాడు. ఆ ప్రయాణంలో ఎన్ని మలుపులు, ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకొంటాయి. ఈ సినిమాలో ఎమోషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. వడివేలు ఎమోషన్స్ కూడిన నటను ప్రదర్శించాడు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బాగుంది. హాస్యంతో కూడిన సంభాషణలు కేక పెట్టిస్తాయి. వడివేలు, ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్ సూపర్బ్. థ్రిల్లింగ్‌తో సాగే ఈ సినిమా మీకు చక్కటి అనుభూతిని పంచుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మారీసన్ సినిమాలో తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నడూ చేయలేని పాత్రను వడివేలు ఈ సినిమాలో చేశాడు. ఆయన పెర్ఫార్మెన్స్ నట జీవితంలో మైలురాయిగా నిలిచిపోతుంది. ఇప్పటి వరకు ఆయన ఎన్నో కామెడీ రోల్స్‌లో నటించాడు. కానీ ఈ సినిమాలోని పాత్ర బెస్ట్ అని నెటిజన్ కామెంట్ చేశాడు.
మారీసన్ సినిమా రన్ టైమ్ తగ్గించి ఉంటే.. డైరెక్షన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడినా ఇంకా బెటర్ రిజల్ట్ ఉండేది. వడివేలు, ఫాహద్ ఫాజిల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది. డైలాగ్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ కొన్ని చోట్ల బాగా వర్కవుట్ అయ్యాయి. డ్రామాగా సాగే ఈ కథలోని ఎలిమెంట్స్ స్క్రీన్ ప్లేలో లోపాలను సవరించింది. సెకండాఫ్ సినిమా బాగుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్, ఫీల్ గుడ్ మూమెంట్స్ ఈ సినిమాను హిట్ అయ్యేలా చేసింది అని నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











