Maargan Movie Review: మార్గన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: విజయ్ ఆంటోని, అజయ్ దిషాన్, పీ సముద్రఖని, మహానది శంకర్, ప్రితీక, బ్రిగిడా సాగా తదితరులు
దర్శకత్వం: లియో జాన్ పాల్
నిర్మాత: మీరా విజయ్ ఆంటోని
మ్యూజిక్: కూడా విజయ్ ఆంటోని
ఎడిటర్: లియో జాన్ పాల్
సినిమాటోగ్రాఫర్: యువ ఎస్
బ్యానర్: విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్
రిలీజ్ డేట్: 2025-06-27
పోలీస్ ఆఫీసర్ అయిన ధ్రువ్ (విజయ్ ఆంటోని) అసిస్టెంట్ డీజీపీగా హైదరాబాద్‌లో పనిచేస్తుంటాడు. నగరంలో సీరియల్ కిల్లింగ్ వ్యవహారం పోలీస్ డిపార్ట్మెంట్ సవాల్‌గా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో సీరియల్ కిల్లర్ వెంటాడే బాధ్యతను ధ్రువ్ తీసుకొంటాడు. అరవింద్ ( అజయ్ ధిషాన్) యువకుడిని అదుపులోకి తీసుకొని తన టీమ్ (బ్రిగిడా సాగా) ఇంటరాగేషన్ చేస్తుంటాడు. హత్య తర్వాత వారి డెడ్ బాడీలు నల్లగా మారిపోతుంటాయి.
ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు వరుస హత్యలు చేస్తుంటాడు? మృతుల బాడీ నల్లగా మారడానికి కారణం ఏమిటి? ధ్రువ్ దర్యాప్తు ఎలా సాగింది. ఈ సీరియల్ కిల్లింగ్ వ్యవహారాల వెనుక అసలు కుట్ర ఏమిటి? చివరకు సీరియల్ కిల్లర్‌ను ఎలా గుర్తించాడు? మిస్టరీ క్రైమ్‌ను ధ్రువ్ ఎలా సాల్వ్ చేశాడనే ప్రశ్నలకు సమాధానమే మార్గన్ సినిమా కథ.

వరుస హత్యల ఘటనల నేపథ్యంలో కథను దర్శకుడు లీలా జాన్ పాల్ ఆసక్తికరంగా మొదలుపెట్టాడు. ప్రతీ సన్నివేశంలోను క్యూరియాసిటీని పెంపొందించే విధంగా స్క్రీన్ ప్లేను డిజైన్ చేసుకోవడం బాగుంటుంది. కథ, కథనాలకు తోడు అజయ్ దిషాన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన చాలా కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనాన్ని హైలెట్ చేస్తూ అజియ్ కూడా డిఫరెంట్ వేరియేషన్స్, బాడీ లాంగ్వేజ్‌తో చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. దాంతో ఆ క్యారెక్టర్‌పై ఆడియెన్స్‌కు ఎట్రాక్షన్ కలిగే విధంగా అజయ్ నటించి మెప్పించాడు. అయితే కథలో డెప్త్ లేకపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ చప్పగా సాగడం సినిమా వేగాన్ని స్లో చేసిందా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి కథకు డైరెక్షన్ లేకుండానే ఫస్టాఫ్‌ను చాలా స్లోగా ముగించాడనిపిస్తుంది.
అయితే సెకండాఫ్‌లో ట్విస్టులు విప్పుకొంటూ పోయిన తీరు సినిమాపై అటెన్షన్ పెరిగేలా చేస్తుంది. అయితే ఈ కథలో విజయ్ ఆంటోని పాత్ర ఎమోషనల్‌గా, సెన్సిటీవ్‌గా ఉన్నప్పటికీ.. కథను మలుపు తిప్పే పరిస్థితి ఆ పాత్రకు లేకపోవడం నిరాశగా మారుతుంది. అయితే చివర్లో డాటర్ సెంటిమెంట్‌తో విజయ్ కథలో తన ఉనికి చెప్పే ప్రయత్నం బాగుంది. అయితే విద్యార్థులు, యువతీ యువకులు వేదనకు గురయ్యే ఓ సామాజిక అంశాన్ని హైలెట్ చేస్తూ సినిమాను ముగిస్తాడు. కానీ సినిమా హడావిడిగా.. చప్పగా ముగించినట్టు అనిపిస్తుంది.
నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అరవింద్ పాత్రలో నటించిన అజయ్ దిషాన్ సినిమాకు బలంగా కనిపిస్తాడు. కొత్తగా తన పాత్రను ఎలివేట్ చేస్తూ తనలోని ప్రతిభను రుచి చూపించేందుకు ప్రయత్నించిన తీరు ప్రశంసనీయం. తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొన్నాడు. విజయ్ ఆంటోని ఈ సినిమాకు షో రన్నర్, గైడింగ్ ఫోర్స్‌గా మారారు. బ్రిగిడా సాగా పోలీసు ఎస్సైగా తన మార్క్ చూపించే ప్రయత్నం చేసింది. మిగితా పాత్రల్లో నటించిన వారు పర్వాలేదనిపించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. క్రైమ్ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను విజయ్ ఆంటోని అందించారు. చాలా సన్నివేశాలను తన మ్యూజిక్‌తో హైలెట్ చేశారు. యువ సినిమాటోగ్రఫి బాగుంది. డైరెక్టర్ లీలా జాన్ పాల్ ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే కథ డిమాండ్ మేరకు నిడివిని సన్నివేశాలకు జస్టిఫై చేశారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.
డాటర్, సిస్టర్ సెంటిమెంట్ అంశాలుగా సాగే మర్డర్ మిస్టరీ. ఈ కథను బాగా చెప్పేందుకు స్కోప్ ఉన్నప్పటికీ..ఆ దిశగా పూర్తిగా దృష్టి పెట్టాల్సి ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాకు అజయ్ దిషాన్, విజయ్ ఆంటోని కీలకం. స్క్రీన్ ప్లే బాగుంది. కథపై మరింత కసరత్తు చేయాల్సింది. విజయ్ ఆంటోని సినిమాలను ఇష్టపడేవారు ఓ సారి ఈ సినిమాను చూడొచ్చు. ఎక్కువగా ఊహించుకోకుండా వెళ్తే.. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.


Click it and Unblock the Notifications











