twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ మీదొట్టుఫర్వాలేదు ఈ చిత్రం

    By Staff
    |

    Maavidamedottu
    -జలపతి గూడెల్లి
    చిత్రం: మాఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది
    నటీనటులు: శ్రీకాంత్‌, రాశి, నవీన్‌, లయ,
    కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌ రాజు, అవంతిక...
    సంగీతం: శ్రీనివాస మూర్తి
    కథ, స్క్రీన్‌ ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఇవివి సత్యనారయణ.

    పెళ్ళి, తాళి చుట్టు కథ అల్లుకొని ఇవివి సత్యనారయణ రూపొందించిన మరో చిత్రం ఇది. చాలా బాగుంది తర్వాత సొంత బ్యానర్‌ పై నిర్మించిన ఈ మీ ఆవిడ మీదొట్టు మా ఆవిడ చాలా మంచిది చిత్రం ఫర్వాలేదనిపించే విధంగా ఉంది. కథే ప్రధానంగా పకడ్బందీ స్క్రీన్‌ ప్లేతో తీసిన ఈ సినిమాలో కామెడీ పాలు మాత్రం తక్కువే. ఈ చిత్రంలో ఉన్న ప్లస్‌ పాయింట్‌ ఏమిటంటే- తాళి మీద, పెళ్ళి మీద అనర్ఘలమైన నీతి వ్యాఖ్యలు లేవు.(అసలు లేవని కాదు చాలా తక్కువ). ఎటువంటి సైడ్‌ ట్రాక్స్‌ లేకుండా సినిమా టకా..టకా నడుస్తుండడం వల్ల బోర్‌ కొట్టే సమస్యే లేదు.

    నవీన్‌, రాశి ప్రేమించుకుంటారు. తల్లితండ్రులు ఒప్పుకోకపోవడంతో లేచిపోయేందుకు ప్రయత్నిస్తారు. లేచిపోయేందుకు ప్రయత్నిస్తున్న నవీన్‌ ను తండ్రి కోట శ్రీనివాసరావు తల మీద బాది ఆస్పత్రిలో పడేట్లు చేస్తాడు. దాంతో వీరి పలాయనం ఫెయిల్‌ అవుతుంది. రాశికి శ్రీకాంత్‌ తో పెళ్ళి అవుతుంది. నవీన్‌ కు మేనకోడలు లయను కట్టబెడుతాడు కోట. నవీన్‌ కు వైజాగ్‌ నుంచి ట్రాన్స్‌ ఫర్‌ అవుతుంది. మా పక్కిల్లు ఖాళీగానే ఉందంటూ కోలీగ్‌ శ్రీకాంత్‌ నవీన్‌ కు హైదరాబాద్‌ లో ఇల్లు చూపిస్తాడు. శ్రీకాంత్‌ పక్కింట్లోనే నవీన్‌ కాపురానికి దిగుతాడు. ఇక్కడ మళ్ళీ రాశి తారసపడడంతో కలవరం మొదలవుతుంది. పేరుకు మేమిద్దరం భార్యభర్తలం కానీ తనను ఇంతవరకు అసలు టచ్‌ కూడా చేయలేదని శ్రీకాంత్‌ ఓ రోజు నవీన్‌ కు చెప్పుతాడు.

    సో వీరిద్దరిని ఒకటి చేసేందుకు నవీన్‌ ప్రయత్నిస్తాడు. తను చేసేది తప్పు అని రాశికి తెలియచేస్తాడు. కానీ ఆమె వినదు. సో ఇద్దరు కలిసి గోవాకు లేచిపోతారు. గోవాలో లేచిపోయివచ్చిన మరో జంట ప్రకాష్‌ రాజు, అవంతికి వీరికి కలుస్తారు. ప్రకాష్‌ రాజ్‌, అవంతికల ప్రవర్తనతో రాశికి తను చేసిన తప్పు తెలిసి వస్తుంది. తన భర్త దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది. నవీన్‌ కు గుడ్‌ బై చెప్పేసిన రాశిని శ్రీకాంత్‌ ఏమీకానట్టు చేరదీస్తాడు. మరోవైపు తన బావ రాశితో లేచిపోయి వచ్చాడని తెలిసిన లయ అతని వల్ల కలిగిన గర్భాన్ని తీయేంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ నవీన్‌ ఏ తప్పు చేయలేదని, రాశిలో మార్పు తీసుకువచ్చేందుకే తాము బేవార్స్‌ జంటగా నటించామని ప్రకాష్‌ రాజు, అవంతిక తెలియచేయడంతో కథ సుఖాంతమవుతుంది.

    నటన పరంగా అందరూ చక్కగా చేశారు. స్క్రీన్‌ ప్లేలో పట్టు ఉండడమే ఈ సినిమాకు ఎస్సెట్‌. దీంతో పాటు శ్రీనివాస మూర్తి సంగీతం చాలా బావుంది. ఒక్క పాట మినహా అన్ని బావున్నాయి. సీతారామ శాస్త్రి, చంద్రబోస్‌ ల చక్కటి సాహిత్యానికి చక్కటి బాణీలు కట్టాడు. ఫోటోగ్రఫీలో రిచ్‌ నెస్‌ ఉంది. కామెడీ పాత తరహా. ఓవరాల్‌ గా ఫర్వాలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X