twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Maayon movie review గాడ్ వర్సెస్ సైన్స్ నేపథ్యంగా.. ఇళయరాజా మ్యూజిక్, గ్రాఫిక్స్ అదుర్స్

    |

    Rating: 2.75/5

    నటీ నటులు: సిబిరాజ్, తాన్యా రవిచంద్రన్, రాధా రవి, కేఎస్ రవికుమార్, ఎస్ఏ చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్, హరీష్ పేరడి, అరాష్ షా తదితరులు
    దర్శకత్వం: కిషోర్ ఎన్
    స్క్రీన్ ప్లే: అరుణ్ మోజీ మాణికం
    నిర్మాత: మామిడాల శ్రీనివాస్,అరుణ్ మోజి మాణికం
    సినిమాటోగ్రఫి: రామ్ ప్రసాద్
    ఎడిటింగ్: రాం పాండ్యన్, కొండలరావు
    మ్యూజిక్: మాస్ట్రో ఇళయరాజా
    బ్యానర్: డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్
    రిలీజ్ డేట్: 2022-07-07

    మాయోన్ కథ ఏమిటంటే?

    మాయోన్ కథ ఏమిటంటే?

    అర్జున్ (సిబిరాజ్), అంజనా (తన్యా రవిచంద్రన్), దేవరాజ్ (హరీష్ పేరడి) పురావస్తు శాఖలో పనిచేస్తుంటారు. అయితే 5 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మయోన్ ఆలయంలోని సీక్రెట్ గదిలో గుప్త నిధుల గురించి పరిశోధన చేస్తుంటారు. అయితే 6 గంటల తర్వాత ఆలయం తలుపులు మూసిన తర్వాత ఆలయంలోకి వెళ్లినవాళ్లు పిచ్చివాళ్లుగా మారిపోతారనే మూఢనమ్మకం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అర్జున్, అంజనా తన సహ ఉద్యోగులతో కలిసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆలయంలోకి వెళ్తారు.

    మాయోన్ కథలో ట్విస్టులు

    మాయోన్ కథలో ట్విస్టులు

    ఆలయం తలుపులు మూసిన తర్వాత లోనికి వెళ్తే పిచ్చివాళ్లు అవుతారనేది మూఢ నమ్మకమేనా? 5 వేల సంవత్సరాల చరిత్ర గిలిగిన ఆలయంలోకి గంధర్వులు వస్తారా? అలాంటి ఆలయంలో శ్రీకృష్ణ భగవానుడు రాత్రి నిద్రిస్తారా? ఇంతకు ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయా? సీక్రెట్ రూంలో గుప్త నిధులపై పరిశోధన చేసిన అర్జున్, అంజనా ఎలాంటి ఫలితం దక్కింది. ఆరు గంటల తర్వాత లోనికి వెళ్లిన అర్జున్, అంజనాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సీక్రెట్ గదిని అర్జున్ బృందం కనుకొన్నారా? గుప్త నిధులు కొట్టేయాలని కుట్ర పన్నిన దేవరాజ్ ప్రయత్నం ఫలించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే మాయోన్ సినిమా కథ.

    మూవీ ఎలా ఉందంటే?

    మూవీ ఎలా ఉందంటే?

    ఆలయ పూజారి చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి రాత్రి ఆలయంలో ప్రవేశించిన ఓ యువకుడికి ఎదురైన సంఘటనతో మాయోన్ సినిమా మంచి ఎమోషనల్ నోట్‌తో మొదలవుతుంది. అయితే ఆలయానికి సంబంధించిన చరిత్ర, కృష్ణ భగవానుడి కోసం గంధర్వుల వచ్చి పాటలు పాడుతారనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ కథ కాస్త నెమ్మదిగా మొదలైనప్పటికీ.. ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు కిషోర్ సత్తా చాటాడు. కథలో ట్విస్టులు, ఆసక్తికర అంశాలు సెకండాఫ్‌లో ఉండటం వల్ల ఫస్టాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. అయితే సెకండాఫ్‌లో దర్శకుడు కథ నడిపిన తీరు.. గ్రాఫిక్ అంశాలు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తాయి.

    సిబిరాజ్, తన్యా ఫెర్ఫార్మెన్స్

    సిబిరాజ్, తన్యా ఫెర్ఫార్మెన్స్

    అర్జున్‌గా సిబిరాజ్ రోల్ కొంత నెగిటివ్ టచ్‌తో ఆరంభమైనా.. చివర్లో ఇచ్చిన ట్విస్టు బాగుంటుంది. ఫెర్ఫార్మెన్స్ పరంగా సిబిరాజ్ పలికించిన వేరియేషన్స్ ఆకట్టుకొంటాయి. యాక్షన్ సీన్లలో రాణించాడు. అనుభవం నటుడిలా ఎమోషనల్ సీన్లలో నటించాడు. ఇక తన్యా రవిచంద్రన్ క్యారెక్టర్‌ను చెప్పడంలో కొంత ఏదో తడబాటు కనిపిస్తుంది. తన తల్లిదండ్రులు చిన్నప్పుడే వదిలేశారని ఎమోషనల్ పాయింట్ చెప్పినప్పటికీ.. ఆ విషయాన్ని వివరంగా చెప్పలేకపోయారు.

    కానీ గ్లామర్‌పరంగాను... ఫెర్ఫార్మెన్స్ పరంగాను ఆకట్టుకొన్నారు. దేవరాజ్‌గా హరీష్ పేరడిలో కనిపించే విలనిజాన్ని ఇంకా కాస్త ఇంటెన్స్‌గా చూపించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. విలనిజం బలంగా పండకపోవడం కొంత సినిమాకు ప్రతికూలంగా మారిందనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా దర్శకుడు కేఎస్ రవికుమార్, ఇతర పాత్రల్లో రాధారవి, తదితరులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

    ఇళయరాజా మ్యూజిక్, గ్రాఫిక్స్ అదుర్స్

    ఇళయరాజా మ్యూజిక్, గ్రాఫిక్స్ అదుర్స్

    ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మయోన్ సినిమాకు ఇళయరాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణంగా మారింది. సందర్బోచితంగా పాటలు బాగున్నాయి. ఇళయరాజా మ్యూజిక్ కథలోని సన్నివేశాలు మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫి బాగుంది. ఇంటెన్స్, ఎమోషనల్ అంశాల కోసం వాడుకొన్న లైటింగ్ బాగుంది.

    ఎడిటింగ్ విషయానికి వస్తే.. ఇంకాస్త పని ఉందనిపిస్తుంది. ఈ సినిమాకు గ్రాఫికల్ వర్క్ నెక్ట్స్ లెవెల్ అనిపిస్తుంది. మామిడాల శ్రీనివాస్,అరుణ్ మోజి మాణికం పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. పాత్రల కోసం ఎంపిక చేసిన నటీనటుల విషయం సినిమాపై ఉండే వారి అభిరుచికి అద్దం పట్టింది. కథపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    పౌరాణిక అంశాలు, దేవుడు మహిమ వర్సెస్ సైన్స్ అనే కోణంలో మాయోన్ సినిమా కథ సాగుతుంది. అయితే కృష్ణుడితో గంధర్వుల అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. తెలుగు టైటిల్ పెట్టి ఉంటే ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండేదనిపిస్తుంది. ఆలయంలో ఎపిసోడ్స్‌కు అందించిన గ్రాఫిక్స్ చాలా క్వాలిటీతో ఉన్నాయి. గుప్తు నిధుల వేట, పౌరాణిక నేపథ్యంతో సాగే కథలను ఇష్టపడే వారికి మయోన్ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇళయరాజా సంగీతం, కంప్యూటర్ గ్రాఫిక్ ఈ సినిమాను రిచ్‌గా మార్చింది. మాయోన్ సినిమా అంచనాలకు మించి 270కిపైగా థియేటర్లలో రిలీజ్ చేయడంతో కమర్షియల్‌గా ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అనేది ఈ వారాంతంలో తెలుస్తుంది.

    English summary
    Popular Actor Satyaraj's son Sibiraj's Maayon released in Telugu states on July 7th. Here is the exclusive review from Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X