For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Macherla Niyojakavargam reveiw రొటీన్ కథతో నితిన్.. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌

  |

  Rating:
  2.0/5

  భీష్మ లాంటి హిట్ తర్వాత భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గంతో ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. కానీ అవి భారీ ఓపెనింగ్స్‌ వచ్చేలా చేయడంలో తడబాటు కనిపించింది. అయితే మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నితిన్‌కు ఎలాంటి ఫలితం అందించిందనే విషయాన్ని తెలుసుకొవాలంటే.. మాచర్ల నియోజకవర్గం కథ, కథనాలు సమీక్షించుకోవాల్సిందే.

  మాచర్ల కథ ఏమిటంటే?

  మాచర్ల కథ ఏమిటంటే?

  మాచర్ల ప్రాంతంలో రాజప్ప (సముద్రఖని) ఫ్యాక్షన్ రాజకీయాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంటాడు. ఆ ప్రాంతానికి నిఖార్సైన సిద్దార్థ్ రెడ్డి కలెక్టర్‌‌గా ఆ ప్రాంతానికి వస్తాడు. రాజప్ప ఆగడాలను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తాడు. రాజప్ప ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు మాచర్లలో నియోజకవర్గంలో ఎన్నికలు జరిపించేందుకు సిద్దమవుతాడు.

  మాచర్ల నియోజకవర్గంలో ట్విస్టులు

  మాచర్ల నియోజకవర్గంలో ట్విస్టులు

  గుంటూరు జిల్లాకే సిద్దార్థ్ రెడ్డి ఎందుకు కలెక్టర్‌గా రావాలనుకొంటాడు? తొలి చూపులోనే ప్రేమించిన ప్రియురాలు (కృతిశెట్టి)కి ఎదురైన సమస్య ఏమిటి? ప్రియురాలి కోసం సిద్దూ ఎందుకు అండగా నిలిచాడు? మాచర్ల కలెక్టర్‌గా రాకముందే రాజప్పతో వైరం ఎందుకు కలిగింది? రాజప్పను ఢీకొట్టేందుకు ఎన్నికల్లో నిలబడిన రాఘవయ్య (శుభలేఖ సుధాకర్) విజయం సాధించాడా? రాజప్ప ఫ్యాక్షన్ రాజకీయాల కోరల్లో చిక్కిన మాచర్లను విముక్తి చేయడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే మాచర్ల నియోజకవర్గం సినిమా కథ.

  పక్కా రొటీన్ అంశాలతో

  పక్కా రొటీన్ అంశాలతో

  మాచర్ల ట్రైలర్ ట్రైలర్ చూసిన ఎవరికైనా ఇది సాదాసీదా కమర్షియల్ సినిమా అని అర్ధం అవుతుంది. రాజప్పను ఎదురించే క్రమం.. హీరో సిద్దూ తన లక్ష్యాన్ని ఎలా చేరుకొన్నాడు? కథ, కథనాలు విభిన్నంగా ఉంటాయనే ఆసక్తికర అంశాలే ప్రేక్షకుడిని రప్పించేలా చేసింది. అయితే రొటీన్ మాస్ మసాలా కథను ఊహించినట్టే.. రెగ్యులర్ ప్యాటర్న్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టాడు. అత్యంత రొటీన్ స్క్రీన్ ప్లేతో కథను ఇంటర్వెల్ వరకు సాగదీశాడు. పాటలు, ఫైట్స్, నాలుగు కామెడీ సీన్లతో లాగించే ప్రయత్నం చేశారే తప్ప.. కొత్తగా ప్రేక్షకుడికి అనుభూతిని పంచేలా ఆలోచించకపోవడం సినిమా పరమ రొటీన్‌గా మారింది. ఇంటర్వెల్‌లో కమర్షియల్ బ్యాంగ్‌తో అసలు కథను మొదలుపెట్టే ప్రయత్నం చేశారు.

  విలన్ వర్సెస్ హీరోగానే..

  విలన్ వర్సెస్ హీరోగానే..


  సెకండాఫ్‌లోనైనా కథ తీరు మారుతుందా అనే అనుకొన్న వారికి నిరాశే మిగిలింది. రాజప్ప వర్గాన్ని ఎదురించడం, ప్రజల్లో భయాన్ని పోగొట్టమే కథకు కేంద్ర బిందువైంది. సెకండాఫ్‌లో రారా రెడ్డి పాట జోష్ తప్ప మిగితాది అంతా సేమ్ టూ సేమే. చివర్లలో రాజప్పకు సంబంధించిన చిన్న ట్విస్టు ప్రేక్షకులకు కొత్త థ్రిల్‌గా అనిపిస్తుంది.

  సరైన కథ లేకుండానే దర్శకుడు

  సరైన కథ లేకుండానే దర్శకుడు

  పూరీ జగన్నాథ్ టీమ్‌లో ఎడిటర్‌గా సినిమా కెరీర్ ప్రారంభించిన రాజశేఖర్ రెడ్డి (ఎస్ఆర్ శేఖర్) దర్శకుడిగా మారేందుకు రొటీన్, రెగ్యులర్ కథతో ప్రయోగం చేశాడనే చెప్పాలి. నితిన్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా ఫైట్స్, పాటలు డిజైన్ చేసుకొన్నాడే తప్ప.. కథ, కథనాల మీద ఫోకస్ పెట్టలేదనే విషయం స్పష్టంగా అర్దమవుతుంది. వెన్నెల కిషోర్‌తో నడిపిన నాసిరకంగా కామెడీ ట్రాక్ విఫలమైందనే చెప్పాలి. అక్కడక్కడ(బెడ్ రూమ్ ఎపిసోడ్) నవ్వులు పూయించాయే కానీ కథకు బలంగా మారలేకపోయింది. అయితే నితిన్‌ను కమర్షియల్ హీరోగా కొత్తగా చూపించే ప్రయత్నం ఆకట్టుకొలేకపోయింది.

  నితిన్ మాస్ హీరోగా

  నితిన్ మాస్ హీరోగా


  లవర్ బాయ్‌గా సెన్సిబుల్, సాఫ్ట్ హీరోగా ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్‌కు భిన్నంగా నితిన్ కనిపిస్తాడు. కథ, కథనాల పరిధి మేరకు మాస్ లుక్, డైలాగ్స్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు. ఫైట్స్, డ్యాన్స్‌లో ఎనర్జీ చూపించాడు. కానీ నాసిరకమైన కథ నితిన్‌ను సక్సెస్ బాట పట్టించడం కష్టమే అనిపిస్తుంది. రారా రెడ్డి.. పోరి సూపరో పాటలో నితిన్ జోష్‌గా కనిపించాడు.

  కృతిశెట్టి, క్యాథరీన్ గురించి

  కృతిశెట్టి, క్యాథరీన్ గురించి

  కృతిశెట్టి పాత్ర విషయానికి వస్తే.. పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రనే. కథ ముందుకు తీసుకుపోయేలా ఉంటుందే తప్ప.. కథను మలుపు తిప్పే దమ్మ ఆ పాత్రలో లేకపోయింది. పాటలు, రొమాంటిక్ సీన్లకే పరిమితమైంది. ఇక నిధి (క్యాథరీన్ త్రెసా) పాత్ర కూడా ఆటలో అరటిపండులానే ఉంటుంది. కథా అవసరం కోసం పాత్రను సృష్టించి అప్పడప్పుడు వాడుకొన్నారు. గ్లామర్‌పరంగా కూడా క్యాథరీన్ ఆకట్టుకొలేకపోయింది. అంజలి రెడ్డి పాటలో మెరిసింది. ఇప్పటి మాదిరిగానే సముద్రఖని రాజప్ప పాత్రలో పవర్‌ఫుల్‌గా నటించాడు. కానీ ఆ పాత్రలో విషయం లేకపోవడం వల్ల రొటీన్ విలన్ అనే ఫీలింగ్ కలుగుతుంది.

  సాంకేతిక విభాగాల పనితీరు..

  సాంకేతిక విభాగాల పనితీరు..


  సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్ బాగా చిత్రీకరించాడు. మహతి స్వర సాగర్ పాటలే కాకుండా బీజిఎం కూడా బాగుంది. ఎడిటర్‌గా కోటగిరి తన పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. మామిడాల తిరుపతి రాసిన డైలాగ్స్ కొన్ని చోట్ల భారీగా పేలాయి. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ఫ్యాక్షన్ నేపథ్యంగా మాస్, మసాల అంశాలను మేలవించిన రెగ్యులర్, రొటీన్ కమర్షియల్ చిత్రం మాచర్ల నియోజకవర్గం. కథలోని తీవ్రత ఎలివేట్ కాకపోవడం వల్ల ఎమోషన్స్‌ను తెర మీద పండలేదనిపిస్తుంది. రొటీన్ కామెడీ, మితిమీరిన హాస్యం సినిమాకు మైనస్. అటు నితిన్‌కు గానీ, దర్శకుడు శేఖర్‌ కెరీర్‌కు గానీ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. పాటలు, ఫైట్స్, కమర్షియల్ సినిమాలు ఇష్టపడేవారికి మాచర్ల నియోజకవర్గం నచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే థియేటర్లలో సీతారామం, బింబిసార కలెక్షన్ల పరంగా మంచి దూకుడుతో ఉన్నాయి. అయితే ఈ సినిమా కమర్షియల్ సత్తా కొద్దిరోజులు ఆగితే తెలిసిపోతుంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు


  ప్లస్ పాయింట్స్
  మ్యూజిక్,
  సినిమాటోగ్రఫి
  నితిన్, సముద్రఖని పెర్ఫార్మెన్స్

  మైనస్ పాయింట్స్
  కథ, కథనాలు
  డైరెక్షన్, స్క్రీన్ ప్లే

  మాచర్ల నియోజకవర్గంలో నటులు, సాంకేతిక వర్గం

  మాచర్ల నియోజకవర్గంలో నటులు, సాంకేతిక వర్గం

  నటీనటులు: నితిన్, కృతిశెట్టి, క్యాథరీన్ త్రెసా, సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, జయప్రకాశ్, ఇంద్రజ, శుభలేక సుధాకర్, బ్రహ్మాజీ, అంజలి తదితరులు
  రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి
  డైలాగ్స్: మామిడాల తిరుపతి
  నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
  సినిమాటోగ్రఫి: ప్రసాద్ మూరెళ్ల
  ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
  మ్యూజిక్: మహతి స్వర సాగర్
  బ్యానర్: శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మ్యూజిక్
  రిలీజ్ డేట్: 2022-08-12

  English summary
  Hero Nithiin's Macherla Niyojakavargam hits the screens on August 12th. Krithi Shetty, Catherine Tresa are the lead heroines. Here is the Exclusive review from Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X