Mad Square Censor Review: మ్యాడ్ స్క్వేర్ సెన్సార్ రివ్యూ.. మ్యాడ్ రేంజ్ హిట్టు పడేనా?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. ప్రముఖ నిర్మాత హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహారించారు. యువ దర్శకుడు కల్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలో నటించారు. గతేడాది రూపొందిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్టు, రివ్యూ వివరాల్లోకి వెళితే..
మ్యాడ్ చిత్రం పూర్తిస్థాయి వినోదాన్ని అందించి ప్రేక్షకులు, సినీ క్రిటిక్స్ మెప్పు పొందింది. ఈ చిత్రంలోని నాలుగైదు క్యారెక్టర్లు ఫన్ క్రియేట్ చేశాయి. కథ కంటే కథనానికి ప్రాధాన్యం ఉండటంతో సినిమా ఆహ్లాదభరితంగా ఉందనే టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సంపాదించింది. అలాంటి సక్సెస్ ఫుల్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్ మూవీపై అదే అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఫన్ అండ్ లాఫింగ్ రైడ్‌కు సిద్దమైన మ్యాడ్ స్వ్కేర్ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అఫీషియల్స్ వీక్షించారు. ఈ సినిమాకు పెద్దగా అభ్యంతరాలు చెప్పకుండా సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతోపాటు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అందించారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
గోవాకు వెళ్లిన ముగ్గురు యువకులకు ఎదురైన అనుభవాలు, వారి చుట్టూ తిరిగే నాలుగైదు పాత్రలు సృష్టించే వినోద ప్రధానంగా సాగే ఈ మూవీ రన్ టైమ్ 127 నిమిషాలు. పార్ట్ వన్ మాదిరిగానే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. అంచనాలు లేకుండా, కథేంటి? లాజిక్కులు వెతక్కుండా సినిమాను చూస్తే మంచి ఫీల్ క్రియేట్ అవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
మ్యాడ్ స్క్వేర్ సినిమాకు సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అందించిన పాటలు హైలెట్‌గా నిలుస్తాయి. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత బలంగా మారింది. ఈ రెండు అంశాలు సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తాయి. బుధవారం రిలీజ్ కానున్న ట్రైలర్ తర్వాత ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుందని తెలిపారు.
మ్యాడ్ స్వ్కేర్ సినిమాపై నెలకొన్న అంచనాలను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వస్తున్న కలెక్షన్లు మరింత క్రేజ్ పెంచాయి. యూఎస్‌లో ఒపెన్ అయిన ప్రీ సేల్స్‌కు మంచి స్పందన వ్యక్తమవుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్‌కు కూడా భారీ రెస్పాన్స్ నమోదు అవుతున్నది. ఈ సినిమా మ్యాడ్ మూవీని మించిన సక్సెస్ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











