Mad Square Movie Review: మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, రెబ్బా మోనికా జాన్, ప్రియాంక జువాల్కర్, విష్ణు, మురళీ గౌడ్ తదితరులు
దర్శకత్వం: కల్యాణ్ శంకర్
నిర్మాత: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సమర్పణ: నాగవంశీ సూర్యదేవర
సంగీతం: భీమ్స్
బీజీఎం: తమన్.
సినిమాటోగ్రఫి: శ్యామ్ దత్
బ్యానర్: శ్రీకర స్టూడియోస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
రిలీజ్ డేట్: 28-03-2025

ఇంజినీరింగ్ స్టడీస్ ముగించుకొన్న మనోజ్, అశోక్, దామోదర్ (నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్) తమకు నచ్చిన పని చేసుకొనే పనిలో ఉంటారు. అయితే ఫ్రెండ్ లడ్డూ అలియాస్ గణేష్ (విష్ణు) పెళ్లి చేసుకొంటున్నాడనే విషయం తెలుస్తుంది. తమను పెళ్లికి పిలవకపోయినా లడ్డూ పెళ్లికి ముగ్గురు వెళ్తారు. అయితే ఊహించినట్టే లడ్డూ పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి ఆగిపోయినా తన ముగ్గురు స్నేహితులతో కలిసి లడ్డూ గోవాకు హనీమూన్‌కు వెళ్తారు.

Mad Square Movie Review

లడ్డూ తన పెళ్లికి మనోజ్, అశోక్, దామును ఎందుకు పిలువలేదు. పిలువని పేరంటానికి వెళ్లిన ఆ ముగ్గురు ఏం చేశారు? పెళ్లి ఏ పరిస్థితుల్లో ఆగిపోయింది? పెళ్లి ఆగిపోయిన తర్వాత వారంతా కలిసి హానీమూన్‌కు ఎందుకు వెళ్లారు? గోవాలోని మ్యూజియంలో గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఈ నలుగురు ఎలా ఇరుక్కుపోయారు? గోవాలో లడ్డూ తండ్రి (మురళీధర్ గౌడ్)‌ను భాయ్ (సునీల్) ఎందుకు కిడ్నాప్ చేశారు? గోవాలో కలిసిన లైలా ఎవరు? లైలా( ప్రియాంక జువాల్కర్) కోసం అందరూ ఎందుకు వెతికారు? చివరికి గోల్డ్ చైన్ దొంగతనం కేసు ఏమైంది. లడ్డూ తండ్రిని ఎలా విడిపించారు? ఈ కథలో అశోక్ కుమార్ (నార్నే నితిన్) రోల్ ట్విస్ట్ సినిమాకు ఎలా ఉపయోగపడింది? అనే ప్రశ్నలకు సమాధానమే మ్యాడ్ స్క్వేర్ సినిమా కథ.

మ్యాడ్‌ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకొన్న తొలి చిత్ర దర్శకుడు కల్యాణ్ శంకర్.. తన మలిప్రయత్నంలో ఆ సినిమాకే సీక్వెల్ చేసి తన జోనర్‌పై ఎలాంటి పట్టు ఉందో అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కథ విషయంలో పెద్దగా స్కోప్ లేని చిన్న పాయింట్‌ తీసుకొని.. దాని చుట్టు అల్లుకొన్న సన్నివేశాలే ఈ సినిమాకు అత్యంత బలంగా మారాయి. కొన్ని సీన్లు ఊహకు అందనివిగా ఉంటే.. మరొకొన్ని చాలా నాసిరకంగా ఉన్నాయి. సినిమా విషయంలో ప్రమోషన్స్‌లో చెప్పినట్టుగానే.. బాలీవుడ్‌లో హంగామా సీరీస్ మాదిరిగానే లాజిక్ లెస్, సెన్స్ లెస్, నాన్సెస్ కామెడీ మంచి వినోదాన్ని పండించడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే రెండున్నర గంటల వినోదాన్ని ఆస్వాదించవచ్చనే విషయాన్ని మ్యాడ్ స్క్వేర్ ద్వారా చెప్పడమే కాకుండా మెప్పించే ప్రయత్నం కూడా బాగా చేశారు.

మ్యాడ్ తరహాలోనే ఈ చిత్రంలో మనోజ్, అశోక్, దామోదర్, లడ్డూ చుట్టే సన్నివేశాలు తిరుగుతుండటంతో వారు బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడానికి వీలు పడింది. డైలాగ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ముగ్గురితోపాటు లడ్డూ ఇరుగదీశారు. యాక్టర్లు తెర మీద కనిపించకుండా కేవలం క్యారెక్టర్లు బిహేవ్ చేశాయనే విధంగా వారు నటించారని చెప్పవచ్చు. జోష్, ఫన్, సెటైరికల్ డ్రామాలో నలుగురితోపాటు లడ్డూ ఫాదర్ క్యారెక్టర్‌లో మురళీధర్ అత్యంత ఎ నటించి.. నవ్వులు పూయించారు. ఇక సునీల్, శుభలేఖ సుధాకర్, మోనికా రెబ్బా జాన్ లాంటి క్యారెక్టర్లు స్పెషల్ ఎట్రాక్షన్. ఈ చిత్రంలో నటించిన ప్రతీ చిన్న ఆర్టిస్టు కూడా తమకు తోచిన విధంగా గుర్తుండిపోయేలా నటించారు.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాల పనితీరు చాలా బాగున్నాయి. భీమ్స్ పాటలతో అదరగొడితే.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సీన్లను క్రేజీగా మలిచారు. నవీన్ నూలీ ఎడిటింగ్ ఈ సినిమాకు ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంది. చకచక్కా సీన్లను పరుగులు పెట్టిస్తూ కామెడీ, ఫన్ ఫ్లేవర్‌ను చక్కగా చూపించారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి మరో అదనపు ఆకర్షణ. గోవాలో ఎపిసోడ్స్ చాలా చక్కగా కెమెరాలో బంధించారు. హారిక, సాయి సౌజన్య అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్‌గా మ్యాడ్ స్క్వేర్ సినిమా గురించి చెప్పాలంటే.. ముందు చెప్పినట్టుగానే నాన్ సెన్స్ కామెడీ మూవీ. అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా సన్నివేశాలు ఉండటం ఈ సినిమా ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలు లేకుండా.. యూత్ ఫుల్ కామెడీ మూవీని ఎంజాయ్ చేయాలనుకొనే వారికి ఈ వారం థియేటర్‌లో ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటింది. కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ కూడా ఆస్వాదించే లాజిక్ లెస్ ఫన్ ఉంటుంది. కేవలం ఎంటర్‌టైన్ అవుదామని అనుకొనే వారికి మ్యాడ్ స్క్వేర్ చక్కటి ఆప్షన్. ఈ వారం ఫన్ లవర్ ఆలోచించకుండా వెళ్తే రెండు గంటలు హాయిగా నవ్వుకొనే బయటకు వచ్చే సినిమా అని చెప్పవచ్చు.

More from Filmibeat

Read more about: narne nithiin sunil Mad Square
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X