Mad Square Twitter Review: మ్యాడ్ స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ!

బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన మూవీ మ్యాడ్ స్క్వేర్. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరించారు.

భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 28వ తేదీన భారీగా రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో ఇచ్చిన రివ్యూలు, అభిప్రాయల వివరాల్లోకి వెళితే..

Mad Square Movie Twitter Review

మ్యాడ్ స్క్వేర్ సినిమా ఫస్టాఫ్ బాగుంది. కొన్ని వన్ లైనర్స్ హిలేరియస్‌గా ఉన్నాయి. లడ్డూ ఫాదర్‌గా నటించిన మురళీధర్ గౌడ్ వన్ మ్యాన్ షో పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. లడ్డూ మ్యారేజ్ ఎపిసోడ్ బాగుంది. స్పెషల్ సాంగ్స్, పెళ్లి సాంగ్స్ బాగున్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మ్యాడ్ స్క్వేర్ సినిమా ఫస్టాఫ్ బాగుంది. ప్రతీ సీన్‌లో కామెడీని జొప్పించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది. 30 నిమిషాలపాటు సాగే మ్యారేజ్ ఎపిసోడ్ కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ ఎపిసోడ్ కోసమే సినిమాను చూడండి. లడ్డూతోపాటు ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు బాగా చేశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

మ్యాడ్ స్క్వేర్ సినిమా ఫస్టాఫ్ బాగుంది. ఫన్ ఓకే. కానీ క్యారెక్టర్లలో సోల్ మిస్ అయింది. కొన్ని సీన్ల బలవతంగా జొప్పించినట్టు ఉంటుంది. మ్యాడ్ కంటే మ్యాడ్ స్క్వేర్ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


మ్యాడ్ స్క్వేర్ సినిమా ఫస్టాఫ్ నిజంగానే బాగుంది. కానీ సెన్స్‌లెస్ కామెడీ. కొన్ని ఫన్ మూమెంట్స్ చూస్తే బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేశారా? అని అనిపిస్తుంది. ఓసారి ఈ సినిమాను చూడటానికి వర్త్ ఉంది. లడ్డూ ఈ సినిమాలో యాక్టింగ్‌తో ఇరుగదీశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగుతంది. మ్యాడ్ హిట్ అయినట్టే మ్యాడ్ స్క్వేర్ కూడా హిట్ అవుతుంది అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు.


మ్యాడ్ స్క్వేర్ సినిమా విన్నర్. ఈ సినిమాలో సిట్యుయేషనల్ కామెడీ టాప్ గేర్‌లో ఉంటుంది. మరోసారి కల్యాణ్ శంకర్ లాజిక్ లేని కామెడీతో నాన్సెన్స్ ఫన్ క్రియేట్ చేశారు. ఈ సీక్వెల్ బాగా వినోదాన్ని అందించడంలో సక్సెస్ అయింది. లడ్డు గాడి పెళ్లి విషయంలో జరిగిన హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. భాయ్, లడ్డూ మధ్య కామెడీ హిలేరియస్‌గా ఉంటుంది అని నెటిజన్ కామెంట్ చేశారు.


మ్యాడ్ స్క్వేర్ సినిమాకు ఇండియాలోను, ఓవర్సీస్‌లోను మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా పరిస్థితి చూస్తే.. యావరేజ్ టాక్ వచ్చినా హిట్ కొట్టేలా ఉంది. ఒకవేళ హిట్ టాక్ వస్తే.. బాక్సాఫీస్‌ను చింపేయడం ఖాయం అని క్రిటిక్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X