Madharaasi Critic Review: మదరాసి మూవీ క్రిటిక్ రివ్యూ

తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్ కథా నాయకుడిగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మదరాసి. తమిళంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌‌పై నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్, మలయాళ నటుడు బిజు మీనన్, విక్రాంత్, షాబీర్, రుక్మిణి వసంత్ తదితరులు నటించారు. సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాపై సెన్సార్ అధికారుల రివ్యూ, ఇతర అంశాల వివరాల్లోకి వెళితే..

మదరాసి సినిమా కథ విషయానికి వస్తే.. తమిళనాడులో నార్త్ ఇండియా మాఫియా, రెండు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ మధ్య జరిే యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో రఘు అనే యువకుడి పాత్రలో శివకార్తీకేయన్ నటిస్తున్నాడు. మాఫియాను ఎదురించే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కథలో లవ్, పగ, ప్రతీకారం, త్యాగం, ఫ్రెండ్‌షిప్, రెండు గ్రూపుల మధ్య వార్ లాంటి అంశాలు హైలెట్‌ అని తెలిసింది.

Madharaasi Movie Review by Overseas Critic

మదరాసి సినిమాను తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం, శ్రీకర్ ప్రసాద్ అక్కినేని ఎడిటర్‌‌గా, సుదీప్ ఎలామన్‌ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమాకు కీలకంగా మారిన సన్నివేశాలకు నాక్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ఎక్స్, బీస్ట్ బెల్స్ కంపెనీలు విజువల్ ఎఫెక్ట్ వర్క్ చేశాయి.

భారీ అంచనాలు పెంచుకొన్న ఈ సినిమాను సింగపూర్‌లో సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు NC16 (No Children Below 16) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. అంటే 16 ఏళ్లకుపై బడిన వారికి ఈ సినిమాను చూసేందుకు అనుమతి ఇచ్చేలా సెన్సార్ అధికారులు నిర్ణయించారు. ఈ సినిమా నిడివి 2 గంటల 48 నిమిషాలు అంటే.. 168 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. ఈ సినిమా గజని సినిమా మాదిరిగా రివేంజ్ డ్రామాగా రూపొందింది. లవ్, యాక్షన్ సినిమాగా ఏఆర్ మురగదాస్ తెరకెక్కించారు అని క్రిటిక్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

మదరాసి చిత్రం ఫస్టాఫ్‌లో లవ్, యాక్షన్, కామెడీ అంశాలు కీలకంగా ఉంటాయి. సెకండాఫ్‌లో ఫుల్ యాక్షన్ సినిమాగా ఉంటుంది. శివకార్తీకేయన్ సరికొత్తగా కనిపిస్తాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం తథ్యం అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఆయుధాల అక్రమ రవాణా నేపథ్యంగా సాగే కథలో హీరోకు ఓ ట్రాజెడీ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఈ సినిమా థ్రిల్లర్‌గా అద్బుతంగా తెరకెక్కించారు. యూకేలో 15 ఏళ్లు దాటిన యువతీ యువకులు ఈ సినిమాను చూసేందుకు సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ప్లస్ అవుతుంది అని పేర్కొన్నారు.

ఈ సినిమా గురించి ఓవర్సీస్ క్రిటిక్ తన పోస్టులో వెల్లడిస్తూ.. కథ, స్క్రీన్ ప్లే రొటీన్‌గా ఉంటుంది. డైలాగ్స్ కూడా రెగ్యులర్‌గా ఉంటాయి. ఏఆర్ మురగదాస్ మళ్లీ కొన్ని విషయాల్లో విఫలమయ్యాడు. డీసెంట్ సినిమాటోగ్రఫి, బీజీఎం, సాంగ్స్ బాగున్నాయి. ట్రైలర్‌ను బాగా ఇంప్రెసివ్‌గా కట్ చేశారు. ఈ సినిమా అంచనాలు దాటుతుందా? అనేది రిలీజ్ తర్వాతే తేలుతుంది అని ఓ క్రిటిక్ అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X