Madharaasi Movie Review: మదరాసి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: శివకార్తీకేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్, బిజూ మీనన్, విక్రాంత్, షబీర్ కల్లరక్కల్ తదితరులు
దర్శకత్వం: ఏఆర్ మురగదాస్
నిర్మాతలు: ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్
మ్యూజిక్: అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫి: సందీప్ ఎలామన్
ఎడిటర్: ఏ శ్రీకర్ ప్రసాద్
రిలీజ్ డేట్: 225-09-05
రోడ్డు ప్రమాదంతో కుటుంబ సభ్యులను కోల్పోయిన రఘురామ్ (శివకార్తీకేయన్) అనాథగా మారుతాడు. తన తల్లిదండ్రుల మరణంతో ఓ మానసిక వ్యాధికి గురి అవుతాడు. ఆ క్రమంలో సూసైడ్‌కు ప్రయత్నించిన రఘురామ్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) చీఫ్ ప్రేమ్‌నాథ్ (బీజూ మీనన్) కాపాడుతాడు. తమిళనాడులో విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నిన విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబీర్ కల్లరక్కల్) ఆట కట్టించడానికి రఘురామ్‌ను ప్రేమనాథ్‌ను తన టీమ్‌లో అనధికారికంగా చేర్చుకొంటాడు.

యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులతోపాటు మొత్తం కుటుంబ సభ్యులను కోల్పోయిన రఘురామ్‌ను వెంటాడిన మానసిక రుగ్మత ఏమిటి? రఘురామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకొన్నాడు? ఎన్ఐఏ చీఫ్ ప్రేమ్‌నాథ్ (బీజూ మీనన్) చేపట్టిన ఆపరేషన్ ఏమిటి? ఆపరేషన్‌లో రఘురామ్‌ను ఎలా భాగస్వామ్యం చేశాడు? డాక్టర్ మాలతి (రుక్మిణి వసంత్)తో ఎలా ప్రేమలో పడ్డాడు? వారిద్దరి ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? తమిళనాడులో ఎలాంటి విధ్వంస కుట్రకు విరాట్, చిరాగ్ ప్లాన్ చేశారు? ఉగ్రవాద కుట్రను రఘురామ్ ఎలా భగ్నం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మదరాసి సినిమా కథ.
తమిళనాడులో ఉగ్రవాద కార్యకలాపాల చుట్టూ అల్లుకొన్న యాక్షన్, రొమాంటిక్, లవ్ స్టోరి. ఇలాంటి అంశాలున్న కథకు మురగదాస్ తనదైన తరహాలో డిస్ఇల్యూజన్ డిజార్డర్ అనే కొత్త పాయింట్‌ను యాడ్ చేసి విభిన్నంగా మలిచే ప్రయత్నం చేశాడు. కానీ కథ, కథనాలు పేలవంగా ఉండటం వల్ల సినిమా స్టోరీ సాగిన విధానం అంతగా ఉత్తేజకరంగా అనిపించదు. కానీ యాక్షన్ ఎపిసోడ్స్, హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ మాత్రం ఫీల్‌గుడ్ అంశంగా మారింది.
యాక్షన్, లవ్ స్టోరీతో రాసుకొన్న పాయింట్‌లో పాత్రల డిజైన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మానసిక వ్యాధి చుట్టు అల్లుకొన్న సన్నివేశాలు ఆకట్టుకోవడం లాంటి విషయాలు సానుకూలంగా మారాయి. హీరో క్యారెక్టరైజేషన్ కోసం చూపించిన ఫ్లాష్ బ్యాక్ స్టోరి కథకు బలంగా మారడమే కాకుండా జస్టిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే కథలో అబ్బురపరిచే ట్విస్టులు లేకపోవడం.. కామన్ ఆడియెన్ ఊహించినట్టుగానే కథ ఉండటం వల్ల మంచి థ్రిల్లర్ చూస్తున్నామనే ఎక్సైట్‌మెంట్ ఎక్కడా కనిపించదు. దర్శకుడు మురగదాస్ తన రొటీన్, రెగ్యులర్ దేశభక్తి పాయింట్ నుంచి పక్కకు వచ్చి డిఫరెంట్‌గా సినిమాను అందించలేరనే చెప్పాలి. అయితే మూవీలో ఫన్, కామెడీ అంశాలకు స్కోప్ లేకపోవడం వల్ల మొత్తం సినిమా సీరియస్‌గానే సాగడం కొంత ఇబ్బందిగా ఉంటుంది.
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. శివకార్తీకేయన్ తన ఇమేజ్ కావాల్సిన హీరోయిజం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే విధంగా సెంటిమెంట్, యూత్‌కు కనెక్ట్ అయ్యేలా రొమాంటిక్ డ్రామా ఉన్న పాత్రలో అద్బుతంగా ఫెర్ఫార్మ్ చేశారు. అయితే కథ, తన పాత్రలో నెక్ట్స్ లెవెల్ అంశాలు లేకపోవడం వల్ల తన క్యారెక్టర్ పరిధిలోనే అభిమానులను మెప్పించే విధంగా కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమాను అందించాడు. రుక్మిణి వసంత్ నటనపరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకొన్నది. బీజూ మీనన్ హుందాగా తన పాత్రలో ఒదిగిపోయాడు. విద్యుత్ జమ్వాల్, షబీర్ విలన్ పాత్రలో క్రూరంగా కనిపించడమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయింది. పలు సన్నివేశాల్లో అనిరుధ్ రవిచంద్రన్ తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేశాడు. బలమైన కథ, సన్నివేశాలు లేకపోవడం వల్ల నెక్ట్ లెవెల్ మ్యూజిక్ అందించలేకపోయారా అనే సందేహం కలుగుతుంది. సందీప్ సినిమాటగ్రఫి బాగుంది. ఈ సినిమా నిడివి కొంత ఎక్కువగాను ఉంది. శ్రీకర్ ప్రసాద్ 10 నుంచి 15 నిమిషాల నిడివిని తగ్గిస్తే.. సినిమా ఇంకాస్త స్పీడ్ పెరిగేది అనిపిస్తుంది. శ్రీలక్ష్మీ ప్రసాద్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
మాస్, కమర్షియల్ అంశాలతో హై ఎండ్ యాక్షన్ డ్రామా మదరాసి. లవ్ ట్రాక్, శివకార్తీకేయన్ పెర్ఫార్మెన్స్, రుక్మిణి వసంత్ గ్లామర్ కోసం ఈ సినిమాను చూడొచ్చు. కథ, కథనాలు బలహీనంగా ఉంటాయి. కమర్షియల్ సినిమాకు కావాల్సిన స్ట్రాంగ్ విలనిజం సినిమాకు ప్లస్. శివకార్తీకేయన్ సినిమాలను ఇష్టపడే వారికి, దేశభక్తి, ఉగ్రవాదం బ్యాక్ డ్రాప్‌తో వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











