Madhave Madhusudana Review మిస్టరీ లవ్ స్టోరి.. మాధవే మధుసూదన రివ్యూ

Rating:
2.5/5

నటీనటులు : తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే‌ తదితరులు
సమర్పణ: బొమ్మదేవర శ్రీదేవి
దర్శక, నిర్మాత: బొమ్మదేవర రామచంద్ర రావు
మ్యూజిక్: వికాస్ బాడిస
సినిమాటోగ్రఫి: వాసు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మానుకొండ మురళీ
బ్యానర్: సాయి రత్న క్రియేషన్స్
పీఆర్వో: సాయి సతీష్, రాంబాబు
రిలీజ్ డేట్: 2023-11-24

మాధవ్ (తేజ్ బొమ్మదేవర) ఎలాంటి బాధ్యతలు లేకుండా జాలీగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. కొడుకు బాధ్యతారాహిత్యంగా స్నేహితులతో తిరగడం చూసి తల్లిదండ్రులు (ప్రియ, జయప్రకాశ్) బాధపడుతుంటారు. ఈ క్రమంలో తమ కంపెనీ వ్యవహారాలు చూసుకోమని చెప్పి మాధవ్‌ను తల్లిదండ్రులు బెంగళూరు పంపిస్తారు. బెంగళూరు వెళ్లకుండా అరకు ప్రాంతానికి వెళ్లిన మాధవ్.. అక్కడ ఓ అమ్మాయిని (రిషికి లోక్రే) చూసి ఇష్టపడతాడు. అయితే ఆ అమ్మాయి తనకు తప్ప ఎవరికి కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Madhave Madhusudana Telugu movie Review and Rating

బెంగళూరు వెళ్లాల్సిన మాధవ్ అరకు ప్రాంతానికి ఎందుకు వెళ్లాడు? అమ్మాయి కేవలం మాధవ్‌కే ఎందుకు కనిపిస్తుంది? అమ్మాయికి మాధవ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అమ్మాయిని చూసి ఆరాధ్య అంటూ ఆమె వెనుకే ఎందుకు వెళ్లాడు? గతంలో అమ్మాయితో మాధవ్‌కు పరిచయం ఉందా? అమ్మాయితో మాధవ్ ప్రయాణం ఎలా జరిగింది? అనే ప్రశ్నకలకు సమాధానమే మాధవే మధుసూదన సినిమా కథ.

మాధవ్ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేస్తూ దర్శకుడు రామచంద్రరావు రాసుకొన్న సన్నివేశాలతో జాలీగా సాగిపోతుంది. ఫస్టాఫ్‌లో బోర్ లేకుండా కథను ముందుకు నడిపించాడు. కానీ బలమైన సన్నివేశాలు, ఎమోషన్స్ ఇంకా పండి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. కొంత నీరసంగా, నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకు సాహిత్యం స్పెషల్ ఎట్రాక్షన్. పాటలు, మాటలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి.

Madhave Madhusudana Telugu movie Review and Rating

తేజ్ బొమ్మదేవరకు మాధవే మధుసూదన సినిమా తొలి చిత్రమైనప్పటికీ.. ఎక్కడా కొత్తగా వాడనే ఫీలింగ్ కలిగించలేదు. క్యారెక్టర్ కావాల్సిన యాటిట్యూడ్, పాత్రకు తగినట్టుగా హావభావాలను చక్కగా పలికించాడు. ఫైట్స్, సాంగ్స్‌లో ఈజ్‌తో ఆకట్టుకొన్నాడు. రిషికి లోక్రే తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించారు. స్నేహితులుగా రవి, శివ కామెడీని పండించారు.

Madhave Madhusudana Telugu movie Review and Rating

మాధవే మధుసూదన సినిమాలో సాంకేతిక విభాగాల పనితీరు బాగుంది. వికాస్ బాడిన అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. వాసు అందించిన విజువల్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా క్వాలిటీతో సినిమాను రూపొందించారు. లవ్, మిస్టరీ తరహా సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X