For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Madhura Wines Review: రొమాంటిక్ లవ్ స్టోరి ఎలా ఉందంటే?

  |

  Rating: 2/5

  నటీనటులు: సన్నీ నవీన్, సీమా చౌదరీ, సమ్మోహిత్ తూములూరి తదితరులు
  కథ, దర్శకత్వం: జయకిషోర్ బీ
  నిర్మాతలు: రాజేశ్ కొండెపు, సృజన్ యరబోలు
  సహ నిర్మాత: సాయి శ్రీకాంత్ తెరువు
  సినిమాటోగ్రాఫర్: మోహన్ చారి
  సంగీతం: కార్తీక్ రోగ్రిగ్జ్, జయ్ క్రిష్
  ఎడిటర్: వర ప్రసాద్
  బ్యానర్: ఆర్ కే సినీ టాకీస్
  రిలీజ్ డేట్: 2021-10-22

   మధుర వైన్స్ కథ ఇలా..

  మధుర వైన్స్ కథ ఇలా..

  మధుర అనే అమ్మాయితో బ్రేకప్ కావడంతో తాగుబోతుగా మారుతాడు అజయ్ (సన్నీ నవీన్). రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి.. తనకు ఇష్టం లేని మద్యం వ్యాపారంలోకి దిగి మధుర అనే వైన్స్ నడుపుతుంటాడు ఆనంద్ రావు (సమ్మోహిత్ ములూరి). మధురవైన్స్‌లో తప్పతాగే అజయ్.. ఆనంద్ రావు చెల్లెలు అంజలి (సీమ చౌదరీ)తో ప్రేమలో పడుతాడు. అజయ్, అంజలి ప్రేమ వ్యవహారం ఆనంద్ రావుకు తెలుస్తుంది.

  మధుర వైన్స్‌లో మలుపులు

  మధుర వైన్స్‌లో మలుపులు

  మధురతో అజయ్ లవ్ బ్రేకప్ ఎందుకు జరిగింది? ఇష్టం లేకపోయినా మధుర వైన్స్‌ను ఆనంద రావు ప్రారంభించారు. మద్యం వ్యాపారంపై ఆనంద్ రావుకు ఎందుకు అయిష్టం ఏర్పడింది? అజయ్, అంజలి ప్రేమను ఆనంద్ రావు ఎందుకు నిరాకరించాడు? అంజలితో ప్రేమ విషయంలో ఆనందరావును అజయ్ ఒప్పించాడా? తన చెల్లెలి ప్రేమను అజయ్ ఒప్పుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మధురవైన్స్ సినిమా కథ.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

  మధురవైన్స్ సినిమా కథను ఎత్తుకోవడమే పేలవంగా కనిపిస్తుంది. నాసిరకం స్క్రీన్ ప్లేతో తాగుడు వ్యవహారం వెగటుపుట్టేలా సాగుతుంది. కథ ఓ గమ్యం లేకుండా సాగడం అసహనానికి గురిచేస్తుంది. తొలి భాగంలో అజయ్, ఆయన తండ్రి ఎపిసోడ్ కాస్త ఎమోషనల్‌గా కనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో అజయ్, అంజలి రొమాంటిక్ సీన్లే తప్ప పెద్దగా ఆకట్టుకొనే అంశాలు ఏమీ కనపించవు. కథను బలంగా డ్రైవ్ చేసే అంశాలు ఒక్కటిగా కనిపించవు. కథలో ముందు ఏం జరుగుతుందనే విధంగా సాగడం వల్ల ఆసక్తి తగ్గిపోతుంది.

  సెకండాఫ్‌లో కొంత ఎమోషనల్‌గా

  సెకండాఫ్‌లో కొంత ఎమోషనల్‌గా


  మధుర వైన్స్ సెకండాఫ్‌ విషయానికి వస్తే.. కథలో కొన్ని ఎమోషన్స్ కనిపించడం కాస్త ఉపశమనంగా మారుతుంది. సినిమాకు డైలాగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్. కానీ కథ, కథనాలను డైలాగ్స్ డామినేట్ చేయడం చేయడం వల్ల సన్నివేశాల్లో బ్యాలెన్స్ తప్పిందనే ఫీలింగ్ కలుగుతుంది. సన్నివేశాల్లో పస లేకపోవడం పాత్రలు భారమైన డైలాగ్స్ పలకడం అసమంజసంగా అనిపిస్తుంది. ఇక సినిమా మొత్తం అజయ్, ఆనంద రావు, అంజలి మధ్యనే సాగడం బోర్‌గా మారుతుంది.

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్

  నటీనటులు ఫెర్ఫార్మెన్స్


  అజయ్‌గా సన్నీ నవీన్, అంజలిగా సీమ చౌదరీ, ఆనంద రావు‌గా సమ్మోహిత్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా సమ్మోహిత్ తన పాత్ర ద్వారా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. తనదైన శైలిలో హావభావాలు పలికించడమే కాకుండా ఎమోషనల్ డైలాగ్స్‌తో ఆలరించాడు. ఇక సన్నీ నవీన్ నటన, బాడీ లాంగ్వేజ్ బాగుంది. సీమ చౌదరీ గ్లామర్ పరంగా ఆకట్టుకొన్నది. అజయ్‌తో రొమాంటిక్ సన్నివేశాల్లో గిలిగింతలు పెట్టేలా నటించింది. సన్నీ, సీమ మధ్య కెమిస్ట్రీ బాగుంది.

  టెక్నికల్‌ విభాగం పనితీరు..

  టెక్నికల్‌ విభాగం పనితీరు..

  సాంకేతిక అంశాల విషయానికి వస్తే. మోహన్ చారి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. లైటింగ్ ఫర్‌ఫెక్ట్‌గా ఉండటంతో సన్నివేశాలు చాలా రిచ్‌గా కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో కార్తీక్ రోగ్రిగ్జ్, జయ్ క్రిష్ అందించిన రీరికార్డింగ్ బాగుంది. ఒకట్రెండు పాటలు తెరపైన బాగున్నాయి. ఎడిటర్‌గా వర ప్రసాద్ పనితీరు ఒకేలా ఉంది. నిడివి ఎక్కువ కావడం సినిమాలోని ఫీల్‌ను తగ్గించింది. సెకండాఫ్‌లో కనీసం 15 నిమిషాల కథను కుదిస్తే.. కొంత మేరకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరుగుతుంది.

  Natyam Movie Review By Nandamuri Balakrishna
  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  మధుర వైన్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే.. నిర్మాతలు రాజేశ్ కొండెపు, సృజన్ యరబోలు పాటించిన విలువలు బాగున్నాయి. ఈ కథకు పేరున్న నటీనటులు ఉండే సినిమా ఫ్లేవర్ మారి ఉండేదనిపిస్తుంది. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే మంచి రొమాంటిక్ లవ్ స్టోరి అయి ఉండేది. అసలు మధుర అనే టైటిల్‌కు ఎలాంటి జస్టిఫికేషన్ లేకపోవడం అత్యంత మైనస్ అనిచెప్పవచ్చు. టైటిల్ మత్తెక్కించేలా ఉంది కానీ, కథలో ఏ మాత్రం దమ్మ లేకపోవడం నాసిరకంగా మారింది. డైలాగ్స్, రొమాంటిక్ అంశాలను ఆస్వాదించాలనుకొన్న వారు మధుర వైన్స్‌కు వెళ్లవచ్చు.

  English summary
  Madhura Wines movie is a romantic love drama which is directed by Jaya Kishore. Sunny Naveen, Seema Chowdhary, Sammohit Tumuluri lead actors. This movie hits the screens on october 22, 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X