twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Maha Samudram Movie Review: అల్లకల్లోల సముద్రం.. ఆకట్టుకొని ‘మహా’ ప్రేమకథ

    |

    Rating:
    2.5/5
    Star Cast: శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్, జగపతి బాబు
    Director: అజయ్ భూపతి

    RX 100 మూవీతో అందరి ప్రశంసలు అందుకొన్న డైరెక్టర్ అజయ్ భూపతి రెండో ప్రయత్నంగా తీసిన చిత్రం మహా సముద్రం. తన రెండో చిత్రానికి అదితిరావు హైదరీ, శర్వానంద్, సిద్ధార్థ్ లాంటి ఫెర్ఫార్మర్స్‌ను ఎంచుకోవడం, ఇంటెన్స్ లవ్ స్టోరి అంటూ చెప్పడం వల్ల భారీ అంచనాల పెరిగాయి. అంచనాలకు తగినట్టుగానే సినిమా టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అలాంటి ఆసక్తి, అంచనాలతో వచ్చిన మహా సముద్రం చిత్రం అజయ్ భూపతికి ద్వితీయ విఘ్నం నుంచి గట్టెక్కించిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథ, కథనాలను ఎలా ఉన్నాయనే విసయం తెలుసుకొందాం.

    మహా సముద్రం కథ

    మహా సముద్రం కథ

    వైజాగ్‌కు చెందిన అర్జున్ (శర్వానంద్), విజయ్ (సిద్దార్త్) ప్రాణ స్నేహితులు. మహా లక్ష్మి అలియాస్ మహా (అదితిరావు) మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి. డ్యాన్స్ టీచర్‌గా జీవితాన్ని నెట్టుకొస్తున్న మహాతో విజయ్ ప్రేమలో పడుతాడు. పోలీస్ ఉద్యోగం కోసం పరీక్ష రాసిన విజయ్ అనుకొని పరిస్థితుల్లో వైజాగ్ సముద్రంపై అక్రమ వ్యాపారాలు చేసే ఓ గుండాను చంపేస్తాడు. తనను పెళ్లి చేసుకోమని వెంటపడుతున్న మహా నుంచి దూరంగా విజయ్ ఊరు విడిచి వెళ్తాడు.

    కథలో ట్విస్టులు ఇలా..

    కథలో ట్విస్టులు ఇలా..

    పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ కావాలని కలలు కన్న విజయ్ స్థానిక డ్రగ్స్ మాఫియా వ్యవహారాల్లో ఎందుకు తలదూర్చాల్సి వచ్చింది? తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అర్జున్‌, మహాను వదిలి ఎందుకు వెళ్లిపోయాడు? విజయ్ వల్ల గర్బవతిగా మారిన మహా ఎలాంటి సమస్యలను ఎదుర్కోన్నది? మహాను చేరదీసిన అర్జున్ ఎలాంటి భావోద్వేగాలకు లోనయ్యాడు? బాబ్జీ (రావు రమేష్), చుచ్చూ (జగపతి బాబు) పాత్రలు కథను ఎలా ముందుకు తీసుకెళ్లాయి? మహా, విజయ్ ఒక్కటయ్యారా? ఈ కథకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే మహా సముద్రం.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    మహా సముద్రం కథను ఎత్తుకొనే పాయింట్‌లోనే లోపం ఉందనే విషయం సినిమా ఆరంభమైన పది నిమిషాల్లోనే స్పష్టమవుతుంది. కథలోని పాత్రలను పరిచయం చేసుకోవడం చాలా పేలవంగా సాగితే.. ఇక అసలు కథలోకి వెళ్లడానికి ఇంటర్వెల్ వరకు ప్రేక్షకుడిని విసిగింప చేయడం ఈ సినిమాకు మరో లోపంగా మారింది. ఇంటర్వెల్‌ తర్వాతైనా అసలు కథేంటనే ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రతీ పది నిమిషాలకు ఏదో అంశం రావడం గందరగోళంగా మారుతుంది. తొలిభాగంలోనే ఇక సరుకు లేదనే విషయం స్పష్టమవుతుంది. ఇంటర్వెల్ కార్డు ఎప్పుడు పడుతుందా అనే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తొలిభాగం చాలా బోరింగ్ ఉండటంతో అప్పుడే సినిమా జాతకం ఏమిటో తెలిసిపోతుంది.

    సెకండాఫ్‌లో కాస్త ఉపశమనం

    సెకండాఫ్‌లో కాస్త ఉపశమనం

    సెకండాఫ్‌‌లో కథ మాత్రం నేల విడిచి సాము చేసినంత పని అవుతుంది. అనైతిక బంధాలను తెరపైకి తెచ్చి సినిమాను మరింత కన్‌ఫ్యూజన్‌లో పడేసినట్టు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు మాత్రం సినిమాను బ్యాలెన్స్ చేసినట్టు కనిపిస్తుంది. కాకపోతే కథలో దమ్ము లేకపోవడం, కథనంలో వైవిధ్య లేకపోవడం, ప్రధాన పాత్రలకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ నాసిరకంగా ఉండటం ఈ సినిమాకు శాపంగా మారిందని చెప్పవచ్చు.

    దర్శకుడిగా అజయ్ భూపతి

    దర్శకుడిగా అజయ్ భూపతి

    దర్శకుడు అజయ్ భూపతి ఎంచుకొన్న పాయింట్‌లో ఎమోషన్స్ ఉన్నప్పటికి.. వాటిని బలంగా తెరమీద చూపించడంలో దారుణంగా విఫలమయ్యాడని చెప్పవచ్చు. మహా పాత్రలోని ఇంటెన్సిటీని, అర్జున్, విజయ్ పాత్రలోని ఎమోషన్స్‌ను పండించడంలో సరైన పంథాను అనుసరించలేదని స్పష్టమవుతుంది. సినిమాకు కీలకంగా మారిన జగపతి బాబు, రావు రమేష్ పాత్రలు కూడా నాసిరకంగా ఉన్నాయి. కథ పాతదైనా, రొటీన్‌గా ఉన్నా స్క్రీన్ ప్లేను సరిగా రాసుకోలేకపోయాడనేది సుస్పష్టం. అదితి, సిద్దూ, శర్వా లాంటి ప్రతిభను వాడుకోవడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు.

    మెప్పించని శర్వానంద్; సిద్దార్థ్

    మెప్పించని శర్వానంద్; సిద్దార్థ్

    అర్జున్‌గా శర్వానంద్, విజయ్‌గా సిద్దార్థ్ తెర మీద కనిపించారు. వారి పాత్రల్లో వావ్ మూమెంట్స్ ఒక్కటంటే ఒక్కటి లేకపోవడం గమనార్హం. ప్రాణ స్నేహితుల కథలు తెర మీద ఎక్కువగానే రావడం, ప్రేక్షకులను మెప్పించడం జరిగాయి. అయితే విజయ్, అర్జున్ పాత్రల్లో కనీసం అంటే కనీసం బాండింగ్ ఎక్కడా కనిపించదు. విజయ్ పాత్ర ద్వారా మరో రేంజ్ ఫెర్ఫార్మెన్స్‌ను పలికించడానికి సిద్దార్థ్‌కు స్కోప్ లేకపోయింది. ఇక అర్జున్ పాత్ర విషయానికి వస్తే.. గతంలో శర్వా నటించిన రణరంగం సినిమాలోని పాత్రకు కొనసాగింపా అనే అనుమానం కలుగుతుంది. ప్రేక్షకులను పక్కన పెడితే.. కనీసం అభిమానులను మెప్పించడానికి ఈ రెండు పాత్రల్లో కొన్ని మంచి సీన్లు కూడా ఎక్కడా కనిపించవు.

    మెరిసిన అదితిరావు హైదరీ

    మెరిసిన అదితిరావు హైదరీ

    మహా సముద్రంలో కాస్త ఎమోషనల్‌గా కనిపించే పాత్ర మహా లక్ష్మి. ఆ పాత్రకు పూర్తిస్థాయిలో అదితి రావు హైదరీ న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో రొమాంటిక్‌గా కనిపిస్తే.. సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా మెప్పించింది. తడబడుతూ సాగిన కథా గమనంలో మహా పాత్ర కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఇక అను ఇమ్మాన్యుయేల్ పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది అనే విధంగా ఉంది. ఆ పాత్ర ఎందుకు వస్తుందో అర్ధం కాని విధంగా ఉంటుంది. శర్వానంద్, అను మధ్య సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకొనేలా ఉన్నాయి.

     సినిమాటోగ్రఫి, మ్యూజిక్ హైలెట్‌గా

    సినిమాటోగ్రఫి, మ్యూజిక్ హైలెట్‌గా

    మహా సముద్రం సినిమాలో సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫర్ రాజ్ తోట వైజాగ్ అందాలను అద్బుతంగా కెమెరాలో ఒడిసిపట్టుకొన్నారు. కొన్ని సీన్లు విజువల్ ట్రీట్‌గా అనిపిస్తాయి. అలాగే ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచింది. పేలవమైన సన్నివేశాలు మ్యూజిక్ కారణంగా కాస్త ఎమోషనల్‌గా మారాయని చెప్పవచ్చు. ఈ సినిమాకు ఎడిటింగ్‌ మైనస్ అని చెప్పవచ్చు. కథ, కథనాలు ఆకట్టుకొలేని విధంగా ఉండటం వల్ల సాంకేతిక విభాగాల పనితీరు కూడా మరుగున పడిందని చెప్పవచ్చు. ప్రోడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టిన నిర్మాతలు కథపై ఎందుకు దృష్టిపెట్టలేకపోయారనే ప్రశ్న ముందుకు వస్తుంది.

     ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    రొటీన్ కథ, కథనాలు, లాజిక్ లేని పాత్రలతో ఉడికి ఉడకని వంటకంగా మహా సముద్రం కనిపిస్తుంది. పేలవమైన క్యారెక్టర్లు, నాసిరకమైన కథనం ఈ సినిమాకు మైనస్‌గా మారాయని చెప్పవచ్చు. లక్ష్యం లేకుండా సాగిన ప్రయాణంగా మహా సముద్రం కనిపిస్తుంది. పాటలు, సినిమా నిడివి ప్రతికూలమైన అంశాలని చెప్పవచ్చు. ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను ఏ విధంగాను అందుకోలేకపోయిన చిత్రమని చెప్పవచ్చు. పండుగ సమయంలో ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచిన చిత్రమని చెప్పవచ్చు.

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్, జగపతి బాబు, రావు రమేష్, శరణ్య తదితరులు
    రచన, దర్శకత్వం: అజయ్ భూపతి
    నిర్మాత: రామబ్రహ్మం సుంకర
    సినిమాటోగ్రఫి: రాజ్ తోట
    ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
    మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
    బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్
    రిలీజ్ డేట్: 2021-01-14
    నిడివి: 156 నిమిషాలు

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    అదితిరావు హైదరీ పెర్ఫార్మెన్స్
    రాజ్ తోట సినిమాటోగ్రఫి
    చైతన్ భరద్వాజ్ మ్యూజిక్

    మైనస్ పాయింట్స్

    మైనస్ పాయింట్స్

    కథ, కథనాలు
    నిడివి
    స్లో నేరేషన్
    పాటలు
    ఫస్టాఫ్

    Recommended Video

    Bigg Boss లో ఇలా ఆడితే ఫ్యాన్స్ ఒప్పుకోరు.. Mind It | SRC ఫ్యాన్స్ స్ట్రాటజీ || Filmibeat Telugu

    ట్యాగ్ లైన్: అల్లకల్లోల సముద్రం

    English summary
    Maha Samudram movie review: Aditi Rao Hydari, Siddharth, Sharwanand's latest movie is Maha Samudram. Directed by Ajay Bhupati produced by Anil Sunkara. Here is the Telugu filmibeat's exclusive review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X