Maharaja Review: మహరాజ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్ దాస్, భారతీరాజా, మునీశ్ కాంత్, దివ్య భారతీ, అరుళ్ దాస్ తదితరులు
రచన, దర్శకత్వం: నితిలాన్ స్వామినాథన్
నిర్మాతలు: జగదీష్ పళనిస్వామి, సుధాన్ సుందరం
మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫి: దినేష్ పురుషోత్తం
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
స్టంట్స్: అనల్ అరసు
బ్యానర్: ఎన్‌వీఆర్ సినిమా, ప్యాషన్ స్టూడియోస్
సమర్పణ: ఎస్ సుధాన్
రిలీజ్ డేట్: 2024-06-14
మహరాజ (విజయ్ సేతుపతి) నాయి బ్రహ్మణుడు. చిన్నపాటి సెలూన్ పెట్టుకొని జీవిస్తుంటాడు. ప్రమాదంలో భార్య చనిపోతే కూతురే ప్రపంచంగా బతుకుతుంటాడు. ఓ రోజు ఇంట్లో దొంగలు పడి ఇనుముతో చేసిన ఓ చెత్త బుట్టను ఎత్తుకెళ్తారు. ఆ చెత్త బుట్ట పోయిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు ఫైల్ చేయమని అడిగితే.. అందరూ అతడిని చూసి గేలి చేయడమే కాకుండా తీవ్రంగా అనుమానిస్తారు. ఆ చెత్త బుట్ట తెచ్చి ఇస్తే 7 లక్షల లంచం ఇస్తానని మహరాజ ఆశ చూపుతాడు.

దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహరాజ సెలూన్‌లో పని చేసుకొంటూ ఉండటమనే సింపుల్ పాయింట్‌తో సినిమాను కామెడీ సీన్లతో చాలా వినోదంగా మొదలుపెట్టిన తీరే మూవీకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఒక్కసారి కనెక్ట్ అయ్యాక మూవీతో ట్రావెల్ అవ్వడానికి ఫన్, ఎమోషన్స్, యాక్షన్ అంశాలను జొప్పించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. ఫస్టాఫ్‌లో చెత్తబుట్ట గురించి పోలీస్ స్టేషన్‌లో జరిగే సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించడమే కాకుండా భావోద్వేగానికి గురి చేస్తాయి. మంచి యాక్షన్ ఎపిసోడ్‌తో ఫస్టాఫ్‌ను ముగించి సెకండాఫ్‌పై క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

ఇక సెకండాఫ్‌లో డిజైన్ చేసిన కంటెంట్ చాలా ఎమోషనల్‌గా ఉండటంతో ఇంటెన్సిటీ ఎక్కువగా కనిపిస్తుంది. అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసిన విధానం.. ఆ క్యారెక్టర్ చుట్టు కథను నడిపిన విధానం సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు దాదాపు 20 నిమిషాలపాటు స్టోరీని డీల్ చేసిన విధానం గుండెను పిండేసేలా ఉంటాయి. విజయ్ సేతుపతి, ఆయన కూతురిగా నటించిన అమ్మాయి, అలాగే అనురాగ్ కశ్యప్ ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. వినోదాన్ని జోడించి కంటతడి పెట్టించే రేంజ్‌లో ఈ సినిమాను రూపొందించారనే చెప్పాలి.
ఇక విజయ్ సేతుపతికి ఈ మూవీ స్పెషల్ మూవీ. తన కెరీర్‌లో 50వ చిత్రం కావడంతో ఎలాంటి సినిమాతో వస్తాడనే చూసిన వారికి ఆ రేంజ్ సినిమాను అందించారని చెప్పొచ్చు. విజయ్ సేతుపతి పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టడంతోపాటు తన నటనతో భావోద్వేగానికి గురి చేస్తాడు. ఎక్కడా ఆయన కనిపించకుండా కేవలం మహరాజ మాత్రమే కనిపించేలా నటించాడు. ప్రతీ ఫ్రేమ్‌లో విభిన్నమైన నటనను ప్రదర్శించారు. స్కూల్, పోలీస్ స్టేషన్ సీన్లలో ఆయన యాక్టింగ్ టెర్రిఫిక్‌గా ఉంటుంది. ఇక యాక్షన్ సీన్లలో కూడా ఇరుగదీశాడు. ఇక క్లైమాక్స్‌లో ఆయన నటించిన తీరు పీక్స్‌లో ఉంటుంది.
ఇక ఈ చిత్రంలో మిగితా నటీనటుల విషయానికి వస్తే.. బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సెకండాఫ్‌లో ఆయన నటించిన విధానం హై ఎమోషనల్‌గా మార్చింది. మమతా మోహన్ దాస్, దివ్య భారతీ, పోలీసు, దొంగలుగా నటించిన వారందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విజయ్ సేతుపతి కూతురుగా నటించిన చిన్నారి కంటతడి పెట్టించేంతగా నటించింది.

మహరాజ మూవీ సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫి కీలక పాత్రను పోషించాయి. అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకు హైలెట్. అలాగే ఎడిటింగ్ ఈ సినిమాకు అత్యంత బలంగా నిలిచింది. కథను నెరేట్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
మహరాజ విషయానికి వస్తే.. తండ్రి, కూతుళ్ల బాండింగ్, రిలేషన్‌తో కూడిన అత్యంత భావోద్వేగాలతో సాగే మూవీ. హైలీ ఎమోషన్స్, సీరియస్ కంటెంట్ ఉన్న చిత్రాన్ని వినోదంగా మార్చి అందించిన తీరే ఈ సినిమాకు ప్లస్ పాయింట్. విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ లాంటి యాక్టర్ల పెర్ఫార్మెన్స్‌తో ఈ సినిమా మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. థియేటర్లలోనే తప్పకుండా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా.


Click it and Unblock the Notifications











