మహర్షి మూవీ రివ్యూ: మహేష్‌బాబు వన్ మ్యాన్ షో

Recommended Video

Maharshi Movie Review మహర్షి మూవీ రివ్యూ || Filmibeat Telugu

Rating:
3.0/5
Star Cast: మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్, మీనాక్షి దీక్షిత్, ప్రకాశ్ రాజ్
Director: వంశీ పైడిపల్లి

శ్రీమంతుడు, భరత్‌ అనే నేను లాంటి భారీ హిట్ల తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం మహర్షి. ఊపిరి తర్వాత దాదాపు మూడేళ్ల తర్వాత ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై నిర్మాతలు దిల్ రాజు, సీ అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా హై టెక్నికల్‌ వేల్యూస్‌, పవర్‌ఫుల్‌ సోషల్‌ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం 'మహర్షి'.

సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడంతో ఓ మైలురాయిగా నిలిచింది. పూజా హెగ్డే హీరోయిన్‌. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు కోరుకొంటున్నట్టు మహేష్ కెరీర్‌లో అద్భుతమైన చిత్రంగా ఈ సినిమా నిలిచిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

మహర్షి స్టోరీ

మహర్షి స్టోరీ

పేద కుటుంబానికి చెందిన రుషి కుమార్ ప్రతిభావంతుడైన విద్యార్థి. తండ్రి (ప్రకాశ్ రాజ్) అంటే ఓ కారణంగా ద్వేషిస్తాడు. సక్సెస్‌ను తప్పా మరొకటి ఆలోచించని రుషి తక్కువ సమయంలోనే కార్పోరేట్ రంగంలో దిగ్గజ కంపెనీకి సీఈవో అవుతాడు. కెరీర్ కోసం ప్రేయసి (పూజా హెగ్డే)ను వదులుకొంటాడు. కానీ తన సక్సెస్‌కు రవి (అల్లరి నరేష్) కారణమని విషయం తెలియడంతో అతడిని వెతుక్కుంటూ గోదావరి జిల్లాలోని రామవరంకు వెళ్తాడు. కార్పోరేట్ సంస్థ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రవికి అండగా నిలబడుతాడు. ఆ క్రమంలో గ్యాస్ నిక్షేపాలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వివేక్ మిట్టల్ (జగపతిబాబు)ను ఎదుర్కొనేందుకు సిద్దపడుతాడు. రవి లక్ష్యాన్ని చేరుకోవడానికి, పోరాటాన్ని గెలిపించడానికి రిషి రైతుగా మారుతాడు.

మహర్షిలో ట్విస్టులు

మహర్షిలో ట్విస్టులు

రిషి కోసం రవి చేసిన త్యాగం ఏమిటి? పూజా ప్రేమను ఎందుకు కాదనుకొంటాడు? తండ్రిని ఏ కారణంగా ద్వేషిస్తాడు? చివరికి రవి, తన తండ్రి (ప్రకాశ్ రాజ్) కన్న కలలను ఎలా చేరుకొన్నాడు? రైతుల కోసం రిషి తీసుకొన్న సంచలన నిర్ణయం ఏమిటి? ప్రజల్లో స్ఫూర్తి నింపే క్రమంలో రుషి మహర్షిలా ఎలా మారడనేది సినిమా కథ.

ఫస్టాఫ్‌లో

ఫస్టాఫ్‌లో

తొలిభాగంలో రుషి సీఈవోగా ఎదగడంతో హై నోట్‌లో సినిమా ప్రారంభం అవుతుంది. కాలేజీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సరదగా సాగిపోతుంటాయి. పూజాతో రొమాంటిక్ సీన్లతో కెమిస్ట్రీ వర్కవుట్ కావడంతో ప్రేక్షకులకు జోష్ నింపేలా ఉంటుంది. ఇక రవి, రుషిల మధ్య వచ్చే ఎపిసోడ్స్ కథకు బలంగా చేకూర్చేలా ఉంటాయి. కాలేజీ సీన్లలో చాలా ఇంటెలెక్చువల్‌గా సాగిపోతాయి. ప్రతీ ఫ్రేమ్‌లో మహేష్ తన ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీయడంతో సినిమా చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. రవికి జరిగిన అన్యాయం తెలుసుకొని రుషి ఇండియాకు వెళ్లడంతో తొలిభాగం ముగుస్తుంది.

సెకండాఫ్

సెకండాఫ్

రెండో భాగంలో రైతుల సమస్య ప్రధానంగా సాగుతుంది. రైతులు, కార్పోరేట్ సంస్థల భూసేకరణ అంశాలు వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబంగా నిలుస్తాయి. వివేక్ మిట్టల్ వేసే ఎత్తులకు రిషి వేసే పైఎత్తులు సినిమాకు ప్లస్ అవుతాయి. అలాగే చివర్లో రైతుల గురించి, వారు పడుతున్న కష్టాలు గురించి రిషి పాత్రతో చెప్పించిన తీరు ఆలోచింపజేసేలా ఉంటుంది. ప్రస్తుతం రైతులు అనుభవిస్తున్న పరిస్థితులు, ఆత్మహత్యలు, వాటి నివారణకు అనుసరించాల్సిన చర్యల గురించి చెబుతూ సామాజిక సందేశంగా సినిమా క్లైమాక్స్ ముగుస్తుంది.

డైరెక్టర్

డైరెక్టర్

మహర్షి సినిమా అనేక అంశాలకు, భారీ స్కోప్ ఉన్న కథకు చిత్రం. మూడు రకాల షేడ్స్‌తో సామాజిక అంశాలు జొప్పించి ఓ సూపర్‌స్టార్ ద్వారా స్టోరిని చేసే ప్రయత్నం చేసిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కాలేజీ ఎపిసోడ్స్ యూత్‌కు నచ్చేలా, తండ్రి, స్నేహితుల మధ్య జరిగే ఎమోషనల్ సీన్లు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా, రైతుల సమస్యల గురించి ప్రస్తావించి సమాజాన్ని ఆలోచింపజేసేలా సినిమా కోసం కథను రాసుకొన్న తీరు అభినందనీయం. కానీ సన్నివేశాలు, కథపై పట్టు కోల్పోయి నిడివిని పెంచేయడం సినిమాకు మైనస్‌గా మారింది. కాకపోతే తాపీగా కథ వినాలనుకొనే ప్రేక్షకులు ఫుల్ మీల్స్‌లా సినిమాను అందించారనే చెప్పవచ్చు. మహేష్ బాబు స్టామినాకు, క్రేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు.

మహేష్ బాబు పెర్ఫార్మెన్స్

మహేష్ బాబు పెర్ఫార్మెన్స్

శ్రీమంతుడు, భరత్ అనే నేను తర్వాత మళ్లీ ఫుల్ లెంగ్త్‌ క్యారెక్టర్‌లో రుషిగా ఒదిగిపోయాడు. కాలేజ్ స్టూడెంట్‌గా, సీఈవోగా, రైతుల కోసం, స్నేహితుడి కోసం పోరాటం చేసే యువకుడిగా, ప్రేమికుడిగా, తండ్రి ఆశయాలను కొనసాగించే కొడుకుగా ఇలా రకరకాల ఎమోషనల్ టచ్ ఉన్న పాత్రలో జీవించాడని చెప్పవచ్చు. మహేష్ బాబు బాగా నటిస్తాడని కొత్తగా చెప్పనక్కర్లేదు. రిషి పాత్రతో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడని చెప్పవచ్చు. ఫైట్స్ సన్నివేశాల్లో ఇరుగదీశాడు. పాటల్లో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొన్నాడు లాంటివి మహేస్ స్టేటస్‌కు రొటీ. కానీ రైతుల బ్యాక్ డ్రాప్‌లో మహేష్ చెప్పిన సందేశాలు ప్రతీ ప్రేక్షకుడిని ఆలోచింజేసేలా అనిపిస్తాయి.

పూజా హెగ్డే గ్లామర్

పూజా హెగ్డే గ్లామర్

ఫస్టాఫ్‌లో పూజా హెగ్డే తన గ్లామర్‌తో సినిమాను కలర్‌ఫుల్‌గా మార్చింది. మహేష్‌తో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ చేసింది. కథలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల హీరోయిన్ పాత్రకు కొంత అన్యాయం జరిగిందనే చెప్పాలి. కాకపోతే సెకండాఫ్‌లో తన పాత్ర తెరపైన కనిపించినప్పుడల్లా మంచి మార్కులు కొట్టేసింది. గ్లామర్ పరంగా కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

 ఇతర నటీనటులు

ఇతర నటీనటులు

సినిమాలో మిగితా క్యారెక్టర్లలో బాగా ఆకట్టుకొనేది అల్లరి నరేష్ పాత్ర. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన యువకుడిగా మెప్పించాడు. స్నేహితుడి కోసం జీవితాన్నే త్యాగం చేసిన పాత్రలో ప్రతీ ప్రేక్షకడికి గుర్తుండిపోతాడు. తన కెరీర్‌లో అల్లరి నరేష్‌కు దొరికిన అద్భుతమైన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. ఇక సినిమాలో ప్రేక్షకుడిని టచ్ చేసే రోల్ ప్రకాశ్ రాజ్‌ది. ఫస్టాఫ్‌లో ఆ పాత్ర తీరు ప్రేక్షకుడిని వెంటాడుతుంటుంది. సెకండాఫ్‌లో కనిపించకుండా ఉన్నప్పటికీ.. ఆ పాత్ర తాలుకు ఇంపాక్ట్ ప్రేక్షకుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

 మిగితా పాత్రల్లో

మిగితా పాత్రల్లో

ఇంకా ఈ సినిమాలో ముఖేష్ రుషి పాత్ర ఒక ఎపిసోడ్‌కే పరిమితమైంది. జగపతిబాబు పాత్ర ప్రధాన విలన్ అయినప్పటికీ.. మహేష్ వన్ మ్యాన్ షో కావడం పెద్దగా కథపై ప్రభావం చూపలేకపోయింది. రాజకీయ వేత్తగా పోసాని, టీవీ రిపోర్టర్‌గా 30 ఇయర్ ఇండస్ట్రీ ఫృథ్వీ ఆకట్టుకొంటారు. అలాగే తల్లి పాత్రలో జయసుధ మరోసారి ఆకట్టుకొన్నది. మీనాక్షి దీక్షిత్ పాత్ర పర్వాలేదనిపిస్తుంది.

టెక్నికల్‌ విభాగాలు

టెక్నికల్‌ విభాగాలు

సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, కేయూ మోహన‌న్ సినిమాటోగ్రఫి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. యూఎస్‌ ఎపిసోడ్స్ చాలా క్లాసీగా తెరకెక్కించారు. సెకండాఫ్‌లో గ్రామీణ వాతావరణం చక్కగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. యాక్షన్ సీన్ల విషయానికి వస్తే రామ్ లక్ష్మణ్ ప్రతిభను మోహనన్ మరింత పెంచి చూపించాడు. ఫైట్స్ క్రేజీగా ఉన్నాయి.

మ్యూజిక్

మ్యూజిక్

దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌గా మారింది. చోటీ చోటీ బాతే, పదర పదర పాటలు సినిమాకు అదనపు ఆకర్షణ. మాంటేజ్ షాట్స్‌ నేపథ్యంగా వచ్చే పాటలు సందర్బోచితంగా బాగున్నాయి. ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. ఈ సినిమాలో ఎమోషన్స్‌ను నిడివి దెబ్బ తీసేలా ఉంది. ఇది సమస్యను అధిగమిస్తే సినిమా చాలా క్రిస్పీగా అనిపిస్తుంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

కథను బలంగా చెప్పడానికి, దానికి అవసరమయ్యే ఎన్విరాన్‌మెంట్ క్రియేట్ చేయడానికి నిర్మాతలు రాజీ పడలేదనే విషయం తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. యూఎస్‌లో లావీష్‌గా తెరకెక్కించిన తీరు బాగుంది. పాత్రలకు ఎంపిక చేసుకొన్న నటీనటుల విధానం బాగుంది. సామాజిక సందేశం నేపథ్యంగా సినిమాను తెరకెక్కించడం అభినందనీయం.

 ఫైనల్‌గా

ఫైనల్‌గా

ఓ వ్యక్తి జీవితంలో భావోద్వేగాలు, సామాజిక బాధ్యతను గుర్తు చెప్పే సినిమా మహర్షి. ఈ సినిమా నవ్విస్తుంది. ఆనందాన్ని పంచుతుంది. కంటనీరు పెట్టిస్తుంది. సమాజం గురించి ఆలోచింపజేస్తుంది. ఓవరాల్‌గా ఈ సినిమా మహేష్ బాబు వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్

  • మహేష్ బాబు ఫెర్ఫార్మెన్స్
  • కథ, కథనం
  • వంశీ పైడిపల్లి టేకింగ్
  • దేవీ శ్రీ ప్రసాద్ టేకింగ్
  • మైనస్ పాయింట్స్

    • సెకండాఫ్‌లో నిడివి
    • సామాజిక సందేశాలు ఎక్కువగా ఉండటం
    •  తెర ముందు, తెర వెనుక

      తెర ముందు, తెర వెనుక

      మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్, మీనాక్షి దీక్షిత్, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, జయసుధ, వెన్నెల కిషోర్ తదితరులు
      దర్శకత్వం: వంశీ పైడిపల్లి
      నిర్మాతలు: సీ అశ్వినీదత్, దిల్ రాజు, పరమ్ వీ పొట్లూరి
      సినిమాటోగ్రఫి: కేయూ మోహన‌న్
      మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
      ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
      బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా
      రిలీజ్: 2019-05-08
      నిడివి: 176 నిమిషాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X