Mahavatar Narsimha Movie Review: మహాఅవతార్ నర్సింహా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

యానిమేటేడ్ మూవీ: మహావతార్ నర్సింహా
దర్శకత్వం: అశ్వినీ కుమార్
సమర్పణ: హోంబలే ఫిల్మ్స్
నిర్మాత: శిల్పా ధావన్, కుషాల్ దేశాయ్, చైతన్య దేశాయ్
మ్యూజిక్: సామ్ సీఎస్
ఎడిటింగ్: క్లీమ్ ప్రొడక్షన్స్
రచన: జయపూర్ణ దాస్
రిలీజ్ డేట్: 2025-07-25

దేవతలు, ముఖ్యంగా విష్ణువుపై విద్వేషం పెంచుకొని భూమండలంలో తామే భగవత్ స్వరూపలం.. మమ్మల్ని తప్ప మరేవరిని పూజించకూడదు.. కీర్తించకూడదు అని విర్రవీగే రాక్షస రాజులు హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు. అయితే హిరణ్య కశిపుడు కడుపున జన్మించిన ప్రహ్లాదుడు విష్ణువును తప్ప మరోకరిని స్మరించడు.. పూజించడు. తన అభిమతానికి వ్యతిరేకంగా తన కుమారుడే వ్యవహరించడంపై ఆగ్రహం చెందిన హిరణ్య కశిపుడు తన కుమారుడిని చంపించేందుకు సఫల ప్రయత్నాలు చేస్తాడు.

హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు పుట్టుక వెనుక కథ ఏమిటి? హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు తల్లిదండ్రులు ఎవరు? ఈ ఇద్దరి తల్లి చేసిన తప్పు ఏమిటి? హిరణ్య కశిపుడు తనకు మరణం లేకుండా ఏం కోరుకొన్నాడు? హిరణ్య కశిపుడు అరాచకాలకు ముగింపు పలికేందుకు నర్సింహ అవతారాన్ని విష్ణువు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? తనకు భక్తుడైన ప్రహ్లాదుడిని విష్ణు భగవానుడు ఎలా రక్షించుకొన్నాడు? హిరణ్యకశిపుడి సంహారం ఎలా జరిగింది? అనేది ఈ సినిమా కథ.

Mahavatar Narsimha Movie Review

భారతీయ ప్రజలకు హిరణ్య కశిపుడు, ప్రహ్లాదుడు కథ గురించి తెలియని వారుండరు. కొత్త తరం వారికి, ఇప్పుడిప్పుడే పెరుగుతున్న బాలలకు ఈ కథ గురించి తెలియకపోవచ్చు. అలాంటి వారికి ఈ సినిమా పూర్తిగా, సంపూర్ణంగా అర్ధమయ్యే బైబిల్ మాదిరిగా ఉంటుంది. యానిమేషన్ కావడంతో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సౌండ్ డిజైన్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోను కలుగుతుంది. అయితే ఈ కథను కశ్యప మహాముని, ఆయన భార్య శృంగార జీవితంతో ప్రారంభించి.. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు పుట్టుక గురించి చెబుతూ ఆసక్తికరంగా సినిమాను ప్రారంభించారు. తొలి 20 నిమిషాలు సన్నివేశాలు, గ్రాఫిక్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఆ తర్వాత ఈ సినిమా కథలో ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల ఇంటర్వెల్ వరకు చప్పగా సాగుతుంది.

మహావతార్ నర్సింహా మూవీ సెకండాఫ్‌లో కీలకమైన ఘట్టాలు ఉండటంతో మరోసారి ఆసక్తికరంగా కథ సాగుతుంది. మధ్య మధ్యలో యానిమేషన్ వర్క్ కారణంగా సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. ఇక చివరి 20 నిమిషాలు నర్సింహా అవతారం ఎంట్రీతో సన్నివేశాలను అద్బుతంగా చిత్రీకరించారు. అయితే ఈ సినిమా ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేసుకొని తీసి ఉంటే.. ఫన్ అనేది మిస్ అయింది. అంతా ఒకే నోట్‌లో కథ ట్రావెల్ అవుతుంది. తండ్రి, కొడుకుల మధ్య, తల్లి కొడుకుల ఎమోషన్స్ మిస్ అయ్యాయి. పాతతరం భక్త ప్రహ్లద లాంటి సినిమాలు చూస్తే.. సన్నివేశాల్లో నాటకీయత అద్బుతంగా రక్తి కట్టిస్తుంది. అలాంటి సందర్భాలు ఈ యానిమేషన్ మూవీలో ఎక్కడా కనిపించవు.

ఇక సాంకేతిక వర్గాల పనితీరు మాత్రమే ఈ సినిమాకు కొండంత బలం. వీఎఫ్ఎక్స్ వర్క్ సూపర్ టాప్. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు చాలా బాగుంది. ఈ రెండు అంశాలు ఈ సినిమాకు బలమైతే.. తెలుగు డబ్బింగ్ బాగాలేకపోవడం ప్రధాన లోపంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్‌తో బాగున్నాయి. చివరల్లో రోలింగ్ టైటిల్స్‌లో నర్సింహా స్వామి ఆలయాలు, ప్రహ్లదుడి మందిరాల గురించి చూపించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే యాదగిరి గుట్ట గురించి ప్రస్తావించకపొవడం గమనార్హం.

మహావతార్ నర్సింహా సినిమా కథ విషయానికి వస్తే.. అందరికి తెలిసిందే. ఇక ఈ మూవీ థియేట్రికల్ వాల్యూ ఉన్న సినిమాగా కనిపించదు. ఓటీటీకి ఈ సినిమా కంటెంట్ పక్కాగా యాప్ట్. యానిమేషన్‌తో కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం ఫర్వాలేదనిపిస్తుంది. ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలు గొప్పగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్. వీఎఫ్ఎక్స్ వర్క్ మాత్రమే బాగుంది. డైలాగ్స్, తెలుగు అనువాదంలో చాలా లోపాలు ఉన్నాయి. ఇలాంటి లోపాలను పట్టించుకోకుండా యానిమేషన్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X