Mahaveerudu Review.. శివ కార్తీకేయన్‌ హిట్టు కొట్టాడా? సునీల్, రవితేజ హెల్ప్ అయ్యారా?

Rating:
2.0/5

నటీనటులు: శివ కార్తీకేయన్, అదితి శంకర్, మిస్కిన్, సునీల్ తదితరులు
దర్శకత్వం: మడొన్నే అశ్విన్
నిర్మాత: అరుణ్ విశ్వ
సినిమాటోగ్రఫి: విదు అయ్యన్న
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
మ్యూజిక్: భరత్ శంకర్
బ్యానర్: శక్తి టాకీస్
రిలీజ్ డేట్: 2023-07-14

వైజాగ్‌కు చెందిన సత్య (శివ కార్తీకేయన్) దిన పత్రికలో పనిచేసే ఓ కార్టునిస్ట్. స్వతహాగా పిరికివాడు, భయస్తుడైన సత్య తన తల్లి (సరిత), సోదరి రాజీ (మనీషా బ్లెస్సీ)తో కలిసి దిగువ మధ్య తరగతి జీవితాన్ని గడుపుతుంటాడు. ఎన్నో ఏళ్లుగా మురికివాడలో జీవిస్తున్న కుటుంబాల ఇళ్లను కూల్చివేసి ప్రభుత్వం కట్టించిన ప్రజా భవనం ఎత్తైన అపార్ట్‌‌మెంట్‌లోకి మంత్రి జయసింహా (మిస్కిన్) బలవంతంగా తరలిస్తాడు. అయితే నాసిరకంగా కట్టిన అపార్ట్‌మెంట్‌‌లో రకరకాల సమస్యలతోపాటు ఏ క్షణంలో కూలిపోతాయో తెలియని అయోయమం, భయంతో కుటుంబాలు బతుకుతుంటాయి.

Mahaveerudu Telugu Movie Review and Rating: Is Sivakarthikeyan hits bulls eye?

ప్రజా భవనం అపార్ట్‌మెంట్ కూడళ్ల వద్ద మంత్రి జయసింహా అనుచరుల అక్రమాలు, అన్యాయాలు ఎలా కొనసాగాయి? ఆవేశపరురాలైన సత్య తల్లిని సత్య ఎందుకు కంట్రోల్ చేస్తుంటాడు? సత్య తండ్రి ఎలా చనిపోయాడు? మంత్రి జయసింహా అక్రమాలను సత్య ఎదురించాడా? మంత్రి జయసింహా అనుచరుడు (సునీల్) కథలో ఎలాంటి పాత్రను పోషించాడు? పేదలకు ప్రభుత్వ కట్టించే ఇళ్ల నిర్మాణంలో అవతకవకలకు సత్య ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే మహావీరుడు సినిమా కథ.

పేదరికం, నిరుద్యోగంతో సత్య పడే బాధలతో కథ వినోదభరితంగా మొదలవుతుంది. ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న ఇళ్లను ప్రభుత్వ పెద్దలు కూల్చడమనే పాయింట్ కొంత ఎమోషనల్‌గా కనిపిస్తుంది. ప్రభుత్వం పేదలకు కట్టించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో అవినీతి వల్ల ప్రజలు ఎలా ఇబ్బందిపడుతుందనే విషయం ఆసక్తిగా అనిపిస్తుంది.

Mahaveerudu Telugu Movie Review and Rating: Is Sivakarthikeyan hits bulls eye?

కానీ ఆ పాయింట్‌ను బలంగా వాడుకొని మంచి సన్నివేశాలు, కథ, కథనాలను రూపొందించడంలో దర్శకుడు మడొన్నే అశ్విన్ విఫలమయ్యాడనే చెప్పాలి. సీరియస్ సబ్జెక్ట్‌ను డైవర్ట్ చేసి నవ్వులపాలు చేశాడనే చెప్పాలి. రవితేజ వాయిస్‌తో ఆకాశవాణి తరహా కథనం ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఆకాశవాణి ద్వారా శివ కార్తీకేయన్‌ క్యారెక్టర్ రన్ చేసిన విధానం టోటల్‌గా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పవచ్చు.

నటీనటుల విషయానికి వస్తే.. శివ కార్తీకేయన్ తప్ప మిగితా క్యారెక్టర్లు అంతాగా కనిపించవు. శివ కార్తీకేయన్ తన వరకు తాను పాత్రను పండించే ప్రయత్నం చేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే సినిమాలో కంటెంట్ బలంగా లేకపోవడం వల్ల శివ కార్తీకేయన్ కూడా ఏమీ చేయలేకపోయాడు.యోగిబాబు సినిమాకు కొంత ఊరటగా కనిపిస్తాడు. అక్కడక్కడ యోగిబాబు కామెడీ బ్రహ్మండంగా పేలింది. మంత్రిగా మిస్కిన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సునీల్ పాత్ర పెద్దగా ప్రాధాన్యం లేకపోయింది. దాంతో ఆయన ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హెల్ప్ కాలేదనే చెప్పాలి. హీరోయిన్ అదితి శంకర్ పాత్రకు కూడా పెద్దగా స్కోప్ లేకపోయింది. తల్లి పాత్రలో సరిత ఫర్వాలేదనిపించారు.

Mahaveerudu Telugu Movie Review and Rating: Is Sivakarthikeyan hits bulls eye?

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాలో కంటెంట్ లేకపోతే.. ఏ విభాగాలు కూడా ఏమీ చేయలేవనే విషయాన్ని మహావీరుడు చూస్తే అర్ధమవుతుంది. ఉన్నంతలో మ్యూజిక్, సినిమాటోగ్రఫి విభాగాలు పర్వాలేదనిపిస్తాయి. పాటలు ఆకట్టుకోలేకపోయాయి. ఎడిటింగ్ విభాగం పనితీరు కూడా బాగాలేదు. ఓవరాల్‌గా నాసిరకం సినిమా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది.

సోషల్ ఇష్యూస్, ప్రభుత్వాల అవినీతిని టార్గెట్‌గా చేసుకొని వినోదాత్మకమైన పంథాలో సాగే చిత్రం మహావీరుడు. శివ కార్తీకేయన్ తరహా వినోదంతో సినిమా సాగుతుంది. ఎమోషనల్ కంటెంట్ లేకపోవడం వల్ల తేలిపోయిందనే చెప్పాలి. మంత్రి అవినీతిని ప్రశ్నించే పాయింట్ ఎజెండాతో కథను సాగ దీసి చెప్పారు. సెకండాఫ్‌లో క్లైమాక్స్ కోసం మరింత సాగదీసినట్టు అనిపిస్తుంది. రవితేజ వాయిస్ ఓవర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. శివ కార్తీకేయన్ ఫ్యాన్స్‌కు నచ్చే అవకాశం ఉంది. కామెడీ తరహా సినిమాలను ఇష్టపడేవారికి కూడా నచ్చే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X