Mahesh Babu review on Bheemla Nayak పవన్ కల్యాణ్ ఫైర్, రానా రచ్చ.. త్రివిక్రమ్‌పై అలాంటి కామెంట్
మలయాళ చిత్ర పరిశ్రమలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం చిత్రం ఆధారంగా రూపొందిన భీమ్లా నాయక్ చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఒరిజినల్‌కు భిన్నమైన కంటెంట్‌తో రూపొందించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి విజృంభణ, నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో భీమ్లా నాయక్ ఫీల్‌గుడ్ చిత్రంగా రూపొందింది. ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

భీమ్లా నాయక్ రికార్డుల మోత
భీమ్లా నాయక్ రిలీజైన చోట కలెక్షన్ల పరంగా రికార్డుల మోతమోగించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 38 కోట్ల గ్రాస్, 26.42 కోట్ల నికర కలెక్షన్లను సాధించింది. ఇక తెలుగేతర రాష్ట్రాల్లో రూ.3.10 కోట్లు రాబట్టిది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 7 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్ాయప్తంగా 56.50 కోట్ల గ్రాస్ వసూళ్లు, నికరంగా 36.37 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.

రెండో రోజు కూడా భారీ కలెక్షన్లు..
ఇక భీమ్లా నాయక్ చిత్రం రెండో రోజున కూడా భారీగా రెస్పాన్స్‌ను కూడగట్టుకొన్నది. రిలీజైన ప్రతీ చోట హౌస్‌ఫుల్ కలెక్షన్లను నమోదు చేసింది. రెండో రోజు కూడా 50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ వారంలోగా ఈ చిత్రం 150 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఏపీలో టికెట్ల రేట్ల వివాదం కారణంగా సరికొత్త రికార్డులను నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయింది.
భీమ్లా నాయక్‌పై మహేష్ బాబు రివ్యూ
భీమ్లా నాయక్ ఓ వైపు థియేటర్లలో ఇలా రచ్చ చేస్తుంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాపై తన రివ్యూను ట్వీట్ చేశాడు. భీమ్లా నాయక్ రచ్చ చేస్తున్నది. సినిమా ఇంటెన్సిటీతోపాటు ఎలక్ట్రిఫైయింగ్‌గా ఉంది. పవన్ కల్యాణ్ పెర్ఫార్మెన్స్ ఓ ఫైర్. డేనియల్ శేఖర్‌గా రానా దగ్గుబాటి సెన్సేషనల్ ఫెర్ఫార్మెన్స్ చూపించాడు. అతడి స్క్రీన్ ప్రజెన్స్ చూస్తే మతిపోయింది అని మహేష్ బాబు తన ట్వీట్‌లో తెలిపారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ది బెస్ట్ అంటూ
ఇక భీమ్లా నాయక్ సినిమాను మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ మలిచిన విధానం ఇంకా బాగుంది. ఆయన రాసే మాటలు చాలా పదునెక్కి ఉంటాయి. డైలాగ్స్ తూటాల్లా పేలాయి. ఇటీవల కాలంలో ఆయన నుంచి వచ్చిన అద్బుతమైన చిత్రం ఇదే అని ట్వీట్‌లో పేర్కొన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
తమన్ దుమ్మురేపాడంటూ.
ఇక సాంకేతిక నిపుణుల పనితీరుపై కూడా తన ప్రశంసలు గుప్పించాడు. డీవోపీ రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరించాడు. ఇక తమన్ అందించిన మ్యూజిక్ సినిమా చూసిన తర్వాత కూడా వెంటాడుతూనే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంత్రముగ్దుల్ని చేసింది. ఆయన మ్యూజిక్ ఓ సెన్సేషనల్ అంటూ మహేష్ బావు అన్నారు.

నిత్య మీనన్, సంయుక్త మీనన్‌కు కంగ్రాట్స్
ఇక భీమ్లా నాయక్ చిత్రాన్ని విజయవంతంగా మలిచిన చిత్ర యూనిట్‌లోని ప్రతీ ఒక్కరికి తన అభినందనలు తెలిపారు. దర్శకుడు సాగర్ కే చంద్ర, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, హీరోయిన్లు సంయుక్త మీనన్, నిత్యా మీనన్, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌కు కంగ్రాట్స్ అని ట్వీట్‌లో మహేష్ బాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











