RRR మీద మహేష్ బాబు రివ్యూ.. ఎపిక్, అవుట్ ఆఫ్ ది వరల్డ్.. ఊపిరి బిగబట్టేలా ఉందంటూ!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం RRR సినిమా అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు అది మొదలు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమా అద్భుతంగా ఉందని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన బడా దర్శకులు సుకుమార్, ప్రశాంత్ నీల్ హీరోలు చిరంజీవి, అల్లు అర్జున్ వంటి వారు తమ స్పందన తెలియజేయగా తాజాగా సినిమా వీక్షించిన మహేష్ బాబు కూడా సినిమా విషయంలో తన స్పందన వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

అన్ని రికార్డులను బద్దలు
రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఒలీవియా మోరిస్ నటించింది. ఇతర ప్రధాన పాత్రలలో రాహుల్ రామకృష్ణ, చత్రపతి శేఖర్, మకరంద్ దేశ్పాండే వంటి వారు నటించారు. సినిమా విడుదలైన మొదటి రోజు దాదాపుగా తెలుగు రాష్ట్రాల లోనే కాక తెలుగు సినిమాకి సంబంధించిన అన్ని రికార్డులను బద్దలు కొట్టింది..

ఊపిరి బిగబట్టే పరిస్థితి
తాజాగా ఈ సినిమా వీక్షించిన మహేష్ బాబు సినిమా మీద తన స్పందన వ్యక్తం చేశారు.. సినిమాలందు రాజమౌళి సినిమాలు వేరయా అంటూ మొదలు పెట్టిన మహేష్ బాబు RRR ఒక ఎపిక్, ఆ స్కేల్ గాని, గ్రాండియర్ గా ఉన్న విజువల్స్ గాని సంగీతం గానీ ఎమోషన్స్ కానీ అసలు ఊహ కు దగ్గరగా కూడా లేవని అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు చాలా స్టన్నింగ్ గా అనిపిస్తున్నాయని ఊపిరి బిగబట్టే పరిస్థితి కూడా ఒక్కోసారి అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.

అవుట్ ఆఫ్ ది వరల్డ్
సినిమాలో కొన్ని సీక్వెన్స్ ఉన్నాయి ఆ సీక్వెన్స్ లు మిమ్మల్ని మీరు మరిచిపోయి ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని అనుభవించేలా చేస్తాయి. వాటిని కేవలం మాస్టర్ స్టోరీ టెల్లర్స్ మాత్రమే చేయగలరు. రాజమౌళి గారు మాత్రమే ఆ మ్యాజిక్ చేయగలరు సర్ మీ గురించి చాలా గర్వంగా ఉంది అని మహేష్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వాళ్ళ స్టార్డమ్ దాటి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అవి అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని మహేష్ పేర్కొన్నారు.
Recommended Video


లా ఆఫ్ గ్రావిటీ పనిచేయడం లేదేమో
నాటు నాటు సాంగ్ విషయంలో లా ఆఫ్ గ్రావిటీ పనిచేయడం లేదేమో అనిపించింది. లిటరల్ గా వాళ్ళు గాలిలోతేలిపోతూ డాన్స్ చేశారు అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఎంటైర్ టీం అందరికీ హాట్సాఫ్ ఇలాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది మీ అందరికీ శుభాకాంక్షలు అంటూ మహేష్ బాబు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











