Guntur Kaaram Review గుండెను పిండేసే మదర్ సెంటిమెంట్.. 10 ఏళ్లలో మహేష్ ఇలా ఎన్నడూ.. గుంటూరు కారం రివ్యూ

Rating: 3.25/5

నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: ఎస్ రాధాకృష్ణ
సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్: థమన్
బ్యానర్: హారిక హాసిని క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2024-01-12

Recommended Video

Guntur Kaaram Movie Public Talk | Mahesh Babu | Trivikram | SreeLeela | Telugu Filmibeat

చిన్నతనంలోనే వీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేష్ బాబు)ను తల్లి వసుంధర (రమ్యకృష్ణ) వదిలేసి వెళ్లడం, ఆ తర్వాత తండ్రి (జైరామ్) జైలుకు వెళ్లడంతో అత్త (ఈశ్వరీరావు) పెంపకంలో పెరుగుతాడు. గుంటూరులో మిర్చి బిజినెస్ చేస్తూ రౌడీ యాటిట్యూడ్‌తో తల్లిపై విఫరీతమైన ద్వేషంతో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ బాండ్ పేపర్‌పై సంతకం పెట్టించాలని తల్లి, తాత (ప్రకాశ్ రాజ్) ప్రయత్నిస్తుంటారు.

Guntur Kaaram Review Story

భర్తను, కొడుకు రమణను తల్లి ఎందుకు వదిలేసి మరో వ్యక్తి ( రావు రమేష్)ను ఎందుకు పెళ్లి చేసుకొన్నది? కొడుకు నుంచి వసుంధరను ఆమె తండ్రి వెంకటస్వామి ( పకాశ్ రాజ్) ఎందుకు దూరం చేశాడు. రమణ తండ్రి సత్యం ఎందుకు జైలుకు వెళ్లాడు? అమ్ము (శ్రీలీల) ఎవరు? ఆమెతో రమణ ఎలా లవ్‌‌లో పడ్డాడు? రాజీ (మీనాక్షి చౌదరీ)తో రమణ సంబంధం ఏమిటి? చివరకు తల్లి, తాత కోరిన బాండ్‌పై రమణ సంతకం పెట్టాడా? తల్లి ప్రేమను రమణ పొందాడా? చేయి విడిచిన కొడుకు చేతిని తల్లి వసుంధర పట్టుకొందా? అనే ప్రశ్నలకు సమాధానమే గుంటూరు కారం సినిమా కథ.

Guntur Kaaram Story

గుంటూరు కారం కథ విషయానికి వస్తే.. సినిమాకు కావాల్సిన బలమైన పాయింట్‌ను తొలి పది నిమిషాల్లోనే రివీల్ చేసిన త్రివిక్రమ్ వెంటనే హీరోను ఇంట్రడ్యూస్ చేసి థియేటర్‌లో ఎలక్ట్రిఫైయింగ్ మూమెంట్స్‌ను తీసుకొచ్చారు. మహేష్ తన మార్కు ఎంట్రీ, యాక్షన్, కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో నాది నెక్లెస్ గొలుసు, ఒక్కడు పాటలకు శ్రీలీల వేసిన డ్యాన్సులు అదరగొట్టాయి. మహేష్, శ్రీలీల మధ్య రొమాంటిక్ సీన్లు చాలా క్లాసీగా సైటైరికల్ డైలాగ్స్‌తో మంచి ఫీల్, ఫన్ క్రియేట్ చేశాయి. ఇంటర్వెల్‌కు భారీ యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్‌తో ఫస్టాఫ్‌ను ముగించి సెకండాఫ్‌పై రెండింతలు అంచనాలు పెంచేశారు.

ఇక సెకండాఫ్‌లో రవిశంకర్, అజయ్ ఘోష్, అజయ్ క్యారెక్లర్లతో డిజైన్ చేసిన విధానం చాలా హిలేరియస్‌గా ఉంది. ఈ మూడు ఎపిసోడ్స్ సినిమాకు మంచి ఫన్ స్టఫ్ క్రియేట్ చేస్తాయి. లేడీస్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకు మరో హైలెట్. ఇక ప్రకాశ్ రాజ్.. రావు రమేష్ బ్లాస్టింగ్ సీన్లు కథను మలుపుతిప్పేలా చేస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ, మహేష్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తాయి. ఫైనల్‌గా త్రివిక్రమ్ మార్క్ సినిమాగా ముగుస్తుంది.

Guntur Kaaram Insights

నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికే వస్తే.. మహేష్ బాబు కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్‌కు మహేష్ టైమింగ్ బాగుంది. తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్, చేసిన రొమాంటిక్ సీన్లు ఫ్యాన్స్ ఫుల్ మీల్స్‌లో ఉంటాయి. ముఖ్యంగా శ్రీలీలతో కెమిస్ట్రీ బ్రహ్మండంగా స్క్రీన్‌పై పండింది. రమ్యకృష్ణ, రావు రమేష్, జయరాం, జగపతి బాబు పాత్రల నిడివి తక్కువగా ఉన్న వారి ప్రజెన్స్ టోటల్ స్టోరీలో ఇంపాక్ట్ చూపిస్తుంది. మీనాక్షి, అజయ్, అజయ్ ఘోష్, రవిశంకర్, బ్రహ్మాజీ ఇలా ప్రతీ పాత్ర కూడా ఫర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశారు.

గుంటూరు కారం సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, యాక్షన్, మ్యూజిక్ బలంగా కనిపించాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ తర్వాత పెద్దగా ఆకట్టుకోకపోగా, ట్రోలింగ్ స్టఫ్‌గా మారాయి. కానీ ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ మీద పాటలు చాలా క్రేజీగా ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చూస్తే మహేష్ బాబు గత 10 ఏళ్లలో ఎన్నడూ చేయని విధంగా చేశారు. ఇక మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫి ప్రతీ సీన్‌ను రిచ్‌గా మార్చాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ ప్రమాణాలకు తగినట్టుగా ఉన్నాయి.

Guntur Kaaram movie

పైనల్‌గా చెప్పాలంటే.. మహేష్ బాబు ఫెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, టేకింగ్, శ్రీలీల డ్యాన్సులు, గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రంలో ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ సినిమాకు మరో బలమైన అంశాలుగా కనిపిస్తాయి. పంచ్ డైలాగ్స్, హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, మదర్ సెంటిమెంట్ ఈ సినిమాను అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా ఉంటాయి. ఫన్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను ఎలాంటి సందేహాలు లేకుండా థియేటర్లోనే చూడాలి. ఫ్యాన్స్ ఫుల్ మీల్స్.. డొంట్ మిస్ ఇట్.

ట్యాగ్‌లైన్: కంటతడి పెట్టించే మమకారం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X