»   » ఏడు కొండలవాడా... ( ‘బ్రహ్మోత్సవం' రివ్యూ)

ఏడు కొండలవాడా... ( ‘బ్రహ్మోత్సవం' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

హిందీలో అప్పట్లో సూరజ్ బర్జత్యా చిత్రాలు వచ్చేవి.హమ్ ఆప్ హై కౌన్, మైనే ప్యార్ కియా, హమ్ సాత్ సాత్ హై , వివాహ్ ఇలా...మన సంప్రదాయాలుని చూపుతూ, భారీతనంతో ఫ్యామిలీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. వాటిలో కొన్ని హిట్టై తెలుగులోకి సైతం ప్రేమాలయం, ప్రేమ పావురాలు... వగైరా డబ్ అయ్యాయి. వాటిల్లో కొన్ని మరీ భారీగా బోర్ గా వాస్తవానికి విరుద్దంగా కృత్తిమమైన పాత్రలతో ఉన్నాయని రిజెక్ట్ చేయబడ్డాయి.


ఇప్పుడు ఆయన గొడవ ఎందుకూ అంటే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా కొంచెం అటూ ఇటూ లో అదే స్కూల్ ఫాలో అవుతున్నాడని, ఆయన సినిమాలు చూస్తే అర్దమవుతుంది. ముఖ్యంగా ఈ రోజు రిలీజైన బ్రహ్మోత్సవం చూస్తే..ఆ సినిమాలే వరస పెట్టి గుర్తు వస్తాయి. ఈ సినిమాలో ప్రతీ ఫ్రేమ్ లోని తెర పట్టనంత మంది జనం, భారీ సెట్టింగ్ లు ఉన్నాయి. మహేష్ ని అందంగా చూపే స్కీమ్ ఉంది. హీరోయిన్స్ ముగ్గరు ఉన్నారు. కానీ వీటిన్నటిని కలిపే కథే లేదు.


కథ లేకపోతే లేకపోయే సీన్స్ అయినా అద్బుతంగా ఉన్నాయా అంటే చాలా చోట్ల ఒక దానికొకటి లింక్ ఉన్నట్లు అనిపించవు. డైలాగులు కొన్ని అర్దమయ్యి...అర్దం కానట్లుగా ఉండి, కన్ఫూజ్ చేస్తూంటాయి. మహేష్ బాబు కు సినిమాలో ఏం పని, జనాలతో కబుర్లు చెప్తూ తిరగటం తప్ప ఇంకేమన్నా చేస్తాడా అనే డౌట్ కూడా వస్తుంది.


Also Read: అల్లు అరవింద్ ని, బన్ని ని...మహేష్ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు


ఫస్టాఫ్ పాటలతో, కథ లేకపోయినా లాక్కుపోయినా, సెకండాఫ్ కు వచ్చేసరికి మరీ దారుణమైపోయింది. ఎటు నుంచి ఎటువెళ్తోందో అర్దం కానీ కథ,కథనం అసహనం తెప్పిస్తాయి. మహేష్ అందం చూడటానికి, ఇప్పటికే హిట్టైన ఆడియోని విజువులైజ్ చేసిన విధానం చూడటానికి ఈ సినిమాకు వెళ్లాలి తప్ప అంతకు మించి మరేమి ఇందులో లేదు.


సత్యరాజ్ పెద్ద ఇండస్ట్రిలియస్ట్. ఆయన ఎంత గొప్పవాడంటే తన మామగారు ఇచ్చిన నాలుగు వందలు రూపాయలను వ్యాపారంలో పెట్టి ఇప్పుడు నాలుగు వందల కోట్లు చేసాడు. ఎప్పుడూ కుటుంబంలో ఏదో ఒక ఉత్సవం చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్ ని ఆనందంగా ఉంచటానికి ట్రై చేస్తూంటాడు. ఆయనకు నలుగు బావమరుదులు. వారందరూ కలిసే ఉంటూంటాడు. ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడుకుందాం అనే ఆయనకు ఒక కొడకు (మహేష్ ) . మహేష్ కూడా తండ్రి ఫిలాసఫీనే వంటబట్టించుకుంటాడు.


అయితే ఈ బావమరిదులలో ఒకరైన రావు రమేష్ కు ఐడింటెటీ క్రైసిస్ ఉంటాయి. ఎంతసేపూ బావ నీడలోనే బ్రతకాల్సి వస్తోందనే బాధ ఉంటుంది. సర్లే...తన కూతురు(ప్రణీత)ను ఒక్కగానొక్క కొడుకు,వారసుడు అయిన మహేష్ కు ఇచ్చి ఆ బాధ ను మరిచిపోదామనుకుంటే...మహేష్ వేరే అమ్మాయి(కాజల్) తో ప్రేమలో పడతాడు. దీంతో మండిన రావు రమేష్ ఆ కుటుంబంతో సంభందం తెంచుకోవాలనుకుని నోటికొచ్చినట్లు మాట్లాడి బావ సత్యరాజ్ ని నొప్పిస్తాడు.


Also Read: టాప్ పొజిషన్లో మహేష్ బాబు... మిగతా హీరోల స్థానం ఇదీ (లిస్ట్)


దాంతో ఆయన బాధపడి, ఆ బాధలోనే తుది శ్వాస విడుస్తాడు. అయితే సత్యరాజ్ చనిపోయేముందు కొడుకు మహేష్ కు ఓ మాట చెప్తాడు. దాంతో మహేష్ తన కుటుంబ ఏడు తరాలను కలవాలని బయిలు దేరతాడు. ఆ క్రమంలో మహేష్ ఏం చెసాడు. తిరిగి తన మామయ్య రావు రమేష్ తో ఎలా ఒకటయ్యాడు...సమంత ఎవరు...తండ్రి సత్యరాజ్ అసలు ఏం చెప్పాడు మహేష్ కు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...


'బ్రహ్మోత్సవం' సినిమా కోసం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎత్తుకున్నది మంచి పాయింటే. కానీ ఎగ్జిక్యూషన్ ఇబ్బందిగా మారింది. మొదటే చెప్పకున్నట్లు ఫస్టాఫ్..పాటలతో కథ కదలకపోయినా నడిచిపోయింది. సెకండాఫ్ కథ మొదలవుతుంది అనుకున్న చోట నుంచే సమస్య మొదలైంది. హీరోకు కథాపరంగా ఏ లక్ష్యమూ లేదు..పోనీ కథన ప్రధానమైన కథ కాబట్టి కథకు లక్ష్యం ఉంటుంది అనుకుంటే అదీ సరిగ్గా ఉండదు.


తన మామ రావు రమేష్ తో కుటుంబ విభేధాలు వచ్చినప్పుడు హీరో వాటిని సరిచేసే దిశగా ఏ ప్రయత్నమూ చేయకుండా, ఈ బంధువులు పోతే పోనీ, ఏడు తరాల్లో ఉన్న మిగతా బంధువులను అయినా కలుద్దాం అని బయిలుదేరినట్లు అనిపిస్తుంది.


పోనీ ఆ ఏడు తరాలు వాళ్లను కలిసి ఏం సాధించాడు..వాళ్లతో కలవటం వల్ల వాళ్ల జీవితాల్లో కానీ, మహేష్ జీవితాల్లో కానీ ఏమన్నా మార్పు వచ్చినట్లు చూపించారా అంటే అదీ ఉండదు. మొదటి నుంచి చివరి వరకూ కథ,కథనం చాలా ప్లాట్ గా ఏ టర్న్ లు లేకుండా నడుస్తూ విసిగించే సూక్తులు చెప్తుంది. ఆ సూక్తులు క్యారక్టర్స్ కి చెప్తున్నారో, చూస్తున్న ఆడియన్స్ కు చెప్తున్నారో, లేక ఖాళీగా ఉన్నాం కదా అని వాళ్లలో వాళ్లు సూక్తి ముక్తావళి పోగ్రాం పెట్టుకున్నారో అర్దం కాదు.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ


అర్దం లేని...

అర్దం లేని...

శ్రీకాంత్ అడ్డాల గత చిత్రాల్లో డైలాగులే హైలెట్ గా నిలిచాయి. అలాంటిది ఈ సినిమాకు డైలాగులే మైనస్ గా నిలిచాయి. చాలా డైలాగులు అసలు అర్దం కావు. చాలా లెంగ్తీగా ఉంటాయి.ఎందుకొచ్చిందో

ఎందుకొచ్చిందో

కాజల్ పాత్ర ఎందుకు కథలోకి వచ్చిందో, ఎందుకు ఎగ్జిట్ అయ్యిందో క్లారిటీ ఉండదు. కథలో కలవని పాత్ర ఇది.హైలెట్

హైలెట్

సినిమాలో హైలెట్ ఏమిటీ అంటే రావు రమేష్ పాత్ర..ఇంటర్వెల్ ముందు చెప్పే డైలాగ్స్.కామెడీ

కామెడీ

సినిమాలో కామెడీకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. సెకండాఫ్ మరీ డ్రైగా నడుస్తున్నప్పుడు కొద్దిలో కొద్ది వెన్నెల కిషోర్ పాత్ర వచ్చి సేవే చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ పాత్ర ఎందుకు వస్తుందో ,వెళ్లిపోతుందో అర్దం కాదుజయసుధ లాంటి సీనియర్ సైతం

జయసుధ లాంటి సీనియర్ సైతం

జయసుధ, నాజర్ వంటి సీనియర్ ఆర్టిస్టు లను సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. ఏదో జూనియర్ ఆర్టిస్ట్ లుగా తెరపై బ్యాక్ గ్రౌండ్ లో కనపడటానికి పెట్టుకున్నట్లు అనిపిస్తుందిసత్యరాజ్ మైనస్

సత్యరాజ్ మైనస్

సత్యరాజ్ ని తమిళ మార్కెట్ కోసం పెట్టుకున్నారో మరేమో కానీ మహేష్ తండ్రిగా సూట్ కాలేదనిపిస్తుంది. జగపతిబాబుని లేదా ప్రకాష్ రాజ్ ని పెట్టుుకున్నా సరిపోయేది. సత్యరాజ్ మాట్లాడుతూంటే చాలా ఓవర్ డ్రమిటెక్ గా అనిపిస్తుంది. సత్యరాజ్ చేత చెప్పించే డైలాగుకు ఆయన చేసే యాక్టింగ్ కు సింక్ అవదుసమంత పెద్ద కన్ఫూజన్

సమంత పెద్ద కన్ఫూజన్

ఈ సినిమా చూసాక..అసలు సమంత ఎవరు, ఆమె మహేష్ ఇంటికి ఎందుకు వచ్చింది , ఆమెకు కథలో ప్రయారిటీ అనే అనేక డౌట్స్ వస్తాయిమూలాలు వెతకటం

మూలాలు వెతకటం

కథ ప్రకారం హీరో తన కుటుంబానికి చెందిన ఏడు తరాలు వారిని ఎందుకు చూడాలనుకుంటున్నాడో ఫెరఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. దాంతో ఆ సీన్స్ అసలు పండలేదు.హరిద్వార్, కాశీ

హరిద్వార్, కాశీ

విజువల్స్ గా తప్ప కథలో హరిద్వార్, కాశి లొకేషన్స్ ఎందుకూ ఉపయోగపడవు. హీరో ఆ ప్రాంతాలకు వెళ్లి ఏం సాధించాడు అనే డౌట్ వస్తుంది. టూరిస్ట్ లా తిరుగుతున్నాడనిపిస్తుంది.సినిమాటోగ్రఫి

సినిమాటోగ్రఫి

రత్నవేలు తన దృష్టిని మొత్తం మహేష్ ని ఎంత అందంగా చూపాలనే దానిపైనే పెట్టినట్లున్నారు. లవ్ సీన్స్ తప్ప మిగతా చోట్ల ఆర్డనరీ గా ఉన్నాయి.ఎడిటింగ్

ఎడిటింగ్

చాలా చోట్ల లింక్ లు లేకుండా సీన్స్ వస్తూంటాయి. అలాగే సెకండాఫ్ లో ఇంకా ట్రిమ్ చేసినా నష్టం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే కథ ఎక్కడికి కదలదు. సీన్స్ రిపీట్ అవుతూంటాయి.


పాటలు

పాటలు

ఫస్టాఫ్ లో వచ్చే పాటలు ఊరటనిచ్చాయి. సెకండాఫ్ మాత్రం పాటలు పెద్దగా కిక్ ఇవ్వవు. అయినా ఫస్టాఫ్ లో అన్ని పాటలు ఎందుకు కూరేసారో మరి..మహేష్ వన్ మ్యాన్ షో

మహేష్ వన్ మ్యాన్ షో

ఈ సినిమాలో మహేష్ తప్ప మరెవరు ఉన్నా చివరి వరకూ భరించటం కష్టం. ఇది ఆయన వన్ మ్యాన్ షో.దర్శకుడుగా

దర్శకుడుగా

దర్శకుడుగా శ్రీకాంత్ అడ్డాల తన ఇంతకు ముందు చిత్రం సీతమవాకిట్లో సిరిమల్లె చెట్టు నాటి మ్యాజిక్ ని చూపలేకపోయాడు. కథని చెప్పటంలో కన్ఫూజ్ అయ్యారని పిస్తుంది.కీ క్యారక్టరే కన్ఫూజ్

కీ క్యారక్టరే కన్ఫూజ్

సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టూ, ఆయన భావజాలం చుట్టూ తిరుగుతుంది. అయితే ఆ పాత్రలోనే క్లారిటీ ఉన్నట్లు కనపడదు. తన బావమరిదిలను తన ఇంట్లోనే పెట్టుకుంటాడు తప్ప వారికి పెద్దగా ప్రయారిటీ ఇచ్చినట్లు కనపడడు. అలాంటప్పుడు వారిలో నెగిటివ్ నెస్ రావటంలో వింతేమి కనపడదు. కలిసి ఉండాలనుకుంటాడు కానీ, తనతో సమానంగా ఉండాలని కోరుకున్నట్లు కనపడడు.ఇంటర్వెల్ అయ్యాక

ఇంటర్వెల్ అయ్యాక

ఇంటర్వెల్ అయ్యాక వెంటనే వచ్చే సీన్స్ లో ...ఎక్కడా అంతకు ముందు జరిగిన సత్యరాజ్ చనిపోయిన వాతావరణం ఆ ఇంట్లో కనపడదు. అది ఎందుకు మర్చిపోయాడో అర్దం కాదు.ఎవరెరరు...

ఎవరెరరు...

బ్యానర్: పి.వి.పి సినిమా
నటీనటులు మహేష్ బాబు, కాజల్, సమంత, ప్రణీత, సత్యరాజ్, జయసుధ, రావు రమేష్, తనికెళ్ల భరణిల తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు,
సంగీతం: మిక్కీ జే.మేయర్,
ఎడిటింగ్: శ్రీకరప్రసాద్,
ఆర్ట్: తోటతరణి,
నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి,
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.
విడుదల తేదీ: 20, మే , 2016.ఫైనల్ గా... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి మరో ఫ్యామిలీ ఫెస్టివల్ తరహా చూడవచ్చు అని ఆశపడి వెళితే దర్శకుడు మనకు ఫెస్టివల్ చూపెడతాడు. కేవలం ఎంతో అందంగా కనపడుతున్న మహేష్ ని తెరపై చూడటానికి, పాటలు ఎంజాయ్ చేయటానికే ఈ సినిమా ఉపకరిస్తుంది. అంతకుమించి ఎక్సపెక్ట్ చేస్తే నీరసం తెప్పిస్తుంది.

English summary
Superstar Mahesh Babu's Brahmotsavam movie, which released today has been receiving a divide report. While the first half of the movie received unanimous appreciation, second half is said to have gone aimlessly, ignoring its original plot for most of the time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu