Shaitan Review: శృతిమించిన శృంగార సీన్లు, పచ్చి బూతులు.. 'సైతాన్' రివ్యూ

రేటింగ్: 2.75/5

టైటిల్: సైతాన్
నటీనటులు: మనీష్ రిషి, షెల్లీ నబు కుమార్, దేవియాని శర్మ, జాఫర్ సాదిక్, రవి కాలే, కామాక్షి భాస్కర్ల, నితిన్ ప్రసన్న తదితరులు
సినిమాటోగ్రఫీ: షణ్ముక సుందరం
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
సంగీతం: శ్రీరామ్ మద్దూరి
నిర్మాతలు: మహి వి రాఘవ్, చిన్న వాసుదేవ రెడ్డి
రచన, దర్శకత్వం: మహి వి రాఘవ్
విడుదల తేది: జూన్ 15, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (ఎపిసోడ్స్ 9)

డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు మహి వి రాఘవ్ (Mahi V Raghav). పాఠశాల, ఆనందో బ్రహ్మా, యాత్ర వంటి చిత్రాలను డైరెక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన తాజాగా డెరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ సైతాన్ (Shaitan). పచ్చి బూతులు, శృతిమించిన అడల్ట్ కంటెంట్ తో విడుదలకు ముందే ట్రైలర్ ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ ఎన్నో అంచనాలతో తాజాగా ఓటీటీ వేదికగా విడుదలైంది. మరి సైతాన్ వెబ్ సిరీస్ ఎలా ఉందో నేటి రివ్యూలో (Shaitan Web Series Telugu Review) తెలుసుకుందాం.

కథ:సావిత్రి (షెల్లీ నబు కుమార్)కి బాలి (మనీష్ రిషి), జయప్రద (దేవియాని శర్మ), గుమ్తి (జాఫర్ సాదిక్) ముగ్గురు పిల్లలు. భర్త వదిలేయడంతో సావిత్రికి పిల్లల పోషణ భారమవుతుంది. దీంతో ఒక పోలీసుకు ఉంపుడుగత్తెగా ఉంటుంది. తల్లి గురించి సమాజం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం నచ్చని బాలి ఏదైనా ఓ చోట పనిచేసి సంపాదించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో తల్లికోసం వస్తున్న పోలీసు కన్ను చెల్లెలు జయపై పడుతుంది. చెల్లెను కాపాడాకునేందుకు పోలీసును అతి కిరాతంగా చంపుతాడు బాలి.

Shaitan Review:

ట్విస్టులు: పోలీసును చంపిన కారణంగా జైల్లోకి వెళ్లిన బాలి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? నేరమే బాలి కుటుంబానికి జీవనాధారం ఎలా అయింది? దళంలోకి బాలి ఎందుకు చేరాడు? దళ సభ్యులతో బాలికి వైరం ఎందుకొచ్చింది? కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఎన్ని హత్యలు చేయాల్సి వచ్చింది? బాలి జీవితంలో పోలీస్ ఆఫీసర్ నాగిరెడ్డి (రవి కాలే) పాత్ర ఏంటీ? చివరికీ బాలి తన జీవితంలో ఏం సాధించాడు? ఏం కోల్పోయాడు? ఒక నేరం ఎలా పురుడుపోసుకుంటుందనేదే సైతాన్ వెబ్ సిరీస్ కథ.

విశ్లేషణ: సైతాన్.. "మీరు నేరాన్ని ఏమంటారు. వాళ్లు మాత్రం జీవనాధారం అంటారు" అనేది క్యాప్షన్. దీనికి తగినట్లుగానే సైతాన్ వెబ్ సిరీస్ ఉంటుంది. కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో చేసిన నేరం.. జీవనాధారంగా ఎలా మారిందో చూపించారు. ఇప్పటివరకు సాప్ట్ సినిమాలు తెరకెక్కించిన మహి వి రాఘవ్ ఒక్కసారిగా రూట్ మార్చి పూర్తి వయెలెన్స్, అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ తెరకెక్కించి ఆశ్చర్యపరిచాడు. రాయలేనటువంటి బూతులు, శృతిమించిన అడల్ట్ కంటెంట్, క్రూరమైన హింసాత్మక సన్నివేశాలతో వెబ్ సిరీస్ నిండి ఉంది.

Shaitan Review:

ప్లస్ అండ్ మైనస్ : తప్పని పరిస్థితుల్లో నేరాలు చేయడం చివరికీ ఆ తప్పులే ఎలా ప్రాణాలు తీశాయనే పాయింట్ తో డైరెక్టర్ కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. సన్నివేశాలు హార్ష్ గా ఉన్నా నేటి సమాజంలో జరిగే విషయాలను చూపించారు. కథ రొటీన్ గా ఉంటుంది. చిత్రీకరణ మాత్రం కొత్తగా ఉన్నప్పటికీ చాలా వరకు సన్నివేశాలు ఊహించేవిధంగా ఉన్నాయి. క్లైమాక్స్ లో జరిగే కొన్ని సంఘటనలను నాలుగైదు ఎపిసోడ్స్ కు ముందే హింట్స్ ఇవ్వడం మైనస్ అయిందని చెప్పుకోవాలి. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ లో జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

హైలెట్స్: రాజకీయాలు, నక్సలైట్ భావజాలాలు, అవసరం, అవకాశాలు, స్త్రీ వాంఛ, పగప్రతీకారాలు ఎలా ఎప్పుడు మారుతాయో చూపించడం బాగుంది. దళం సభ్యులు, పోలీసులు సహకరించుకోవడం, రాజకీయాల కోసం పోలీసులను పొలిటికల్ లీడర్స్ బలి చేయడం వంటివి ఆకట్టుకున్నాయి. కొన్ని చోట్ల అనవసరమైన బూతు పదాలు వాడారని అనిపిస్తుంది. చివరి రెండు ఎపిసోడ్స్ లలో ఎమోషనల్, వెంజెన్స్ ఆకట్టుకుంటుంది. బీజీఎమ్ రా అండ్ రస్టిక్ ఫీల్ తెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే.

Shaitan Review:

ఎవరెలా చేశారంటే? : సమాజంలో బాధితుడు అయినటువంటి బాలి.. నేరస్థుడిగా, దళ సభ్యుడిగా, చివరికీ హోమ్ మినిస్టర్ తలపై గన్ పెట్టే స్థాయికి ఎలా ఎదిగాడో చూపించిన పాత్రలో రిషి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. తల్లిగా షెల్లీ నబు కుమార్ తల్లిగా ఆకట్టుకున్నారు. బోల్డ్ అండ్ డీ గ్లామర్ లుక్ లో దేవియాని శర్మ పర్ఫామెన్స్ బాగుంది. జాఫర్ సాదిక్ కూడా అలరించాడు. కామాక్షి భాస్కర్ల పాత్ర ఇంపాక్ట్ గా ఉండదు. బట్ ఆమె బాగానే చేశారు. రవి కాలే పర్మామెన్స్ తోపాటు మిగతా పాత్రలు

Shaitan Review:
ఆకట్టుకుంటాయి.

ఫైనల్ గా చెప్పాలంటే?: నిజానికి ఇలాంటి సిరీస్ తెలుగులో ఎప్పుడు రాలేదు. చూస్తున్నంతసేపు సిరీస్ ఎంగేజ్ చేస్తుంది. కానీ ఊహించే సీన్లు, రొటీన్ స్టోరీ మాత్రం డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. ట్రైలర్ చూసి సిరీస్ చూద్దామనుకునే కాస్తా డిసప్పాయింట్ చేస్తాయి. ప్రతి మనిషిలో సైతాన్ ఉంటాడని చెప్పే ఈ వెబ్ సిరీస్ కేవలం పెద్దలకు మాత్రమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X