Maidaan Review మైదాన్ మూవీ రివ్యూ రేటింగ్.. 4/5 రేటింగ్ ఎందుకంటే?

Rating:
4.0/5

ఒలంపిక్ క్రీడల్లో భారత ఫుట్ బాల్ జట్టు ఘోరమైన వైఫల్యాలను చవిచూస్తుంటుంది. ఆ సమయంలో టీమ్‌ను గెలుపు బాట పట్టించేందుకు హైదరాబాద్‌కు చెందిన కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం (అజయ్ దేవగణ్) కోచ్‌గా నియమితులవుతాడు. కానీ పుట్ బాల్ క్రీడపై అధిపత్యం సాగించే బెంగాల్ పుల్ బాల్ బోర్డు మెంబర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. రహీంను చూసి అవహేళన చేస్తారు. కోల్‌కత్తా నుంచి కాకుండా హైదరాబాద్‌ను వచ్చి జట్టును గెలిపిస్తాడంట అని గేలి చేస్తారు. అయితే యువ జట్టుతో ఒలంపిక్స్ క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేయిస్తాడు.కానీ విజయాలు సాధించకపోవడంతో కోచ్ పదవి నుంచి తొలగిస్తారు.అదే సమయంలో రహీంకు లంగ్ క్యాన్సర్ అని తెలుస్తుంది.

తనకు లంగ్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత రహీం ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు. భర్త పూర్తిగా నిరుత్సాహం పడిపోతే భార్య (ప్రియమణి) ఎలా ఎంకరేజ్ చేసింది. కోచ్ పదవి నుంచి తొలగించిన తర్వాత మళ్లీ కోచ్‌గా ఎందుకు బాధ్యతలు చేపట్టాలనుకొన్నాడు. ఏ కండీషన్స్ తో రహీంకు కోచ్ పదవి అప్పగించారు? జకర్తా ఏషియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత్ ప్రభుత్వం ఎందుకు నిరాకరించింది? ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో రహీం ఎలాంటి పోరాటం చేశాడు. జకర్తాలో భారతీయ ఆటగాళ్లపై ఎందుకు దాడి జరిగింది. అనారోగ్య పరిస్థితుల్లో జట్టును కోచ్ ఎలా ముందుకు నడిపించాడు. ప్రతికూల పరిస్థితులను ఎదురించి రహీం తన చిరకాల కోరికను సాధించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మైదాన్ సినిమా కథ.

Maidaan Movie Review and rating  Ajay Devagan career best Performance

మైదాన్ సినిమా విషయానికి వస్తే..హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితానికి సంబంధించిన బయోపిక్ లాంటి సినిమా ఇది. 1951 నుంచి 1962 వరకు హెల్లింకీ‌లో ఒలంపిక్స్ నుంచి 1962లో జరిగిన ఏషియన్స్ గేమ్స్‌లో భారత జట్టు బంగారు పతకం గెలుచుకొనే వరకు జరిగిన సంఘటనలు, ఫుట్ బాల్ అసోసియేషన్‌లో రాజకీయాలను దర్శకుడు అమిత్ శర్మ భావోద్వేగంగా తెరకెక్కించారు. ఫస్టాఫ్‌లో కొంత స్లోగా సాగినట్టుగా అనిపించినా.. ఎమోషనల్ సీన్లతో ఆద్యంతం తన కథనంతో ప్రేక్షకులను కట్టిపడేశాడని చెప్పవచ్చు.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. సినిమా వెండితెర మీద ఓ అద్బుతంగా మారిందని చెప్పవచ్చు. కన్ను రెప్ప కొడితే ఏం మిస్ అవుతామో అనే విధంగా ఊపిరి బిగపట్టి సినిమా చూడాలేనంతగా సన్నివేశాలను చిత్రీకరించారు. ఓ పక్క ఫుట్ బాల్ అసోసియేషన్‌లో రాజకీయాలు.. మరో పక్క మృత్యువు వెంటాడే పరిస్థితుల మధ్య రహీం తన టీమ్‌కు మోటివేషన్ అందించే తీరు హృదయాన్ని టచ్ చేస్తుంది. చివరి గంటన్నర ప్రేక్షకుడు సినిమా హాల్‌లో కాకుండా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్నామా? అనే అనుభూతిలో మునిగిపోతాడు. సినిమా ముగిసిన తర్వాత సన్నివేశాలు ప్రేక్షకుడిని వెంటాడుతుంటాయి.

Maidaan Movie Review and rating  Ajay Devagan career best Performance

ఇక నటీనటుల విషయానికి వస్తే.. రహీంగా, కోచ్‌గా అజయ్ దేవగన్ తన కెరీర్‌ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాసేపు ఉత్సాహం అందిస్తూ.. మరికొంత సేపు గుండెను పిండేస్తూ తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆశ్చర్యానికి గురి చేస్తాడు. సెకండాఫ్‌లో అవార్డు విన్నింగ్ యాక్టింగ్‌తో మరిచిపోలేని అనుభూతిని పంచాడని చెప్పవచ్చు. ఇక రహీం పాత్రలో ప్రియమణి మరో భావోద్వేగమైన రోల్‌లో నటించారనే కంటే జీవించారనే చెప్పాలి. ఇక చిత్రంలోన నటించి స్పోర్ట్స్ జర్నలిస్ట్, బొర్డు మెంబర్స్ ఎవరికి వారే తోపు అనే విధంగా నటనతో మెప్పించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. చాలా ఏళ్ల తర్వాత మ్యూజిక్‌తో ఏఆర్ రెహ్మాన్ మ్యాజిక్ చేశాడు. ఒక్కో సీన్‌ను సినిమాటోగ్రాఫర్ చెక్కినట్టు తెర మీద చూపించారు. ఫుట్ క్రీడలో ఉండే వేగం.. ఇతర అంశాలను డీటైల్‌గా చూపించిన తీరు అభినందనీయం. ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్, లైటింగ్, అన్ని సాంకేతిక విభాగాలు సినిమా చూసినంత సేపు మరో ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. బోని కపూర్, జీ స్లూడియో పాటించిన నిర్మాణ విలువలు అమోఘంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X