twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మజిలీ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Majili Movie Review And Rating | Naga Chaitanya | Samantha Akkineni | Shiva Niravana || Filmibeat

    Rating:
    3.0/5
    Star Cast: సమంత, నాగచైతన్య, దివ్యాంశ, పోసాని, రావు రమేష్, అతుల్ కులకర్ణి
    Director: శివ నిర్వాణ

    నిన్ను కోరి సినిమాతో అందరి మెప్పు సంపాదించుకొన్న దర్శకుడు శివ నిర్వాణ మలి ప్రయత్నంలో మజిలీ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. రియల్ లైఫ్‌లో దంపతులైన నాగచైతన్య, సమంత రీల్ లైఫ్ ఫ్యామిలీగా తెరపైన ఫ్యామిలీగా చూపించే ప్రయత్నం చేశాడు. దివ్యాంన్ష కౌశిక్ నూతన హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేశారు. భారమైన ప్రేమ కథకు, భావోద్వేగాల జోడించిన శివ నిర్వాణ ద్వితీయ విఘ్నాన్ని అధిగమించారా? సమంత ఖాతాలో మరో సక్సెస్ చేరిందా? నటుడిగా నాగచైతన్య పరిణితితో కూడిన నటనను ప్రదర్శించారా? అనే ప్రశ్నలకు సమాధానం కోసం తెర మీద 'మజిలీ' ప్రయాణం ఎలా సాగిందనే విషయాన్ని తెలుసుకోవాల్సిందే.

    మజిలీ కథ

    మజిలీ కథ

    విశాఖపట్నానికి చెందిన పూర్ణ (నాగచైతన్య) రైల్వే జోన్‌లో చోటు సంపాదించి భారత జట్టు తరఫున ఆడాలని కలలు కనే క్రికెటర్. అన్షు (దివ్వాంన్ష) అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడుతుంది. భూషణ్ (సుబ్బరాజు) అనే వీధి రౌడీ కారణంగా వారి ప్రేమ విచ్ఛిన్నం అవుతుంది. ఆ తర్వాత ప్రేమ విఫలమైన పూర్ణ మద్యానికి బానిస అవుతాడు. అనుకొని పరిస్థితుల్లో శ్రావణి (సమంత)తో పెళ్లి జరిగినప్పటికీ ఆమె అంటే పూర్ణకు ఇష్టం ఉండదు. తన ధ్యాస అంతా అన్షు మీదే ఉంటుంది. ఈ క్రమంలో పూర్ణ, శ్రావణి జీవితంలోకి క్రికెటర్‌గా ఎదుగాలనే కోరిక ఉన్న ఓ బాలిక ప్రవేశిస్తుంది. బాలిక కారణంగా పూర్ణ, శ్రావణి మనసులు దగ్గరవుతాయి. కానీ పూర్ణను వదిలి శ్రావణి దూరంగా వెళ్లాలనుకొంటుంది.

     మజిలీ ప్రయాణంలో మలుపులు

    మజిలీ ప్రయాణంలో మలుపులు

    అన్షు, పూర్ణ మధ్య ప్రేమ ఏ పరిస్థితుల్లో పుట్టింది? వారి ప్రేమలో భూషణ్ ఎలాంటి చిచ్చు పెట్టారు. మద్యానికి బానిసైన పూర్ణ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. అనుకోని పరిస్థితుల్లో పూర్ణ జీవితంలోకి ప్రవేశించిన శ్రావణి ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నది. పూర్ణ, శ్రావణి జీవితంలోకి ప్రవేశించిన బాలిక ఎవరు? చివరకి పూర్ణ, శ్రావణి మధ్య విభేదాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి అనే ప్రశ్నలకు సమాధానమే మజిలి సినిమా కథ.

     ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    యూత్‌లో కనిపించే ఉద్రేకపూరితమైన యువ క్రికెటర్ పూర్ణ యవ్వనంతో సినిమా ఆరంభమవుతుంది. క్రికెటర్‌గా ఎదగడానికి పడిన పాట్లు, ఆ తర్వాత అన్షు ప్రేమలో పడటం చకచకా జరిగిపోతాయి. అయితే ఆ తర్వాత కథ, కథనాలు నత్త నడక నడవడం, రొటీన్ సీన్లతో ప్రేక్షకుల సహనానికి సినిమా పరీక్ష పెడుతుందా? అనిపిస్తుంది. భూషణ్ సాఫ్ట్ విలనిజం కథను మరో మలుపు తిప్పుతుంది. అలాగే అన్షు, పూర్ణ ప్రేమలో డెప్త్ కనిపించకపోవడం మరీ రోటీన్ అయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓ ఎమోషనల్ సీన్‌తో సమంత పాత్ర ప్రవేశపెట్టడంతో కథ ఆసక్తికరంగా మారడంపై ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక రెండో భాగంలో సమంత, నాగచైతన్య మధ్య వన్‌సైడ్ లవ్ కాస్త ఆకట్టుకొనేలా ఉంటుంది. ముఖ్యంగా సమంత చూపించిన హావభావాలు సినిమాను కొంత ఫీల్‌గుడ్‌గా మారుస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స‌కు ముందు పూర్ణ క్యారెక్టర్‌ను డెహ్రాడూన్‌కు తీసుకెళ్లడం చాలా కృత్రిమం అనిపిస్తుంది. ఫ్యామిలీ డ్రామాకు ఎమోషన్‌ను నింపే క్రమంలో ఓ పదమూడేళ్ల అమ్మాయి క్యారెక్టర్‌ను కథలోకి లాగడం 80 దశకంలోని ఇల్లాలు, ఇల్లాలు ప్రియురాలు సినిమాలను, ఇటీవల వచ్చిన మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాలను గుర్తు తెస్తాయి. సినిమా ఇక ముగిసిపోదా అనే ఫీలింగ్ వచ్చిన క్రమంలో మరీ లాగి సమంత, నాగచైతన్య మధ్య మరోసారి భావోద్వేగాలను జొప్పించి కథకు చివర్లోనైనా న్యాయం చేద్దామనే ప్రయత్నం మధ్య మజిలీ ప్రయాణం ముగస్తుంది.

     దర్శకుడిగా శివ నిర్వాణ ద్వితీయ విఘ్నం

    దర్శకుడిగా శివ నిర్వాణ ద్వితీయ విఘ్నం

    దర్శకుడు శివ నిర్వాణ ఎంచుకొన్న కథ కొత్తదనిపించదు. సీసా, సారా రెండు పాతవే. కానీ గ్లాస్‌‌ను మాత్రమే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. తెలుగు సినిమా ప్రేక్షకులకు రెండు, మూడు సినిమాలను ఒకే కథగా చూపించే సాహసం చేశాడు. కాకపోతే కాస్త స్లోగా కథ చెప్పినా భావోద్వేగాలనే లైన్ మిస్ కాలేదు. అదే రెండో విఘ్నాన్ని దాటేస్తాడనే ఆలోచనను తీసుకురావడంలో సఫలం చేసింది. అత్యంత ఎమోషనల్‌గా ఉన్న కంటెంట్‌ను మరీ కొంత ఆహ్లాదకరంగా చెప్పి ఉంటే బాగుండేది. మొదటి సీన్ నుంచి ఎమోషనల్ డోస్ ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉంది. ఓవరాల్‌గా శివ నిర్వాణ సానుకూలమైన ప్రయత్నాన్ని ఆయాసంగా, భారంగా చేరుకొన్నట్టు అనిపిస్తుంది.

    నాగచైతన్య పరిపూర్ణమైన నటన

    నాగచైతన్య పరిపూర్ణమైన నటన

    మజిలీ సినిమాలో పూర్ణ క్యారెక్టర్‌‌దే అగ్రభాగం. కథ సింగిల్ త్రెడ్ కావడం, కథ మొత్తాన్ని పూర్ణ యాంగిల్‌లో చెప్పాల్సి రావడంతో నాగచైతన్య‌కు నటుడిగా మరిన్నీ మార్కులు కొట్టేసేందుకు కారణమైంది. నటుడిగా మరొమెట్టు ఎక్కినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లను చైతూ బాగా పండించాడు. సినిమా భారాన్ని పూర్తిగా మోశారనే ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. కొన్ని పేలవమైన సీన్ల కారణంగా చైతూ క్యారెక్టర్ వీక్‌గా కనిపిస్తూ ఒడిదుడుకులకు లోనవుతుంటుంది. అయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చాడనే చెప్పవచ్చు.

    సమంత మరోసారి భారమైన పాత్రలో

    సమంత మరోసారి భారమైన పాత్రలో

    జీవితంలో ఆటుపోట్లకు లోనయ్యే శ్రావణి పాత్రలో సమంత కనిపించింది. రెండో భాగంలో కథలో శ్రావణి పాత్ర బలంగా మారడంతో సవాల్‌గా మారిన సమంతలో ఒదిగిపోయింది. అయితే భారమైన పాత్రను చాలా తేలిగ్గానే మోసిందనే చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో రెండు, మూడు సీన్లు తప్ప పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. అయినా ప్రతీ సీన్‌ను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించిన తీరు సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళ్లడానికి ఆస్కారం ఏర్పడింది. మరోసారి ఫెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రను తనదైన శైలిలో మెప్పించింది.

     గ్లామర్‌గా దివ్యాంశ కౌశిక్

    గ్లామర్‌గా దివ్యాంశ కౌశిక్

    ఇక లవ్లీ గర్ల్‌గా దివ్యాంశ కౌశిక్ ఎనర్జిటిక్ పాత్రలో మెరిసింది. గ్లామర్‌కు స్కోప్ ఉన్న పాత్రలో చలాకీగా కనిపించింది. రొమాంటిక్ సీన్లలో చైతూతో కెమిస్ట్రీ బాగా పండించేలా నటించింది. అదే క్రమంలో కొన్ని ఎమోషనల్ సీన్లకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. నటనపరంగా మరింత రాటుదేలాల్సిన అవసరం కనిపించింది. పాటలకు, డ్యాన్సులకు పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల పూర్తిస్తాయి హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్ కాలేకపోయింది.

    మిగితా క్యారెక్టర్లలో

    మిగితా క్యారెక్టర్లలో

    మిగితా క్యారెక్లర్లలో సమంతకు తండ్రిగా పోసాని, నాగచైతన్యకు తండ్రిగా రావు రమేష్, దివ్వాంశకు తండ్రిగా అతుల్ కులకర్ణి నటించారు. ఈ ముగ్గురి పాత్రలు వారికి రొటీన్ పాత్రలే. కాకపోతే కథకు బలంగా, సపోర్ట్‌గా నిలిచాయని చెప్పవచ్చు. పోసాని పాత్ర ఎంటర్‌టైన్‌మెంట్‌కు, రావు రమేష్ పాత్ర ఎమోషనల్ పాయింట్లను టచ్ చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇక హీరో ఫ్రెండ్ పాత్రల్లో ‘కాంబ్లీ' పాత్ర వేసిన కుర్రాడు మంచి మార్కులు కొట్టేశాడు. చాలా ఈజ్ ఉండే కామెడీని, సటైల్‌గా డైలాగ్స్ చెప్పే ప్రయత్నం చేశాడు.

     గోపి మ్యూజిక్, థమన్ రీరికార్డింగ్

    గోపి మ్యూజిక్, థమన్ రీరికార్డింగ్

    మజిలీ సినిమాకు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొన్నది. కొన్ని సీన్లను అమాంతం ఆకాశానికి ఎత్తేసేలా ఉన్నాయి. ప్రతీ సినిమాకు థమన్ పరిణితి మెరుగ్గా కనిపిస్తున్నది. గోపిసుందర్ అన్ని పాటలు అంతగా ఆకట్టుకొనేలా లేవు. రెండు పాటలు బాగున్నాయి. నిన్ను కోరి సినిమాకు మ్యూజిక్ ప్రధానబలం.. కానీ ఈ సినిమాకు ఆ పరిస్థితి కనిపించదు.

    సినిమాటోగ్రఫి, ఎడిటింగ్

    సినిమాటోగ్రఫి, ఎడిటింగ్

    సాంకేతిక విభాగాల్లో సినిమాటోగ్రఫి బాగుంది. క్రికెట్ సన్నివేశాలను విష్ణుశర్మ బాగా చిత్రీకరించారు. పాత్రల మూడ్‌కు తగినట్టుగా లైటింగ్ వాడుకొన్న తీరు ఆకట్టుకునేలా ఉంది. కొన్ని సీన్లలో భావోద్వేగాన్ని రెట్టింపు చేయడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ఎడిటింగ్ ప్రవీణ్ పుడి విషయానికి వస్తే.. ఇంకా చాలా పనుంది. సినిమా లెంగ్త్ తగ్గిస్తే మజిలీ మరింత స్పీడ్ అయ్యే అవకాశం తప్పక ఉంటుంది. సినిమా నత్తనడకన సాగే విషయం ఎడిటర్ నిర్ణయం కాకపోవచ్చనే చెప్పవచ్చు.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    షైన్ స్రీన్స్ బ్యానర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సాహు గారపాటి, పెద్ది హరీష్ సంయుక్తంగా మజిలీని తెరకెక్కించిన విధానం వారి అభిరుచికి అద్దంపట్టింది. పాత్రల కోసం నటీనటులు ఎంపిక, సాంకేతిక విభాగాల నిపుణుల కూర్పు బాగుంది. కథనంపై మరింత కసరత్తు చేయాల్సిన అవసరం కనిపించింది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    పలు రకాలు ఎమోషన్స్, మలుపులతో కూడిన సినిమా మజిలీ. భారమైన కథగా నేరుగా చెప్పకుండా సాగదీసి సాగదీసి చెప్పడం ప్రేక్షకుడిని విసిగించే ప్రయత్నాలు కనిపిస్తాయి. అయితే చివర్లో కథను ముగించిన విధానం సినిమాకు ప్లస్ అనిచెప్పవచ్చు. యూత్‌, ఫ్యామిలీని ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. వేసవి సెలవుల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగలిగితే కమర్షియల్‌గా సక్సెస్ సాధించే అవకాశాలు ఉండొచ్చు.

    పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్

    పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్

    పాజిటివ్ పాయింట్స్

    • సమంత, నాగచైతన్య, దివ్యాంశ, పోసాని, రావు రమేష్
    • సినిమాటోగ్రఫి
    • రీరికార్డింగ్
    • క్లైమాక్స్
    • నెగిటివ్ పాయింట్స్

      • స్లో నేరేషన్
      • ఫస్టాఫ్ కొంత, సెకండాఫ్ ఆరంభంలో మరికొంత
      • నిడివి
      • అనేక ట్విస్టులు
      • తెర ముందు, తెర వెనుక

        తెర ముందు, తెర వెనుక

        నటీనటులు: సమంత, నాగచైతన్య, దివ్యాంశ, పోసాని, రావు రమేష్, అతుల్ కులకర్ణి
        దర్శకత్వం: శివ నిర్వాణ
        నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది
        మ్యూజిక్: గోపి సుందర్, ఎస్ఎస్ థమన్
        సినిమాటోగ్రఫి: విష్ణు శర్మ
        ఎడిటింగ్: ప్రవీణ్ పుడి
        బ్యానర్: షైన్ స్క్రీన్స్
        రిలీజ్: 2019-04-05

    English summary
    Majili is an romantic drama film directed by Shiva Nirvana and produced by Sahu Garapati, Harish Peddi, Sushil choudhary under the banner of Shine Screens Production. Majili means "A part of Journey". The film features Naga Chaitanya, Samantha Akkineni and Divyansha Kaushik in lead roles. Chaitanya and Samantha had previously worked together in Ye Maaya Chesave, Manam and Autonagar Surya. This will be their first collaboration after getting married
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X