twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Major movie review ఎమోషనల్, థ్రిల్లింగ్ బయోపిక్.. అడివి శేష్ మరో రేంజ్‌లో..

    |

    Rating:
    3.0/5
    Star Cast: అడివి శేష్, ప్రకాశ్ రాజ్, రేవతి, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాల
    Director: శశి కిరణ్ తిక్క

    26/11 ముంబై నగరంపై ముష్కరుల దాడి నేపథ్యంగా రూపొందిన మేజర్ చిత్రం రిలీజ్‌కు ముందు భారీ అంచనాలను అందుకొన్నది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సోని పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా.. అడివి శేష్, సాయి మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, శోభిత ధూళిపాల తదితరులు నటించారు. జూన్ 3 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకొన్నదా? సినిమా ఎలాంటి అనుభూతిని అందించిందనే విషయాలను తెలుసుకోవాలంటే.. మేజర్ మూవీ కథ, కథనాలను సమీక్షించాల్సిందే.

    Recommended Video

    Major Movie Review...Adivi Sesh కెరీర్ బెస్ట్ మూవీ #Tollywood | Filmibeat Telugu
    మేజర్ సినిమా కథ..

    మేజర్ సినిమా కథ..

    సందీప్ ఉన్నికృష్ణన్ (అడవి శేష్) చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరాలనే కోరికతో ఉంటాడు. దేశం కోసం సేవల చేయాలని తపించి పోతుంటాడు. కానీ ప్రతీ ఇంట్లో తల్లిదండ్రుల మాదిరిగానే వారు మాత్రం డాక్టరో, ఇంజినీరో కావాలని కోరుకొంటారు. కానీ తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా నేవీలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే రిజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత సైన్యంలో ఉద్యోగానికి అప్లై చేసి తన కోరికను తీర్చుకొంటాడు.

    మేజర్‌ మూవీలో ట్విస్టులు

    మేజర్‌ మూవీలో ట్విస్టులు

    భారత సైన్యంలో చేరాలని చిన్నప్పటి నుంచి ఎందుకు కలలు కంటాడు? ప్రేయసిగా మారిన భార్యతో సందీప్‌కు ఎలాంటి విభేదాలు ఏర్పడ్డాయి? ముంబై దాడుల నేపథ్యంలో సందీప్ ముష్కరులను మట్టుబెట్టడానికి ఎలాంటి సాహసం చేశాడు? ఏ పరిస్థితుల్లో సందీప్ ఒంటరిగా ముష్కరులపై దాడికి ప్రయత్నించాడు. సైన్యంలో చేరిన సందీప్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయనే ప్రశ్నలకు సమాధానమే మేజర్ సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    సందీప్ మరణాంతరం తన కుమారుడి జీవితం గురించి తల్లితండ్రులు (ప్రకాశ్ రాజ్, రేవతి) చెప్పే విషయాలతో మేజర్ మూవీ చాలా ఎమోషనల్‌గా మొదలవుతుంది. సినిమాటిక్‌గా కాకుండా సహజంగా కథనం సాగడంతో ఫస్టాఫ్ కాస్త బోర్‌గా అనిపిస్తుంది. రొటీన్ సీన్లు, రెగ్యులర్ ఫార్మాట్‌తో కథ సాగడం సినిమా మొదటి భాగం తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో సందీప్ ఆర్మీలో చేరడానికి వెళ్లే సన్నివేశాలు, ఆర్మీలో సందీప్ శిక్షణ, ముంబైలోకి పాక్ ముష్కరులు ఎంట్రీ తదితర అంశాలు సినిమాపై ప్రేక్షకుల పట్టు సాధించేలా మారుతాయి.

    భావోద్వేగంగా సెకండాఫ్

    భావోద్వేగంగా సెకండాఫ్

    ఇక సెకండాఫ్‌లో తాజ్ హోటల్‌పై దాడి ఘటన, NSG లో సభ్యుడైన సందీప్ తీసుకొనే నిర్ణయాలు చాలా ఎమోషనల్‌గా సాగుతాయి. ఓ వైపు తాజ్ హోటల్‌పై దాడి.. మరో వైపు గర్బవతి అయిన భార్యతో విభేదాలు సినిమాను భావోద్వేగంగా మారుస్తాయి. చివరి 30 నిమిషాలు మేజర్ సినిమా ప్రేక్షకుడిని ఎమోషనల్‌గా కట్టిపడేస్తుంది. ప్రేక్షకుడిని భారమైన హృదయంతో బయటకు వచ్చేలా చేస్తుంది.

    దర్శకుడిగా శశి కిరణ్

    దర్శకుడిగా శశి కిరణ్

    ముంబైలోని తాజ్ హోటల్‌పై పాక్ ముష్కరులు జరిపిన దాడిలో ప్రాణత్యాగం చేసిన సందీప్ ఉన్నికృష్ణన్ గురించిన కత అందరికి తెలిసిందే. అయితే ఆ కథలోని అంశాలను, భావోద్వేగాలను ఒడిసి పట్టుకొన్న తీరుతోనే దర్శకుడు శశి కిరణ్ తిక్క సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో కథను చెప్పిన విధానంతో తన ప్రతిభను చాటుకోవడమే కాకుండా ప్రేక్షకుడి మనసును గెలుచుకొన్నాడని చెప్పవచ్చు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమాను ఎమోషనల్‌గా మలిచిన తీరు అభినందనీయం.

    అడివి శేష్ పెర్ఫార్మెన్స్

    అడివి శేష్ పెర్ఫార్మెన్స్

    మేజర్ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్‌గా అడివి శేష్ తనకు తాను మలుచుకొన్న తీరు చాలా బాగుంది. కాలేజీ సీన్లలో కుర్రాడిగా, ఇషా (సాయి మంజ్రేకర్) ప్రియుడిగా, ఆర్మీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా, దేశం కోసం ప్రాణాలకు తెగించే సైనికుడిగా పలు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో చేయని ఫెర్ఫార్మెన్స్‌ను ఈ చిత్రంలో చూపించి.. వన్ మ్యాన్ షో అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నాడని చెప్పవచ్చు.

    సాయి మంజ్రేకర్; ప్రకాశ్ రాజ్ గురించి

    సాయి మంజ్రేకర్; ప్రకాశ్ రాజ్ గురించి

    మేజర్ సినిమాలోని మిగితా క్యారెక్టర్‌లో ఇషాగా సాయి మంజ్రేకర్ అద్భుతంగా కనిపించింది. కాపాడుకోవాలి కదా అంటూ చెప్పిన డైలాగ్స్ టచ్ చేస్తాయి. సెకండాఫ్‌లో నాకు తోడుగా లేకుండా నన్ను ఎలా కాపాడుకొంటావు అనే డైలాగ్స్ సినిమా పరమార్థాన్ని చెప్పేలా చేస్తుంది. గర్బవతిని అని చెప్పడానికి నిరాకరించే సీన్లలో సాయి మంజ్రేకర్ అద్భుతంగా నటించింది. ఇక సెకండాఫ్‌కు కీలకంగా మారిన ప్రమోదారెడ్డి పాత్రలో శోభితా ధూళిపాళ ఆకట్టుకొన్నది. ఇక ఈ సినిమాకు ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ వెన్నుముక లాంటింది. కథ, కథనాలను రక్తి కట్టించడంలో ప్రకాశ్ రాజ్ హవభావాలు, యాటిట్యూడ్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు. రేవతి నటన అద్భుతంగా ఉంటుంది.

    టెక్నికల్ అంశాల గురించి

    టెక్నికల్ అంశాల గురించి

    సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మేజర్ సినిమా మరో రేంజ్‌కు తీసుకెళ్లడంలో శ్రీ చరణ్ పాకాల, వంశీ పచ్చిపులుసు సక్సెస్ అయ్యారు. శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎమోషనల్‌గా మార్చేసింది. సెకండాఫ్‌లో వంశీ సినిమాటోగ్రఫి సినిమా స్టాండర్డ్‌ను పెంచింది. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు చాలా బాగుంది. సోని పిక్చర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    భావోద్వేగం, దేశభక్తి, తల్లిదండ్రుల సెంటిమెంట్, ప్రేమ తదితర అంశాలతో సమ్మేళనంతో రూపొందిన బయోపిక్ మేజర్. తొలి భాగంలో అసలు కథలోకి వెళ్లడానికి కాస్త ఆలస్యం కావడం బోర్‌గా అనిపిస్తుంది. కానీ ఒకసారి కథలోకి వెళ్లిన తర్వాత సెకండాఫ్‌‌ ఎక్కడ డ్రాప్ కాలేదు. సీన్.. సీన్‌కు ఎలివేట్ చేస్తూ మంచి అనుభూతిని, ఉద్వేగానికి గురి అయ్యేంతగా సినిమా ప్రభావితం చేస్తుంది. పక్కాగా ఇది థియేట్రికల్ ఫీల్ ఉన్న చిత్రం.. థియేటర్‌లోనే చూస్తే గొప్ప అనుభూతి కలుగుతుంది. కమర్షియల్‌గా ఏ రేంజ్ వసూళ్లను సాగిస్తుందో అనే విషయం రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది.

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    అడివి శేష్, ప్రకాశ్ రాజ్, రేవతి, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాల, మురళీ శర్మ తదితరులు
    దర్శకత్వం: శశి కిరణ్ తిక్క
    రచన: అడివి శేష్
    డైలాగ్స్: అబ్బూరి రవి
    నిర్మాతలు: మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
    మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల
    సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు
    ఎడిటింగ్: వినయ్ కుమార్ సిరిగినీడి, పవన్ కల్యాణ్
    బ్యానర్స్: సోని పిక్చర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్
    రిలీజ్ డేట్: 2022-05-22

    English summary
    Sandeep Unnikrishnan's biographical story Major movie released on June 3rd. Here is the exclusive review of filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X