Corona Papers Review: దొంగలించిన పోలీస్ గన్‌తో బ్యాంక్ రాబరీ.. 'కరోనా పేపర్స్' ఆకట్టుకుందా?
రేటింగ్: 2.5/5
టైటిల్: కరోనా పేపర్స్
నటీనటులు: షేన్ నిగమ్, సిద్ధిక్, సంధ్యా శెట్టి, గాయత్రీ, షైన్ టామ్ చాకో, జీన్ లాల్, హన్నా రేజి కోషి, వినీత్ శ్రీనివాసన్, ఫ్రాంకో ప్రాన్సిస్, హన్నా రేజి కోషి, విజిలేష్ కరాయద్ తదితరులు
సినిమాటోగ్రఫీ: దివాకరణ్ మణి
సంగీతం: కె.పి
కథ: శ్రీ గణేష్
నిర్మాతలు: ఎన్ఎమ్ బాదుషా, ప్రియదర్శన్
దర్శకత్వం: ప్రియదర్శన్
థియేటర్ విడుదల తేది: ఏప్రిల్ 6, 2023
ఓటీటీ విడుదల తేది: మే 5, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
కరోనా తర్వాత ఓటీటీలు పెరిగిపోవడంతో భాష బేధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీసులు వీక్షిస్తున్నారు. అందుకే ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా వివిధ చిత్ర పరిశ్రమలోని సినిమాలను అన్ని భాషల్లోకి అనుదిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలోకి వచ్చిన సినిమా కరోనా పేపర్స్. ఏప్రిల్ 6న థియేటర్లో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తోంది. ఇందులో దసరా విలన్ షైన్ టామ్ చాకో, విక్రమ్ మూవీ ఫేమ్ గాయత్రీ తప్పా మిగతా పాత్రలు అంతగా పరిచయం లేదు. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ: రాహుల్ నంబియార్ (షేన్ నిగమ్) పోలీస్ స్టేషన్ లో కొత్తగా ఎస్సై పోస్టులో జాయిన్ అవుతాడు. తనకు తన పై అధికారి రూల్స్ ను పక్కన పెట్టి ఓ క్రిమినల్ పై ఇన్వేస్టిగేట్ చేయమని చెబుతాడు. ఈ క్రమంలో బస్సులో రాహుల్ గన్ ను ఓ దొంగ (ఫ్రాంకో ప్రాన్సిస్) కొట్టేస్తాడు. అదే గన్ తో ముగ్గురు బ్యాంక్ రాబరీ చేస్తారు.
ట్విస్టులు, ఆసక్తికర అంశాలు : బ్యాంక్ రాబరీ చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారా? ఈ కేసను లీడ్ చేస్తున్న డీఎస్పీ గ్రేసీ (సంధ్యా శెట్టి), దొంగతనం టీమ్ హెడ్ గోవిందు (సిద్ధిక్)కు ఉన్న సంబంధం ఏంటీ? గోవిందు అసలు పేరు ఏంటీ? అతను గ్రేసీ వల్ల ఏం పోగోట్టుకున్నాడు? దొంగతనం చేయడానికి కారణం ఏంటీ? ఇదంతా తెలుసుకున్న రాహుల్ ఏం చేశాడు? రాహుల్ ను కాపాడిన ముస్తాఫా ఎవరు? వంటి తదితర ఆసక్తిర అంశాల సముహారమే కరోనా పేపర్స్.

విశ్లేషణ: కరోనా పేపర్స్ సినిమాను 1949లో జపనీస్ డైరెక్టర్ అకిరా కురొసావా చిత్రీకరించిన స్ట్రే డాగ్ నుంచి స్ఫూర్తిగా, తమిళం మూవీ 8 తోట్టకల్ (8 బుల్లెట్లు)కు రీమేక్ గా వచ్చింది. ఇదే చిత్రాన్ని తెలుగులో సేనాపతిగా రీమేక్ చేశారు. నిజానికి ఈ సినిమాలో రెండు కథలు చూపించారు. ఒకటి వ్యాన్ మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఇద్దరు అమాయకులను పోలీసులు ఏం చేశానేది అయితే మరొకటి అప్పుడే జాబ్ లో జాయిన్ అయినా ఎస్సై సర్వీర్ రివాల్వర్ పోగొట్టుకోవడం. ఈ రెండింటికి లింక్ ఉన్న ఓ క్యారెక్టర్ తో కరోనా పేపర్స్ సినిమా కథగా తెరకెక్కించారు.
ఆ సినిమాలాగే : రాత్రి సమయంలో 8 బుల్లెట్లు పేలడం, తర్వాత డీఎస్పీ మామను హత్య చేయడంతో ఆసక్తిగా సినిమా ప్రారంభం అవుతుంది. మొదటి 20 నిమిషాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే తర్వాత స్లో నెరేషన్ తో బోర్ కొడుతుంది. కొత్త ఎస్సై జాబ్ లో జాయిన అవ్వడం, అతను ఓ రిపోర్టర్ (గాయత్రీ) సహాయం తీసుకోవడం వంటి, ఎస్సై మిస్ చేసిన గన్ తో బ్యాంక్ రాబరీ జరగడం, ఆ డబ్బు కోసం ముగ్గురు తగాదా పడటం వంటి అంశాలు అన్నీ సేనాపతి తరహాలోనే ఉంటాయి.

ఆసక్తిగా మర్డర్ ట్విస్ట్ : ఇక సినిమాలో కరోనా పాండమిక్ లో భాగంగా మాస్క్, శానిటైజేషన్ వంటి అంశాలు తప్పా మిగతా అంతా సాధరణంగానే ఉంటాయి. కరోనా సమయంలో బ్యాంక్ రాబరీ చేయడంతో సినిమాకు కరోనా పేపర్స్ అని టైటిల్ పెట్టారేమో అనిపిస్తుంది. ఇక శ్రీ గణేష్ కథ బాగున్నా దాని టేకింగ్ విషయంలో డైరెక్టర్ ప్రియదర్శన్ పూర్తిగా సఫలం కాలేదనే అనిపిస్తుంది. ఫస్ట్ 20 మినిట్స్, చివరి 30 నిమిషాలు, కాకా పాపన్ (షైన్ టామ్ చాకో) పాత్ర సన్నివేశాలు తప్పితే పెద్దగా ఆసక్తిగా అనిపించదు. ఏసీపీ గ్రేసీ మామ మర్డర్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. బీజీఎమ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అంతా ఓకే.
ఎవరెలా చేశారంటే : గన్ పోగొట్టుకున్న కొత్త ఎస్సైగా షేన్ నిగమ్ బాగానే చేశాడు. కానీ పాత్రకు పెద్దగా ఇంపాక్ట్ లేనట్లుగా అనిపిస్తుంది. సిద్ధిక్ తన నటనతో ఆకట్టుకున్నారు. రిపోర్టర్ గా గాయత్రీ పరిధి మేర బాగానే చేసింది. కాకా పాపన్ పాత్రలో షైన్ టామ్ చాకో మెప్పించారు. అతని నటనతో సీన్లు ఇంట్రెస్టింగ్ గా మారాయి. గ్రేసీ క్యారెక్టర్ లో సంధ్యా శెట్టి చాలా బాగా మెప్పించారు. నిజానికి ఆమె పాత్రే సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మిగతా వారంతా పరిధి మేర అలరించారు.

ఫైనల్ గా చెప్పాలంటే : ఇక కరోనా పేపర్స్ సినిమా గురించి ఫైనల్ గా చెప్పాలంటే తెలుగులో వచ్చిన సేనాపతి చూసిన వారికి ఇది పెద్దగా ఎంటర్టైన్ మెంట్ ఇవ్వదు. కానీ ఫస్ట్ ఓపెనింగ్ సీన్స్ అండ్ క్లైమాక్స్ మాత్రం భిన్నంగా ఉంటాయి. ఓపిక ఉండి ఫ్రీ టైమ్ లో చూడాలనిపిస్తే 'కరోనా పేపర్స్' పై ఓ లుక్కెయండి.


Click it and Unblock the Notifications











