twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెవిలో పువ్వు (మల్లెపువ్వు రివ్యూ)

    By Staff
    |

    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్ :శ్రీ సముద్ర సిల్వర్ స్క్రీన్స్
    తారాగణం:మురళీకృష్ణ,భూమిక,సముద్ర,సుమన్ షెట్టి,ఆర్.కె,సుకుమార్,
    సమీర్,హేమాసుందర్,తిలక్,కోవై సరళ,అభినయశ్రీ,గీతా సింగ్,
    తెలంగాణా శకుంతల,ఫర్జానా తదితరులు.
    కథ :రమేష్ వర్మ
    మాటలు :వేమగిరి
    సంగీతం: ఇళయరాజా
    ఎడిటింగ్: కె.వి.కృష్ణా రెడ్డి
    కెమెరా: అలిల్ భండారి
    పాటలు :వేటూరి
    ఎడిటింగ్ :చందు,నందమూరి హరి
    స్క్రీన్ ప్లే-దర్శకుడు: సముద్ర
    నిర్మాత :మోహన్ వడ్లపట్ల
    రిలీజ్ డేట్: సెప్టెంబర్ 19,2008

    బరాన్ (ఇరానీ),గుమ్రాహ్(హిందీ) సినిమాల కలబోతగా వచ్చిన 'మల్లెపువ్వు' చిత్రం కంగాళీగా తయారై ప్రేక్షకులను కంగారుపెడుతోంది. సమకాలీన అంశం నెపంతో బంగ్లా టెర్రరిజాన్ని చూపిన ఈ సినిమాలో ఆ అంశంపై స్పష్టమైన అవగాహన లేకపోవటం, స్క్రీన్ ప్లే లోపం ఈ సినిమాను సహన పరీక్షగా మార్చాయి.

    తాపీ పని చేసుకునే కోటికి (మురళీకృష్ణ)కి దుబాయి వెళ్ళాలనేది జీవితాశయం. అయితే అనుకోకుండా అతని జీవితంలోకి ప్రవేశించినమల్లి(భూమిక) తో ప్రేమలో పడతాడు. ఈలోగా ఆమె కోసం పోలీసులు,తీవ్రవాదులు వెతుకుతూంటరు.ఇంతకీ ఆమె ఎవరు...అతనేం చేసి ఆమెను రక్షించుకున్నాడు మిగతా కథ.

    ప్రేమ కథగా మొదలై తర్వాత టెర్రరిస్టు ట్విస్టుతో వేడెక్కుతుందని తయారు చేసుకున్నట్లు అనిపించే ఈ కథలో స్క్రీన్ ప్లే నే ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా అనుకోకుండా మగ వాడి వేషంలో వచ్చిన భూమిక ఎవరు? ఆమె అసలు అక్కడికి ఎందుకలా రావల్సి వచ్చింది? అన్న ఎలిమెంటుని రైజ్ చేస్తూ గడిపేసారు. తర్వాత తాపీగా సెకెండాఫ్ లో ఆమె ఫ్లాష్ బ్యాక్ రివిల్ చేసి,ఆమె సమస్యను చెపుతాడు. అంటే సమస్యలోకి కథ ప్రవేశించే సరికే ప్రి క్లైమాక్స్ కి సినిమా చేరుకుంది. దాంతో సమస్యతో హీరో,హీరోయిన్స్ పోరాడటమే అనే అంశమే కనపడకుండా పోయింది. దాదాపు ఇలాంటి టెన్షన్ ఎలిమెంట్ తో వచ్చిన ఒక్కడు లో అయితే భూమికను మహేష్,ప్రకాష్ రాజ్ నుండి రక్షించి అతనికి సవాల్ విసరటమనేది ఫస్టాఫ్ సగంలోనే జరిగి ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అదే ఇక్కడ మిస్సైంది. టోటల్ డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది.

    ఇక ఈ సినిమాలో మరో పెద్ద డ్రాబ్యాక్ డైలాగులు. నవల్లో వాక్యాల్లా అవి నసుగుతూ ఎంతసేపున్నా విసిగిస్తూ ఉంటాయి. ఫస్టాఫ్ లో అయితే పెద్ద సంత గోలలా ఈ మాటలు విసిగిస్తాయి. అలాగే సముద్ర నటన ఎనభైల్లో కనపడే త్యాగపూరిత హీరో పాత్రను పేరడీ చేసినట్లు నవ్విస్తూంటుంది తప్ప ఎక్కడా ఇన్వాల్స్ కానీయదు. వేణు మాధవ్ కామిడీ ఎందుకు పెట్టారో దర్శక,నిర్మాతలకే తెలియాలి. భూమిక తాను నటిస్తున్నాననే సంగతి అనుక్షణం గుర్తుపెట్టుకుని ఏక్టింగ్ చేసినట్లు తెలిసిపోతోంది. మురళీకృష్ణ కొత్తవాడు గాబట్టి మాట్లాడే పనిలేదు. ఇళయరాజా సంగీతం కూడా తేలిపోయింది. టోటల్ గా అన్నిశాఖలు వీక్ . పబ్లిసిటీ బాగా చేస్తున్నారు. పోస్టర్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేసారు. రమేష్ వర్మ గతంలో డిజైనర్ గా పనిచేసిన అనుభవం ఉపయోగపడి ఉండవచ్చు.

    పూర్తి స్ధాయి నీరసంగా ఉన్న ఈ సినిమాను ఎవాయిడ్ చేయిటమే మేలు. ఇప్పటికే మల్లెపూవు చూసినవారు 'బరాన్' సినిమా చూస్తే కాస్త మనస్సు శాంతిస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X