twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Malli Modalaindi movie review సెన్సిబుల్, మెచ్యుర్డ్ ఫ్యామిలీ, లవ్ డ్రామా.. మెప్పించిన సుమంత్

    |

    Rating: 2.75/5

    దేశవ్యాప్తంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ విస్తృతి, పరిధి పెరగడంతో యువ దర్శకులు, నిర్మాతలు విభిన్నమైన, విలక్షణమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కంటెంట్ బాగుంటే.. చిన్న చిత్రమా? భారీ బడ్జెట్ చిత్రమా? అనే తేడా లేకుండా సినిమాకు పట్టం కడుతున్నారు. ఇలాంటి కోవలోనే వచ్చిన చిత్రం మళ్లీ మొదలైంది. సుమంత్, వర్షిణి సౌందర్‌రాజన్, నైనా గంగూలి, పావని రెడ్డి, సుహాసిని, మంజులా ఘట్టమనేని లాంటి నటీనటులు నటించిన ఈ చిత్రం Zee 5 ఓటీటీలో ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిది. ఈ సినిమా ఎలాంటి అనుభూతిని పంచిందంటే..

    మళ్లీ మొదలైంది సినిమా కథ ఇదే..

    మళ్లీ మొదలైంది సినిమా కథ ఇదే..


    విక్రమ్ (సుమంత్ కుమార్) వృత్తిరీత్యా చెఫ్. తన సహచరి ఉద్యోగిని నిషా (వర్షిణి సౌందర్‌రాజన్)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటారు. కానీ దాంపత్య జీవితంలో అభిప్రాయ బేధాలు తలెత్తి విడాకులు తీసుకొంటారు. అయితే తన తరఫున విడాకుల కేసును వాదించిన లాయర్ పవిత్ర అలియాస్ పవ్వి (నైనా గంగూలీ)తో ప్రేమలో పడుతారు. ఏడాదిపాటు సహజీనం చేసుకొన్న తర్వాత వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొంటారు. ఈ క్రమంలో పవ్వికి మరొకరితో ఎంగేజ్‌మెంట్ అవుతుంది.

    మళ్లీ  మొదలైంది మూవీలో ట్విస్టులు

    మళ్లీ మొదలైంది మూవీలో ట్విస్టులు

    భార్య నిషాతో విక్రమ్‌ ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది? తాను అమితంగా ఇష్టపడే నిషాను ఏ పరిస్థితుల్లో వదులుకొన్నాడు? లాయర్ పవిత్రతో ఎలా? ఎందుకు ప్రేమలో పడ్డాడు? ఏడాదిపాటు సహజీవనం చేసిన తర్వాత ఎందుకు విడిపోవాలనుకొన్నాడు? విక్రమ్ జీవితంలో స్నేహితురాలు వైష్ణవి (పావని రెడ్డి) పాత్ర ఏమిటి? రెండుస్లారు బ్రేకప్ చోటుచేసుకోవడంతో విక్రమ్ పరిస్థితి ఏమైంది. చివరకు విక్రమ్ జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే మళ్లీ మొదలైంది సినిమా కథ.

    మూవీ ఎలా ఉందంటే?

    మూవీ ఎలా ఉందంటే?

    అతి సున్నితమైన రిలేషన్‌షిప్స్, సెన్సిబుల్ పర్సన్స్ మధ్య సెన్సిటివ్ అంశాలతో రూపొందిన చిత్రం మళ్లీ మొదలైంది. చివరి 30 నిమిషాల్లో దర్శకుడు టీజీ కీర్తికుమార్ కథను ముందుకు తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది. అత్యంత భావోద్వేగంతో కథకు మంచి జస్టిఫికేషన్‌తో ఎండ్ కార్డు వేసిన తీరు ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. నిషా, పవిత్ర, వైష్ణవి పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. సుహాసిని, మంజుల ఘట్టమనేని పాత్రలను తీర్చిదిద్దిన తీరు.. కథలోకి జొప్పించిన తీరు ఆకట్టుకొనేలా ఉంది. కథలో రీసెట్ కాన్సెప్ట్ బాగుంది.

    సుమంత్ ఫెర్ఫార్మెన్స్

    సుమంత్ ఫెర్ఫార్మెన్స్


    సున్నిత మనస్కుడైన విక్రమ్ పాత్రలో సుమంత్ సినిమా భారాన్ని తన భుజాల మీద మోశాడు. కీలకమైన సన్నివేశాల్లో పరిపక్వతతో కూడిన నటనను ప్రదర్శించాడు. మరోసారి గోదావరి, మళ్లీ రావే చిత్రంలో తన పాత్రను గుర్తు తెచ్చుకొనేలా సుమంత్ తన నటనతో ఆకట్టుకొన్నాడు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు జెంటిల్మన్‌గా తన ఫెర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ చూపించాడు.

    వర్షిణి సౌందర్‌రాజన్,  నైనా గంగూలీ, పావని రెడ్డి గురించి

    వర్షిణి సౌందర్‌రాజన్, నైనా గంగూలీ, పావని రెడ్డి గురించి

    భర్తను నుంచి అతిగా ఆశించి భంగపడే ప్రతీ సాధారణ మహిళ పాత్రలో వర్షిణి సౌందర్‌రాజన్ ఒదిగిపోయింది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన వర్షిణి.. భావోద్వేగమైన పాత్రలు లభిస్తే సత్తా చాటుతానని నిషా పాత్రతో సినీ వర్గాలకు సంకేతాలను ఇచ్చిందనే అభిప్రాయం కలుగుతుంది. ఇక పవిత్ర పాత్రలో నైనా గంగూలి మెచ్యుర్డ్ పెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించింది. ఇక వెన్నెల కిషోర్.. మోటివేషనల్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఆకట్టుకొన్నాడు. తనదైన పంచులతో హాస్యాన్ని పండించాడు. అన్నపూర్ణ తన తరహా కామెడీతో సన్నివేశాలను ఫీల్‌గుడ్‌గా మార్చింది. సుహాసిని, మంజుల తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.

    సాంకేతిక నిపుణుల ప్రతిభ గురించి

    సాంకేతిక నిపుణుల ప్రతిభ గురించి

    ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అనూప్ రూబెన్ అందించిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఫీల్‌గుడ్‌గా మార్చింది. శివ జీఆర్ఎణ్ సినిమాటోగ్రఫి బాగుంది. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ బాగుంది. కిచెన్, హోం అంబియెన్స్ విషయంలో అర్జున్ సురిశెట్టి పనితనం ఆకట్టుకొంది. నిర్మాత రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఫైనల్ జడ్జిమెంట్

    ఫైనల్ జడ్జిమెంట్

    రిలేషన్‌షిప్ నేపథ్యంగా వచ్చే సినిమాలు అడల్డ్ కంటెంట్‌, అసభ్యమైన సంభాషణలతో చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో బంధాలు, ప్రేమ, సహజీవనం కాన్సెప్ట్ వచ్చిన మళ్లీ మొదలైంది చిత్రం క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా మళ్లీ మొదలైంది చిత్రాన్ని తెరకెక్కించారు. కాస్త అక్కడక్కడ స్లోగా అనిపించినా.. మేకింగ్‌లో ప్యూరిటీ కనిపిస్తుంది. ఓటీటీలో రిలీజైంది కాబట్టి.. సినిమాను చూసేంత టైమ్‌ను సెట్ చేసుకొంటే.. తీరిగ్గా ఫ్యామిలీతో సన్నివేశాలను ఎంజాయ్ చేయవచ్చు. సో డోంట్ మిస్.. ఈ వీకెండ్‌లో ఫీల్ గుడ్ మూవీకి కేరాఫ్ అడ్రస్ మళ్లీ మొదలైంది అని కాన్ఫిడెన్స్‌గా చెప్పవచ్చు.

    మళ్లీ మొదలైంది మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    మళ్లీ మొదలైంది మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: సుమంత్, వర్షిణి సౌందర్‌రాజన్, నైనా గంగూలీ, సుహాసిని, అన్నపూర్ణ తదితరులు
    రచన, దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్
    నిర్మాత: కే రాజశేఖర్ రెడ్డి
    సీఈవో: చరణ్ తేజ్ (రెడ్ సినిమాస్)
    మ్యూజిక్: అనూప్ రూబెన్స్
    సినిమాటోగ్రఫి: శివ జీఆర్ఎన్
    ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్,
    ఆర్ట్: అర్జున్ సురిశెట్టి
    సాహిత్యం: కృష్ణ చైతన్య
    ఓటీటీ రిలీజ్: జీ5
    ఓటీటీ రిలీజ్ డేట్: ఫిబ్రవరి 2022

    English summary
    Tollywood Hero Sumanth's Malli Modalaindi released on ZEE OTT on February 11th. Directed by TG Keerthi Kumar, the Telugu-language film has been produced by K Rajasekhar Reddy of ED Entertainment. Anup Rubens has composed its music. Here i ths Telugu filmibeat exclusive review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X