Malli Pelli Review.. పవిత్ర లోకేష్ జీవితం అలా నాశనమైందా? మళ్లీ పెళ్లి మూవీ ఎలా ఉందంటే?
Rating: 2.75/5
వైవాహిక జీవితంలో చోటుచేసుకొన్న సమస్యలతో బాధపడే తెలుగు నటుడు నరేంద్ర (వీకే నరేష్) అసంతృప్తితో లైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. వేల కోట్ల ఆస్తులు ఉన్న ఆయన జీవితంలో ప్రశాంతత కోసం వెతుకుతుంటాడు. ఆ క్రమంలో కన్నడ నటి పార్వతి (పవిత్ర లోకేష్) తో జరిగిన పరిచయం నరేంద్రకు జీవితంపై ఆశలు చిగురిస్తాయి. పార్వతితో రిలేషన్ బయటపడిన తర్వాత నరేంద్రను ఆయన భార్య సౌమ్య సేతుపతి (వనితా విజయ్ కుమార్) టార్గెట్ చేస్తుంది.
నరేంద్ర, సౌమ్య మధ్య అఫైర్ ఎలా మొదలైంది? వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? పెళ్లి తర్వాత నరేంద్రకు, రమ్యకు ఎలాంటి విభేదాలు తలెత్తాయి? పార్వతితో నరేంద్ర పరిచయం ప్రేమగా ఎలా మారింది? పార్వతి దాంపత్య జీవితంలో చోటు చేసుకొన్న చేదు సంఘటనలు ఏమిటి? పార్వతి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకొన్నది? చనిపోవాలని నిర్ణయించుకొన్న పార్వతికి నరేంద్ర ఎలా అండగా నిలిచాడు. పార్వతి, నరేంద్ర బంధానికి సౌమ్య ఎలా అడ్డుగోడలా నిలువాలని ప్రయత్నించింది అనే ప్రశ్నలకు సమాధానమే మళ్లీ పెళ్లి సినిమా కథ.

పార్వతి, నరేంద్ర మధ్య ఓ ఎమోషనల్ పాయింట్‌తో మొదలుపెట్టి ఫ్యాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లిన విధానం కథలో ప్రేక్షకుడిని లీనమయ్యేలా చేస్తుంది. ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఎమోషన్ సహజంగానే ప్రేక్షకుడికి ఫన్‌గా మార్చుతుంది. ఫస్టాఫ్‌లో నరేంద్ర తల్లి ప్రముఖ డైరెక్టర్ విమల, ఆమె సహజీవిత భాగస్వామి సూపర్ స్టార్ ఎపిసోడ్ కథలో ఫ్యాన్సీగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో పార్వతి జీవితంలో జరిగిన సంఘటనలు చాలా కొత్తగా ఉండటమే కాకుండా కథకు బలంగా మారిందనే ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో సినిమాటిక్, డ్రామా ఎలిమెంట్స్ కొంత రొటీన్‌గా అనిపిస్తాయి. వీకే నరేష్, పవిత్రా లోకేష్ తమ బంధానికి జస్టిఫికేషన్ ఇచ్చేలా పాజిటివ్ యాంగిల్ కనిపిస్తుంది.
వీకే నరేష్, పవిత్రా లోకేష్ వాస్తవ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఎంఎస్ రాజు అల్లుకొన్న కథ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎమోషనల్ సంఘటనలను బేస్ చేసుకొని రాసుకొన్న సీన్లు తెర మీద బాగా పండించారనే చెప్పాలి. కథను నడిపించిన విధానం ఎంఎస్ రాజు తన క్రాఫ్ట్ మీద ఉన్న కమాండ్‌ను తెలియజెప్పింది. దాదాపు అందరికి తెలిసిన కథను ఇంట్రెస్టింగ్‌గా మలిచడంలో ఎంఎస్ రాజు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. పవిత్రా లోకేష్ పోషించిన పార్వతి క్యారెక్టర్ జీవితానికి సంబంధించిన కంటెంట్‌ను ఈ సినిమాకు బ్యూటీగా చేయడంలో ఎంఎస్ రాజు అనుభవం ప్లస్ అయిందనే అభిప్రాయం కలుగుతుంది.

నరేంద్రగా వీకే నరేష్ మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్‌తో హుందాగా కనిపిస్తాడు. ఫన్, ఎమోషన్స్‌తో కూడిన పాత్రలో ఒదిగిపోయాడని చెప్పవచ్చు. సౌమ్యతో బెడ్ రూమ్ సీన్‌లో వీకే నరేష్ ఫెర్ఫార్మెన్స్ చాలా ఎమోషనల్ చేశారు. సౌమ్య తనను తన్నిన సీన్‌లో నేను ఎవరో తెలుసా? అంటూ పలికించిన హావభావాలు, తల్లి విమలమ్మతో ఉండే సీన్లు భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇక సెకండాఫ్‌లో పార్వతి భర్త ఇంటికి వెళ్లిన సీన్ నరేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ చెప్పిన తీరులో ఫర్‌ఫెక్షన్ కనిపిస్తుంది.
పార్వతి (పవిత్రా లోకేష్) యంగ్ క్యారెక్టర్‌లో కనిపించిన అనన్య నాగళ్ల ఈ సినిమాకు మంచి గ్లామర్ కంటెంట్‌ను యాడ్ చేసింది. గ్లామర్‌తోపాటు తన పాత్రకు పరిధి ఉన్నంత మేరకు మంచి యాక్టింగ్‌తో ఆకట్టుకొన్నారు. రెయిన్ సాంగ్‌లో అనన్య నాగళ్ల ఇప్పటి వరకు కనిపించని విధంగా హాట్ హాట్‌గా కనిపించింది. భర్తతో సాన్నిహిత్యం కోసం పరితపించే భార్యగా ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది.
వీకే నరేష్‌తో రిలేషన్ కారణంగా పవిత్రా లోకేష్‌పై ఒకరకమైన ఇమేజ్ ఇప్పటి వరకు ఉంది. పార్వతి పాత్ర ద్వారా తనపై ఉన్న నెగిటివ్ ఇమేజ్‌ను తగ్గించుకొనే ప్రయత్నం చేశారనిపిస్తుంది. అగ్ర కులం, తక్కువ కులం మధ్య మ్యారేజ్ లైఫ్‌లో నలిగిన పోయిన పార్వతి పాత్రలో పవిత్రా లోకేష్ ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించిదనే ఫీలింగ్ కలుగుతుంది. పార్వతి క్యారెక్టర్ ద్వారా మంచి సానుభూతిని పొందేలా పవిత్ర లోకేష్ నటన ఉంది. విజయ నిర్మల క్యారెక్టర్ బేస్ చేసుకొని చేసిన విమలమ్మ పాత్రలో జయసుధ ఆకట్టుకొన్నది. కృష్ణగా శరత్ బాబు అతిథి పాత్రకే పరిమితం కావడం వల్ల ఆయన పెద్దగా ప్రాధాన్యం లేకపోయింది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్ కథను సాఫీగా, ఎమోషనల్‌గా నడిపించేలా చేసింది. సినిమాటోగ్రాఫర్ బాలిరెడ్డి వర్క్ చాలా రిచ్‌గా ఉండటమే కాకుండా స్క్రీన్ మొత్తం కలర్‌పుల్‌గా చేసింది. సన్నివేశాల మూడ్‌కు తగినట్టుగా లైటింగ్ వాడుకొన్న విధానం బాగుంది. సిద్దిఖీ ఎడిటింగ్ బాగుంది. విజయకృష్ణా మూవీస్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
లవ్, ఎమోషనల్, మ్యారేజ్ బ్రేకప్ లాంటి అంశాల కూర్పుతో రూపొందిన చిత్రం మళ్లీ పెళ్లి. పక్కాగా వీకే నరేష్, పవిత్ర లోకేష్ జీవితంలో బయటకు తెలిసిన విషయాల వెనుక ఉన్న కారణాలను చెప్పడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తుంది. ఈ కథలో వాస్తవం ఎంత? ఫిక్షన్ ఎంత? అనే విషయాలు దర్శకుడికి వదిలేస్తే.. మంచి ఎమోషనల్ కంటెంట్‌గా సినిమా కనిపిస్తుంది. ముఖ్యంగా మైసూర్ హోటల్‌లో నరేష్, పవిత్ర మీడియాకు దొరికిన ఎపిసోడ్ వెనుక వాస్తవాన్ని బలంగా చెప్పడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. ఆకర్షణగా మొదలైన అఫైర్ అనంతరం పార్వతితో నరేంద్ర ఎందుకు ఎమోషనల్ కనెక్ట్ అయ్యాడు? ఆమెకు ఎందుకు అండగా నిలువాలని ప్రయత్నించారనే పాయింట్ బాగుంది. ఎంఎస్ రాజు సినిమాను తెరకెక్కించిన విధానం.. వనితా విజయ్ కుమార్, నరేష్, పవిత్ర పెర్ఫార్మెన్స్ కోసం మళ్లీ పెళ్లి చూడవచ్చు. మంచి ఫన్‌తో పాటు ఎమోషన్స్ ఒక అనుభూతిని తప్పకుండా ఈ సినిమా పంచుతుంది.


Click it and Unblock the Notifications











