twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుమంత్ ‘మళ్ళీ రావా’ రివ్యూ: సాదా సీదాగా సాగే ప్రేమకథ

    By Bojja Kumar
    |

    Rating:
    2.5/5
    Star Cast: సుమంత్, ఆకాక్ష, సింగ్, అన్నపూర్ణ, కాదంబరి కిరణ్
    Director: గౌతమ్ తిన్నసూరి

    Recommended Video

    'Malli Rava' Movie Filmibeat Review ‘మళ్లీ రావా’ రివ్యూ

    సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న హీరో సుమంత్.... హిట్ అందుకుని చాలా కాలం అయింది. 2011లో వచ్చిన 'గోల్కొండ హైస్కూల్' తర్వాత సుమంత్ ఖాతాలో చెప్పుకోదగ్గ సినిమా పడలేదు. కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా కేవలం మల్టీ‌ప్లెక్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సబ్జెక్టులను మాత్రమే ఎంచుకుంటున్న ఈ అక్కినేని ఫ్యామిలీ స్టార్... ఈ సారి 'మళ్లీ రావా' అనే ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమా విశేషాలు ఏమిటో రివ్యూలో చూద్దాం....

    కథ విషయానికొస్తే...

    కథ విషయానికొస్తే...

    రాజోలులో పెరిగిన కార్తీక్ (సుమంత్) 9వ తరగతిలోనే తన క్లాసులో కొత్తగా చేరిన అంజలి (ఆకాంక్ష సింగ్)పై ఇష్టం పెంచుకుంటాడు. అంజలికి కూడా కార్తిక్ అంటే చాలా ఇష్టం. వీరి విషయం స్కూల్లో ప్రిన్సిపల్‌కు తెలియడంతో ఇద్దరి పేరెంట్స్‌ను పిలిపించి మందలిస్తాడు. ఆ తర్వాత అంజలి ఫ్యామిలీ రాజోలు నుండి ముంబై వెళ్లి పోతారు. ఆ తర్వాత అంజలి అమెరికాలో సెటిలవుతుంది. చదువులో పెద్దగా టాలెంట్ లేని కార్తీక్ ఫ్రెండ్ సహాయంతో హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు.

    లైఫ్ అలా సాగిపోతుండగా ఓసారి అనుకోకుండా కార్తీక్ పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఆఫీసుకు అంజలి ఓ ప్రాజెక్ట్ పనిమీద వస్తుంది. చాలా కాలం తర్వాత కలిసిన ఇద్దరూ ప్రేమలో పడతారు. అమెరికా వెళ్లే లోపే కార్తీక్ ను పెళ్లాడి అతడిని డిపెండెంట్ వీసా మీద అమెరికా తీసుకెళ్లి అక్కడే సెటిలవ్వాలనుకుంటుంది అంజలి. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లికి అంతా సిద్ధమైన తర్వాత చివరి నిమిషంలో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి అమెరికా వెళ్లి పోతుంది. కార్తీక్ అంటే ఎంతో ఇష్టపడే అంజలి ఎందుకు అలా చేసింది? ఈ ప్రేమకథా చిత్రం చివరకు ఎలా సుఖాంతం అయింది అనేది తెరపై చూడాల్సిందే.

    హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్

    హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్

    కార్తీక్ పాత్రలో సుమంత్ తన సహజమైన పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా చెప్పుకోదగ్గ సీన్లు అయితే ఏమీ లేవు. లుక్ పరంగా జస్ట్ ఓకే. ఇక ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఆకాంక్ష సింగ్.... అటు అందం పరంగాను, పెర్ఫార్మెన్స్ పరంగానూ పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాలో ఇంతకు మించి చెప్పుకోదగ్గ పాత్రలు ఏమీ లేవు.

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బావుంది. శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రేమ కథా చిత్రాల్లో మనసుకు హత్తుకునే డైలాగులు ఉంటే ఆ ఫీల్ మరోలా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో అలాంటివేమీ కనిపించలేదు. ఇక ఎడిటింగ్ విషయంలో కూడా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

    రోటీన్ తెలుగు ప్రేమ కథ

    రోటీన్ తెలుగు ప్రేమ కథ

    ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీయాలనే ఉద్దేశ్యంతో ‘మళ్ళీ రావా' కథ రాసుకున్న దర్శకుడు దాన్ని కొత్తగా ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలం అయ్యాడు. రోటీన్‌గా తెలుగు సినిమాలో కనిపించే సీన్లు, కాన్సెప్టునే తన సినిమాలో పెట్టడం కాస్త నిరాశ పరిచే అంశమే.

    ఆసక్తికరంగా లేని స్క్రీన్ ప్లే

    ఆసక్తికరంగా లేని స్క్రీన్ ప్లే

    ఇలాంటి ప్రేమకథను ఎంచుకున్నపుడు స్క్రీప్లే ఆసక్తిగా ఉండాలి. కథను డెప్త్‌గా తీసుకెళ్లి ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యేలా చేయడం, లేదా ఎంటర్టెన్మెంట్ జోడించి ఫన్ క్రియేట్ చేయడం లాంటివి ఉంటే ఆసక్తిగా ఉంటుంది. అయితే ఈ రెండూ సినిమాలో లోపించాయి.

    సినిమా చాలా స్లోగా....

    సినిమా చాలా స్లోగా....

    సినిమా మొదటి నుండి, చివరి వరకు చాలా స్లోగా సాగింది. ఎక్కడా కూడా కథ వేగంగా సాగిన ఫీలింగ్ కలగదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆసక్తికరంగా లేదు.

    ఫస్టాఫ్, సెకండాఫ్

    ఫస్టాఫ్, సెకండాఫ్

    సాధారణంగా తెలుగు సినిమాల ఫార్మాట్లో ఆలోచిస్తే... ఫాస్టాఫ్‌లో కొంత కథ చెప్పి, ఇంటర్వెల్‌లో కాస్త సస్సెన్స్ క్రియేట్ చేసి, సెకండాఫ్‌లో ప్రేక్షకుడు సంతృప్తి చెందేలా స్టోరీ నేరేట్ చేయడం లాంటివి చేస్తారు. అయితే ఈ సినిమా విషయంలో ఫస్టాఫ్, సెకండా అనే అనే తేడా కనిపించదు. ఇంటర్వెల్ కోసం ఏదో గ్యాప్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసి....డైరెక్టర్ తాను చెప్పదలుచుకున్నది చెప్పుకుంటూ వెళ్లి పోయాడు.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    హీరో సుమంత్
    బ్యాగ్రౌండ్ స్కోర్
    సినిమాటోగ్రఫీ

    మైనస్ పాయంట్స్

    కథ, స్క్రీన్ ప్లే
    ఎడిటింగ్
    స్లో నేరేషన్

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    చివరగా ఈ సినిమా గురించి చెప్పాలంటే..... రోటీన్‌గా సాగే ప్రేమకథా చిత్రం. సగటు ప్రేక్షకుడిని సర్‌ప్రైజ్ చేసే ఎలిమెంట్స్, భావోద్వేగానికి గురిచేసే సీన్లు ఏమీ లేవు. ఎంటర్టెన్మెంట్, కమర్షియల్ అంశాలుకూడా లోపించడంతో యూత్, మాస్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందని చెప్పలేం.

    నటీనటులు

    నటీనటులు

    సుమంత్, ఆకాక్ష, సింగ్, అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తిక్ అడుసుమల్లి, మాస్టర్ సాత్విక్, బేబీ ప్రీతి ఆస్రాని తదితరులు నటిస్తున్నారు.

    తెర వెనక

    తెర వెనక

    ఈ చిత్రానికి డీఓపీ: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఎడిటింగ్: సత్య గిడుతూరి, లిరిక్స్: కృష్ణ కాంత్, నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క, కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: గౌతమ్ తిన్న సూరి.

    Read more about: sumantha malli raava tollywood
    English summary
    Actor Sumanth latesh movie Malli Rava movie released today. Akanksha Singh is the female lead who is making her debut with the movie. Sumanth who failed to score a hit with the remake of Vicky Donor is now seriously hoping for a hit with Malli Rava.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X