బోరింగ్ బ్యూరో! (మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో రివ్యూ)

By Bojja Kumar

ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో శ్రీకాంత్ పరిస్థితి ఎలా తయారైందంటే....ఆయన ఏదైనా కొత్త కాన్సెప్టుతో వస్తే జనాలు చూసే పరిస్థితి లేదు. ఇక యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు ప్రస్తుతం ఆయనకు సూటవ్వడం కష్టమే. లవ్ స్టోరీలు చేసే వయసు కాదాయే. దీంతో ఆయన వద్దకు వచ్చే వన్నీ టైంపాస్ బటానీ స్టోరీలే అవుతున్నాయి. రొటీన్ స్టోరీలకే కాస్త మేకప్ వేసి తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమా కూడా అలానే ఉంది.

'మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో'కి యజమాని మనీ మైండెడ్ మ్యారేజ్ బ్రోకర్ మల్లిగాడు(శ్రీకాంత్). డబ్బు లిస్తే ఎలాంటి సంబంధాలైనా సెట్ చేస్తాడు. తాను చేసే పెళ్లిళ్లకి ఒక సంవత్సరం గ్యారంటీ కూడా ఇస్తుంటాడు. ఇలా డబ్బులు తీసుకుని కొందరికి పెళ్లి సంబంధాలు సెట్ చేస్తానని మాటిస్తాడు. మాట నిలబెట్టుకునే క్రమంలో ఇబ్బందులో పడతాడు. మరి మల్లిగాడు ఆ ఇబ్బందుల నుండి ఎలా బయట పడ్డాడు? అనేది ఫైనల్ స్టోరీ.

శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.... అదిరిందీ అని చెప్పలేం, చెత్తగా ఉందని చెప్పలేం. ఎప్పటిలాగే రొటీన్‌గా నటించాడు. ఆయన బాడీ లాంగ్వేజ్‌లో కానీ, క్యారెక్టరైజేషన్లో అస్సలు వేరియేషన్ లేదు. దీంతో శ్రీకాంత్ పాత సినిమా ఏదో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇక హీరోయిన్‌గా నటించిన మనో చిత్ర నటించడానికి పెద్దగా అవకాశం లేక పోయినా, గ్లామర్ పరంగా ఫర్వేలేదు అనిపించింది. బ్రహ్మానందం కోసం అయినా ప్రేక్షకులు వస్తారనే ఆశతో ఆయన క్యారెక్టర్ ప్రత్యేకంగా డిజైన్ చేసారు. కానీ బ్రహ్మీని సరిగా వాడుకోక పోవడంతో పెద్దగా కామెడీ పండలేదు. పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ నారాయణ, తెలంగాణ శంకుతల, కాశీవిశ్వనాథ్ తమ తమ పాత్రల్లో అలా సాగి పోయారు.

అసలే స్టోరీ ఏదో పాత కథకు కాస్త మార్పులు చేసి తీసుకొచ్చినట్లుంది. దర్శకుడు ఉదయ్ రాజ్ కనీసం స్క్రీన్ ప్లే పరంగా కూడా నెట్టుకురావడంలో విఫలం అయ్యాడు. డైలాగులు, సంగీతం కూడా ఆకట్టుకునే విధంగా లేవు. ఇతర టెక్నికల్ విభాగాలన్నీ సరేసరి. అక్కడక్కడ కొన్ని సీన్లు మాత్రం కాస్త నవ్విస్తాయి. బలంలేని కథ, వీక్ స్క్రీన్ ప్లే, వీక్ డైరెక్షన్ ఓవరాల్‌గా మల్లిగాడు మ్యారేజ్ బ్యూరోను బోరింగ్ బ్యూరోగా మార్చాయి.

బ్యానర్ :హరిత ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: శ్రీకాంత్, మనోచిత్ర, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి, కాశీ విశ్వనాథ్, తెలంగాణ శకుంతల, సాయి, కల్కి రాజా, శిరీష, ఫిష్ వెంకట్, మధుమణి, రాఘవ, నండూరి రాము తదితరులు
మాటలు: దాసరి బ్రహ్మానందం, ఎం. అశ్విన్‌కుమార్
సంగీతం: రఘు రాం
ఛాయాగ్రహణం: వాసు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాలాజీ శ్రీను
నిర్మాతలు: మల్లెల సీతారామరాజు, స్వాతి పిల్లాడి
కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం : ఉదయ్‌రాజ్
విడుదల తేదీ: 07,పిభ్రవరి 2014

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X