Allu Aravind Review on MSVPG: మన శంకర వరప్రసాద్ గారు మూవీపై అల్లు అరవింద్ రివ్యూ.. బాస్ చించేశాడు అంటూ!
మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). తన కెరీర్‌లో 157వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు వరుస సక్సెస్‌లతో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మించారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటించారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేశారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్లు జనవరి 11వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించారు.

మెగాస్టార్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో 80, 90 నాటి ప్రేక్షకులు ఈ మూవీకి పోటెత్తారు. అంతేకాకుండా సినిమా సెలబ్రిటీలు ప్రీమియర్లను చూసేందుకు భారీగా తరలివచ్చారు. అయితే ఈ సినిమాను చిరంజీవి బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వీక్షించారు. ఈ సినిమా చూసిన తర్వాత కొంత ఎగ్జైటింగ్, ఎమోషనల్ అయ్యారు. తన తరహాలో ఈ సినిమా గురించి రివ్యూ చేశారు. అల్లు అరవింద్ ఈ సినిమా గురించి చెప్పిన వివరాల్లోకి వెళితే..
మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన అల్లు అరవంద్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమా చూసిన తర్వాత కొంచెం ఎగ్జైట్ అయ్యాను. బాస్ చించేశాడు. బాస్ ఈజ్ బాస్. పాత చిరంజీవిని చూసే అవకాశం కలిగింది. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి సినిమాలు చూసినప్పుడు కలిగిన అనుభూతి, ఆనందం కలిగింది. అప్పటి అనుభూతులు, అనుభవాలు మళ్లీ గుర్తుకు వచ్చాయి అని అల్లు అరవింద్ ఎమోషనల్ అయ్యారు.
మన శంకర వరప్రసాద్ సూపర్ హిట్ ఫిల్మ్. బాస్ అంటే ఎప్పటికే బాసే. సినిమా ఎక్సలెంట్‌గా ఉంది. మెగాస్టార్ వింటేజ్ లుక్, డ్యాన్సులు అన్నీ బాగున్నాయి. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సహా వింటేజ్ ఫీలింగ్ తీసుకొచ్చారు. సినిమా చూస్తున్నంత సేపు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏం ఆలోచించాడు అనే ఫీలింగ్ కలిగింది. ఎక్సలెంట్‌గా ఉంది. సినిమా వెరీ గుడ్. వెంకటేష్ ఎంట్రీ, చిరుతో కాంబినేషన్, క్లైమాక్స్ అదిరిపోయింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు పైసా వసూల్ ఫీలింగ్ కలుగుతుంది అని అల్లు అరవింద్ తన రివ్యూను వెల్లడించారు.
హైదరాబాద్‌లో ప్రదర్శించిన ఈ సినిమా ప్రీమియర్లు, తొలి స్పెషల్ మార్నింగ్ షోలకు సెలబ్రిటీలు పోటెత్తారు. ప్రీమియర్ షోను దిల్ రాజు దంపతులు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కమెడియన్ సత్య, కోన వెంకట్ లాంటి ప్రముఖులెందరో ఈ సినిమాను వీక్షించారు. చాా మంది సెలబ్రిటీలు ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. ఈ సినిమా తొలి ఆట నుంచే భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమా కలెక్షన్లు సంచలనాత్మక రీతిలో బాక్సాఫీస్ వద్ద నమోదు అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











