Mana Shankara Vara Prasad Garu First Review: మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫస్ట్ రివ్యూ!

మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasadgaru). తన కెరీర్‌లో 157వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు వరుస సక్సెస్‌లతో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేయబోతున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ ఏమిటి? వారి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటి? రన్‌టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Mana Shankara Vara Prasad Garu Review by Censor Board

సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత చిరంజీవితో అనిల్ రావిపూడి పక్కా వినోదాత్మక చిత్రంగా రూపొందించారనే విషయం ప్రోమోలు, పాటలు, తదితర అంశాలు స్పష్టం చేశాయి. గత చిత్రాలకు అనుసరించిన సక్సెస్ ఫార్మూలానే ఈ సినిమాకు ఆయన అనుసరించాడు. ఫన్, ఊరమాస్, ఫ్యామిలీ తరహా రొమాన్స్ అంశాలతో మరోసారి తన అదృష్ట రేఖను బాక్సాఫీస్ వద్ద పరీక్షించుకొనేలా ఈ సినిమాను రూపొందించారనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లోను జరుగుతున్నది.

ఇలాంటి అంచనాల మధ్య ఈ చిత్రాన్ని సెన్సార్ అధికారులు వీక్షించారు. ఈ సినిమాలో అభ్యంతరాలు వ్యక్తం చేసేంత సన్నివేశాలు లేకపోవడంతో ఈ ప్రక్రియ ఫార్మాలిటీగానే జరిగిపోయింది. కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్‌ గురించి సెన్సార్ అధికారులు తమ కన్సర్‌ను తెలియజేశారు. వాటిని సవరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్‌ను అందించారు అనే విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది.

మన శంకర వరప్రసాద్ సినిమా అన్ని కోణాల్లో సమీక్షించిన తర్వాత ఈ చిత్రానికి యూఏ (UA16+) సర్టిఫికెట్ జారీ చేశారు. దాంతో ఈ సినిమాను 16 ఏళ్ల నిండిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. 160 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల అనుమతి, పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుందనే నిబంధనను సెన్సార్ విధించింది. అలా ఈ సినిమా విడుదలకు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొన్నది అని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమా ఆద్యంతం సంక్రాంతి పండుగ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా వినోదానికే పెద్ద పీట వేశారు.నయనతార, వెంకటేష్ లాంటి స్టార్ కాస్ట్ కూడా ఉండటంతో స్క్రీన్ స్పేస్ కూడా పెరిగింది. ఈ సినిమాన ఫైనల్‌గా 2 గంటల 42 నిమిషాల నిడివితో అంటే 162 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఈ సినిమా సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాను కూర్పు చేశారు అనే విషయం ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే అనిల్ రావిపూడి తన సక్సెస్ ఫార్మూలా నమ్ముకొని.. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్, ఆయన స్ట్రెంగ్త్‌ను బలంగా చేసుకొని మెగా అభిమానులను సంతృప్తి పరిచేందుకు ఈ సినిమాను రూపొందించారు. చిరంజీవి, నయనతార కెమిస్ట్రీ, అలాగే కామెడీ సన్నివేశాలు వర్కువుట్ అయితే ఈ సినిమాకు పూర్తిగా పాజిటివ్ ఉంటుంది. వెంకటేష్ అతిథి పాత్ర మెగా, విక్టరీ ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తే బాక్సాఫీస్ వద్ద జోరు కనిపిస్తుంది అనే విషయంపై చర్చ జరుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X