Allu Arjun Review on MSVPG: మన శంకర వరప్రసాద్ మూవీపై అల్లు అర్జున్ రివ్యూ.. Boss Buster అంటూ ఐకాన్ స్టార్
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటూ ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నది. నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద రఫాడిస్తూ ముందుకెళ్తున్నది. ఈ చిత్రం గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రివ్యూను సోషల్ మీడియా ద్వారా అందించాడు. ఈ సినిమా గురించి ఆయన వెల్లడించిన అభిప్రాయం వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి కానుకగా రిలీజైన మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని అల్లు అర్జున్ ఇటీవలే వీక్షించారు. ఆయన తన పుష్ప 2 చిత్రం జపాన్‌లో రిలీజ్ సందర్భంగా ఆయన అక్కడ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పుష్ప 2 సినిమా జనవరి 16వ తేదీన రిలీజైన సందర్భంగా తన కుటుంబ సభ్యులతో జపాన్ దేశంలో పర్యటించారు. అనంతరం ఈ సినిమాను వీక్షించి సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అల్లు అర్జున్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు పెట్టి.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా యూనిట్ మొత్తానికి కంగ్రాట్యులేషన్. తన గ్రేస్‌తో నిప్పు పెట్టినట్టుగా ది బాస్ ఈజ్ బ్యాక్. మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ వైబ్‌తో మరోసారి స్క్రీన్లకు కొత్త వెలుగులు తీసుకు రావడం చాలా సంతోషంగా ఉంది. విక్టరీ వెంకటేశ్ గారు కూడా సినిమాలో రాకింగ్‌గా ఉన్నారు. తుంబా చెన్నాగి మాదిరా వెంకీ గౌడ క్యారెక్టర్ అదరగొట్టారు అని ప్రశంసలు గుప్పించారు.
మన శంకర వరప్రసాద్ చిత్రంలో గ్రేసియష్ ప్రజెన్స్‌తో నయనతార ఆకట్టుకొన్నారు. క్యాథరీన్ త్రెసా కూడా హ్యుమర్‌తో మెప్పించారు. కొరికతాను.. కొరికతాను అంటూ అల్లరి చేసిన సంక్రాంతి స్టార్ బుల్లిరాజు, ఇతర నటీనటులు తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు అని చిత్ర యూనిట్‌ను అభినందించారు.
మెగా విక్టరీ పాట, హుక్ స్టెప్ సాంగ్స్ విజిల్స్ వేసేంతగా ఉన్నాయి. అలాంటి హుషారెత్తించిన పాటలు అందించిన భీమ్స్ సిసిరోలియో గారు, ఇతర టెక్నిషియన్స్ అందరికి కంగ్రాట్యులేషన్. నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి ప్రత్యేకంగా అభినందనలు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడికి బిగ్ కంగ్రాట్యులేషన్. ఆయన సంక్రాంతికి వస్తారు. హిట్ కొడుతారు. రిపీట్ అంటూ కామెంట్ చేశారు.
మన శంకర వరప్రసాద్ కేవలం సంక్రాంతి బ్లాక్ బస్టర్ కానే కాదు. ఇది సంక్రాంతి బాస్ బస్టర్ అంటూ అల్లు అర్జున్ డైలాగ్స్ పేల్చారు. ఈ సినిమాపై అల్లు అర్జున్ తన రివ్యూను అందించి చిత్ర యూనిట్‌ను అభినందించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ సినిమా విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇంకా పలు దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లను నమోదు చేస్తూ సరికొత్త రికార్డుల కోసం పరుగులు పెడుతున్నది.


Click it and Unblock the Notifications











