Mana Shankara VaraPrasad Garu Twitter Review: మన శంకర వరప్రసాద్ గారు మూవీ ట్విట్టర్ రివ్యూ
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్‌స్టార్ నయనతార జంటగా నటిస్తోన్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు, తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారులో టాలీవుడ్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. వీరితో పాటు కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌లు తదితరులు నటిస్తున్నారు.
సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రిలీజ్ అవుతున్నది. అయితే జనవరి 11న రాత్రి ఈ సినిమాకు ముందస్తుగానే ప్రీమియర్లు, పెయిడ్ షోలు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు గురించి నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

మన శంకర వరప్రసాద్ గారు చిత్రం.. సాంగ్స్, ఫైట్ సీక్వెన్స్‌తో కూడిన డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నయనతారు ఇంకొంచెం మెరుగ్గా ఉపయోగించుకుని ఉండాల్సింది. కానీ బాస్ ఈజ్ బ్యాక్. చిరంజీవి గారికి ఇది మరోసారి సంక్రాంతి విజయం. అనిల్ రావిపూడి ఎప్పుడూ నిరాశపరచడు అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
ఇప్పుడే మన శంకర వరప్రసాద్ గారు షో పూర్తయ్యింది. నా రేటింగ్ 3.25/5. ఫస్టాఫ్ బ్లాక్‌బస్టర్, సెకండాఫ్ బాగుంది. చిరు టైమింగ్ సూపర్. వెంకీ సీన్స్‌కి నవ్వులే నవ్వులు. నయనతార యాక్టింగ్ ఫైర్. భీమ్స్ మ్యూజిక్ సూపర్, ఫైనల్‌గా కెప్టెన్ ఆఫ్ ది ఫిప్ అనిల్ రావిపూడికి సెల్యూట్ అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.
బాసు కామెడీ టైమింగ్‌తో నవ్వులే నవ్వులు. సాంగ్స్ బాగున్నాయి. బాస్ స్టెప్స్ మాత్రం ఊర మాస్. ఇది జస్ట్ ఫస్టాఫ్ మాత్రమే. క్లియర్‌గా పొంగల్ విన్నర్ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.
ఫస్టాఫ్ బస్ వన్ మేన్ షో. కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ పర్ఫెక్ట్ టైమింగ్. ప్రతి ఫ్రేమ్‌లో అన్నయ్య ఫైర్. ఇంటర్వెల్‌కు ముందే టికెట్ పైసా వసూల్. బాస్ టైమింగ్ నెక్ట్స్ లెవల్. అనిల్ రావిపూడి బాగా కుక్ చేశాడు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
బాస్ చిరంజీవి గారికి అనిల్ రావిపూడి పొంగల్ హిట్ ఇచ్చారు. కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. బుల్లిరాజు ఎపిసోడ్ నవ్వుల విందు. బీజీఎం, మ్యూజిక్ పాటలు బాగున్నాయి. చిరంజీవి మేనరిజమ్స్ సూపర్. వెంకీ మామ ఎపిసోడ్ అయితే ఫైరే. కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కి పెద్ద రిలీఫ్ అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.
చిరంజీవి స్టైల్ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రతీది చక్కగా కుదిరింది. సూట్స్ ఆయనకు సంపూర్ణంగా నప్పాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సరికొత్త, ఆధునిక శైలిని ప్రతిబింబిస్తుంది అని ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ పెట్టాడు.
ఫస్టాఫ్ సాలీడ్‌గా ఉంది. ఇంట్రో సాంగ్ సూపర్. కామెడీ అదిరిపోయింది. సెకండాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. అనిల్ రావిపూడి ఫైర్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
70వ దశకం నుంచి నేటి వరకు... ఆ గ్రేస్, ఆ స్టైల్, ఆ ఎనర్జీ ఏమాత్రం చెక్కుచెదరలేదు. తరాలు మారినా... మెగాస్టార్ ఎప్పటికీ దిగ్గజంగానే నిలిచిపోతారు.
ఎంటర్‌టైనింగ్ అండ్ ఎంగేజింగ్. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ సినిమాను నడిపించింది అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.
చిరంజీవి లుక్స్ బాగున్నాయి. నయనతార ఇతర నటీనటులు బాగా నటించారు. కామెడీ సీన్స్, ముఖ్యంగా చిరంజీవి - నయనతార మధ్య వచ్చే సీన్స్ డీసెంట్‌గా ఉన్నాయి. మ్యూజిక్ సూపర్. సెకండాఫ్ కథకి కీ టర్నింగ్ పాయింట్ అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











