Mana Shankara Varaprasadgaru Business: మన శంకర వరప్రసాద్ గారు బిజినెస్.. ఏపీ, నైజాం రైట్స్ ఎన్ని కోట్లంటే?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తన కెరీర్‌లో 157 చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasadgaru). ఈ సినిమాకు వరుస సక్సెస్‌లతో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో సందడి చేయబోతున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరిలియో వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత సెట్ అయిందనే వివరాల్లోకి వెళితే..

చిరంజీవి కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో భారీగా తారాగణం, పాపులర్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు. ఈ సినిమా క్వాలిటీ విషయంలో అనిల్ రావిపూడి, సుస్మిత, సాహు రాజీ పడలేదనే విషయం ప్రోమోషనల్ కంటెంట్ చూస్తే స్పష్టమైంది. ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రోమోషనల్ ఖర్చులతో కలిపి 225 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయల మేర అవుతుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో బిజినెస్ వర్గాల్లో భారీ చర్చ, పోటీ నెలకొన్నది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడానికి టాప్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు పోటీపడ్డారు. అయితే నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్నట్టు తెలిసింది.
ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే.. తాజా సమాచారం ప్రకారం.. ఆంధ్రా ప్రాంతపు ప్రీ రిలీజ్ బిజినెస్ 55 కోట్ల రూపాయలుగా, నైజాం రైట్స్ 32 కోట్ల రూపాయలకు, సీడెడ్ హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. దాంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు పెరిగాయి.
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రా, నైజాంలో కలిపి ఈ సినిమా బిజినెస్ మొత్తంగా 105 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 110 కోట్ల రూపాయలుగా ఫిక్స్ చేశారు. అయితే సంక్రాంతి సెలవులు కాబట్టి హిట్ టాక్ పడితే ఈ చిత్రం తొలివారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











