Manamey Review: రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్..శర్వానంద్, కృతి శెట్టీకి హిట్టు పడిందా?

Rating: 2.75/5

నటీనటులు: శర్వానంద్, కృతిశెట్టి, శివ కందుకూరి, త్రిగుణ్, ఆయేషా ఖాన్, ముఖేష్ రుషి, సీత, సుదర్శన్, రాహుల్ రామకృష్ణ తదితరుల
దర్శకత్వం: శ్రీరాం ఆదిత్య
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
బ్యానర్: పీపుల్స్ మీడియా
మ్యూజిక్: యేషమ్ అబ్దుల్ వాహబ్
ఎడిటింగ్:ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫి: విష్ణు శర్మ
రిలీజ్ డేట్: 2024-06-07

విక్రమ్ (శర్వానంద్) లండన్‌లో మద్యం, మగువలే జీవితంగా లైఫ్‌ను ఆస్వాదిస్తుంటాడు. సుభద్ర (కృతిశెట్టి)కి కార్తీక్ (శివ కందుకూరి)తో నిశ్చితార్థం జరుగుతుంది. ఇలాంటి సమయంలో తాను ప్రాణంగా ప్రేమించే స్నేహితుడు అనురాగ్ (త్రిగుణ్) దంపతులు యాక్సిడెంట్‌లో మరణిస్తారు. అయితే అనురాగ్ రెండేళ్ల కొడుకు విక్రమాదిత్య బాధ్యతలు విక్రమ్, సుభద్రపై పడుతాయి. దాంతో యూకే దత్తత నిబంధనల ప్రకారం కేర్ టేకర్స్ ఇద్దరు ఒకే ఇంటిలో కలిసి ఉండాలనే నిబంధన కారణంగా విక్రమ్, సుభద్ర ఒకే చోట నివసించాల్సి వస్తుంది. ఆ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

Manamey Movie Review in Telugu  and Rating  Sharwanand  Kriti Shetty Family Drama

అనురాగ్ ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయాడు? విక్రమ్, సుభద్ర ఎందుకు కేర్ టేకర్‌గా మారాల్సి వచ్చింది. కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత విక్రమ్‌తో కలిసి ఉండాల్సి వచ్చినప్పుడు సుభద్ర ఫీలింగ్ ఏమిటి? విక్రమాదిత్య వల్ల విక్రమ్ ఎలాంటి కష్టాలు పడ్డారు? అప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిన కృతిశెట్టి ప్రేమను విక్రమ్ గెలుచుకొన్నాడా? సుభద్ర ఎవరిని పెళ్లి చేసుకొన్నది. సుభద్ర పెళ్లి తర్వాత విక్రమాదిత్య సంరక్షణ ఎవరు చూసుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే మనమే సినిమా కథ.

ఎలాంటి బాధ్యత లేని యువకుడు తన స్నేహితుడు కోసం తనకు సరిపడని రెస్సాన్స్‌బిలిటీ మోయాల్సి రావడం, అప్పటికే పెళ్లి నిశ్చితార్థం జరిగిన యువతితో కలిసి ఓ యువకుడు ఉండాల్సి రావడం.. వారి మధ్య ప్రేమ చిగురిస్తే.. కామన్‌గా ఆ ఇద్దరు కలవడమనేది కామన్ పాయింట్. అయితే ఆ కథను డెస్టినేషన్‌ను ఎంత బలంగా చెప్పారు. ఎంత ఎమోషనల్‌గా కథను నడిపించారనే విషయంపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అయితే దర్శకుడు రాసుకొన్న కథ, స్క్రీన్ ప్లే రొటీన్‌గా ఉన్నప్పటికీ.. రాసుకొన్న సన్నివేశాలు, డైలాగ్స్ బాగుండటం ఈ సినిమాకు బ్యూటీగా నిలిచాయ. ఇక అందమైన లోకేషన్లలో సినిమా రిచ్‌గా ఉండటం వల్ల సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేసిన తీరు మరో ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

Manamey Movie Review in Telugu  and Rating  Sharwanand  Kriti Shetty Family Drama

ఇక ఫస్టాఫ్ సరదాగా, రొమాంటిక్‌గా గడిచిపోయినప్పటికీ.. సెకండాఫ్ కొంత డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు ఉండే సన్నివేశాలు సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చాయి. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడం వల్ల సినిమా యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇక శర్వానంద్ ఇలాంటి రొమాంటిక్, భావోద్వేగమైన పాత్రలను గతంలో చాలానే చేశాడు.కానీ ప్లేబాయ్, రొమాంటిక్ ఫెల్లోగా చూపించిన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది. ఇక కృతిశెట్టి, ఆయేషా ఖాన్ పాత్రలు గ్లామర్‌తో ఆకట్టుకొన్నాయి. కృతిశెట్టి ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. కార్తీక్‌గా శివ కందుకూరికి ప్రమోషన్ లాంటి క్యారెక్టర్ లభించింది. సుదర్శన్, రాహుల్ రామకృష్ణ ఇతర క్యారెక్టర్లు రొటీన్‌గానే ఉన్నాయి. మిగితా పాత్రల్లో నటించిన వారందరూ ఒకే అనిపించారు.

Manamey Movie Review in Telugu  and Rating  Sharwanand  Kriti Shetty Family Drama

ఇక టెక్నికల్‌గా ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ ప్లస్ పాయింట్. ఈ సినిమా ఫీల్ గుడ్‌గా అనిపిస్తే.. అందుకు కారణం డైలాగ్స్. రిచ్ లొకేషన్లు, ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తీయడంతో.. చాలా రిచ్‌గా ఉంది. పీపుల్స్ మీడియా, విశ్వప్రసాద్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

లవ్, రొమాంటిక్, ఎమోషనల్ అంశాలు కలిసి ఉన్న చిత్రం మనమే. బాధ్యత అంటే తెలియని ఓ యువకుడు ఓ రెండేళ్ల పిల్లాడిని సంరక్షణ చేసే అంశం కొత్తగా అనిపిస్తుంది. మిగితాది అంతా రొటీన్‌గానే అనిపిస్తుంది. ఈ వారం ఫ్యామిలీ ఆఢియెన్స్‌కు క్లీన్ ఎంటర్‌టైనర్ చూడాలంటే.. ఎలాంటి ఆలోచనలేకుండా థియేటర్లలో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X