twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనసిస్తే...నిరాశే!

    By Staff
    |

    Manaista ra
    -జలపతి
    చిత్రం: నా మనసిస్తా..రా!
    నటీనటులు: శ్రీకాంత్‌, సౌందర్య, రిచా,
    కోట, చరణ్‌ రాజు, పృథ్వీ.
    మాటలు: జంధ్యాల
    సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌
    నిర్మాత: ఎం.సుధాకర్‌
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: షిండే

    అబ్సెషివ్‌ లవ్‌ మీద ఇదివరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి. అదే థీమ్‌ కు, నువ్వేకావాలి థీమ్‌ కొంత కలిపి తీసిన చిత్రం ఇది. లవ్‌ నైనా, అబ్సెషివ్‌ లవ్‌ నైనా కన్విన్షింగ్‌ గా చెప్పలేకపోవడం తెలుగు దర్శకుల 'ప్రత్యేకత'. ఈ సినిమాలో శ్రీకాంత్‌ పై పిచ్చి ప్రేమ పెంచుకుంటుంది సౌందర్య. కానీ దాన్ని సరిగ్గా చెప్పలేకపోవడమే ఈ సినిమా స్పెషాలిటీ. పార్తేన్‌ రసితన్‌ అనే తమిళ చిత్రం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగుకు అనుగుణంగా మార్చుకోలేకపోవడం కూడా పెద్ద లోపం. బస్సు ప్రేమలు, పృథ్వీ సిల్లీ చేష్టలు...ఇవన్నీ తమిళ సినిమాకు ప్రతీకలు. వాటిని యథతథంగా ఉంచడం ఏమిటో?

    అన్నింటికన్నా ఈ చిత్రానికి పెద్ద మైనస్‌ పాయింట్‌- శ్రీకాంత్‌, సౌందర్య. వీరిద్దరు నువ్వేకావాలిలో తరుణ్‌, రిచా పాత్రలు చేస్తుంటే ప్రేక్షకులు దిక్కులు చూడాలి. టీనేజ్‌ పిల్లలమాదిరిగా వీరు చేసే విన్యాసాలు చూడడం ఎబ్బెట్టుగా ఉంది. రచయితగా జంధ్యాలకిది చివరి చిత్రం. కొన్ని డైలాగ్‌ లు మురిపించాయి. కోట శ్రీనివాసరావు నటన ఈ సినిమాకు హైలెట్‌. ఈ పాత్రకు జంధ్యాల అందించిన డైలాగ్స్‌ బాగున్నాయి. కోట నటన చూశాక, ఇందులో నటించిన వారందరూ ఎంత సిల్లీగా నటించారో అర్థమవుతుంది.

    శ్రీకాంత్‌, సౌందర్య మంచి ఫ్రెండ్స్‌. ఎరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చదివి గోల్లు గిల్లుకుంటూ కలలు కనే శ్రీకాంత్‌ రిచాను చూడగానే ప్రేమిస్తాడు. వీరద్దరి బస్‌ ప్రేమ మూగగా సాగుతూ......నే ఉంటుంది సినిమా చివరకు. ఇద్దరు ఐలవ్యూ అని చెప్పుకోరు(క్లైమాక్స్‌ లో కూడా), పేరు కూడా తెలీదు ఇద్దరికి. ఐనా ప్రేమిస్తాను ఉంటారు. ఈ మూగమనుసుల ప్రేమకు సౌందర్య కూడా సాయం చేస్తుంది. కానీ చివరకు తనే విలన్‌ గా మారుతుంది వీరి ప్రేమకు. నాలుగేళ్ళ నుంచి తను ప్రేమిస్తున్నానని, తనను తప్ప రిచాను పెళ్ళి చేసుకోవడానికి వీలులేదని సౌందర్య అడ్డుపడుతుంది. చివరికి శ్రీకాంత్‌ ఎవర్ని చేసుకుంటాడో ఈజీగానే గెస్‌ చెయ్యచ్చు.

    లావు కావడం తప్పు కాదు. వయసు తగ్గట్లు పాత్రలు పోషించకపోవడమే పెద్ద తప్పు. ఆ తప్పు శ్రీకాంత్‌, సౌందర్యలిద్దరూ చేశారు. పాపం శ్రీకాంత్‌ అంకుల్‌ పక్కన రిచా మరీ చిన్నపిల్ల మాదిరిగా కనిపించింది. సంగీతం ఫర్వాలేదు. దర్శకుడి ప్రతిభ ఏమాత్రం లేని సినిమా ఇది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X